AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కవాసకి నుంచి అప్‌డేటెడ్ నింజా 250 బైక్ విడుదల: కొత్త రంగులు, ప్రత్యేకతలివే

ప్రముఖ జపాన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి తన ప్రసిద్ధ స్పోర్ట్స్ బైక్ 'నింజా 250'ను సరికొత్త అప్‌డేటెడ్ వెర్షన్‌లో విడుదల చేసింది. కొత్త కలర్ ఆప్షన్స్, శక్తివంతమైన ఇంజిన్, ఆధునిక హంగులతో జపాన్ మార్కెట్లో లాంచ్ అయిన ఈ ప్రీమియం స్పోర్ట్స్ బైక్ విశేషాలను వివరంగా తెలుసుకుందాం

కవాసకి నుంచి అప్‌డేటెడ్ నింజా 250 బైక్ విడుదల: కొత్త రంగులు, ప్రత్యేకతలివే
Kawasaki Launches Updated Ninja 250
Nikhil
|

Updated on: Aug 01, 2026 | 7:10 AM

Share

249cc సింగిల్-సిలిండర్ ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో రూపుదిద్దుకున్న ‘నింజా 250’ బైక్ భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు ప్రస్తుతం కనిపించడం లేదు. జపనీస్ యెన్లలో సుమారు రూ. 4.37 లక్షల ధర కలిగి ఉన్న ఈ కవాసకి నింజా 250 పూర్తి వివరాలను తెలుసుకుందాం!

శక్తివంతమైన ఇంజిన్

ప్రముఖ జపాన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి (Kawasaki) తన ప్రసిద్ధ స్పోర్ట్స్ బైక్ నింజా 250 (Ninja 250)ను అప్‌డేటెడ్ వెర్షన్‌లో విడుదల చేసింది. కొత్త కలర్ ఆప్షన్స్, శక్తివంతమైన ఇంజన్, ఆధునిక ఫీచర్లతో ఈ బైక్‌ను జపాన్ మార్కెట్లో లాంచ్ చేసింది. అయితే, ఈ మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశాలు ప్రస్తుతం కనిపించడం లేదు. కొత్త నింజా 250లో 249cc సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను అందించారు. ఈ ఇంజన్ 39 PS పవర్, 23.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. దీంతో నగర రోడ్లతో పాటు హైవేలపై కూడా అత్యంత మెరుగైన పనితీరును అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

ఆకట్టుకునే ఫీచర్లు

కొత్త నింజా 250లో రైడింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరిచే పలు అద్భుతమైన ఫీచర్లను అందించారు. ఇందులో అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్ స్టాండర్డ్‌గా లభిస్తుంది. అలాగే ఎల్ఈడీ హెడ్‌లైట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 17-లీటర్ల భారీ ఫ్యూయల్ ట్యాంక్ వంటి సదుపాయాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ బైక్‌ను ‘లైమ్ గ్రీన్’, ‘డార్క్ మెటాలిక్’ అనే రెండు కొత్త ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు.

భారతదేశంలో లభ్యత

జపాన్‌లో కవాసకి నింజా 250 ధరను 7.26 లక్షల జపనీస్ యెన్లుగా నిర్ణయించారు. భారత కరెన్సీ ప్రకారం ఇది సుమారు రూ. 4.37 లక్షలు అవుతుంది. అయితే, దిగుమతి సుంకాలు మరియు పన్నుల వంటి కారణాల వల్ల ఇతర దేశాల్లో ధర మారే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత మార్కెట్లో కవాసకి సంస్థ నింజా 300 బైక్‌ను మాత్రమే అధికారికంగా విక్రయిస్తోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, 250cc ఇంజన్‌తో నింజా 250ను భారతదేశంలో విడుదల చేసే ప్రణాళిక ప్రస్తుతం కంపెనీకి లేదని తెలుస్తోంది. దీంతో భారతీయ కస్టమర్లు ప్రస్తుతం నింజా 300 మోడల్‌నే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Follow Us