పొద్దున్నే అల్పాహారం రోజంతా శరీరానికి శక్తిని అందించే అత్యంత ముఖ్యమైన భోజనం. రాత్రంతా ఉపవాసం చేసిన తర్వాత శరీరానికి పోషకాలు, శక్తిని అందించే ఆహారం అవసరం
TV9 Telugu
అల్పాహారంలో నారింజ రసం తాగాలా? వద్దా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. నిజానికి ఆరోగ్యపరంగా కొన్ని లాభాలు, నష్టాలు కూడా ఉన్నాయి
TV9 Telugu
నారింజ రసాన్ని తరచూ లేదా ఎక్కువసేపు కొద్దికొద్దిగా తాగడం వల్ల దంతాల పైపొర (ఎనామెల్) దెబ్బతినే అవకాశం ఉంటుంది
TV9 Telugu
అలాగే పండ్ల రసాల్లో సహజ చక్కెరలు ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి ఇవి పరిమిత మోతాదులోనే మంచివి
TV9 Telugu
అందుకే పండ్లను నేరుగా తినడం, రసాన్ని మాత్రం అప్పుడప్పుడు మాత్రమే తీసుకోవడం ఉత్తమం. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అల్పాహారంలో పండ్ల రసాల కంటే పాలు మెరుగైన ఎంపిక
TV9 Telugu
ముఖ్యంగా సేంద్రియ (ఆర్గానిక్) పాలు తీసుకుంటే విటమిన్ ఇ, ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు కొంత ఎక్కువగా లభించే అవకాశం ఉంటుంది
TV9 Telugu
అదే సమయంలో నారింజ రసాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. అయితే దానిని కొద్దికొద్దిగా ఎక్కువసేపు తాగకుండా, ఒకేసారి తాగడం వల్ల దంతాలపై ఆమ్ల ప్రభావం తగ్గుతుంది
TV9 Telugu
గ్లాస్ నారింజ రసం ద్వారా శరీరానికి రోజుకు అవసరమైన విటమిన్ సి దాదాపు పూర్తిగా అందుతుంది. విటమిన్ సి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది