కోళ్ల గూడు నుంచి ఒక్కటే శబ్ధాలు.. వెళ్లి చూసేసరికి కదల్లేని స్థితిలో కోడి.. విషయం తెలిసి షాక్!
విశాఖపట్నం జిల్లాలో నాగుపాము కోళ్ల గూటిలోకి ప్రవేశించి కోడిని చంపి, ఏకంగా 11 గుడ్లను మింగేసింది. గుడ్లు మింగిన తర్వాత కదల్లేని స్థితిలో అక్కడే చిక్కుకుపోయింది. యజమాని గమనించి స్నేక్ క్యాచర్ కిరణ్‌కు సమాచారం ఇవ్వగా, అతను పామును సురక్షితంగా రెస్క్యూ చేసి, గుడ్లను కక్కించి అడవిలో వదిలేశాడు.

ఓ నాగుపాము.. ఆహారం వెతుక్కుంటూ బయలుదేరింది.. తను అంటున్న పొట్టలో నుంచి బయటకు వచ్చి సంచరిస్తూ ఉంది. ఈ సమయంలో తనకు కోడి పట్టు కనిపించింది. పశువుల షెడ్ లో గుడ్లను పొదుగుతున్న కోడి పట్టు పైకి ఎక్కింది ఆ నాగుపాము. ఆ పశువుల పాక యజమాని.. రోజూ మాదిరిగానే కోళ్లు గూటి వరకు వెళ్ళాడు. ఎప్పుడూ అక్కడితో వెళ్లగానే అరిచే ఆ కోడి.. శబ్దం వినిపించలేదు. లోపల తొమ్మిది చూస్తే చీకటిగా ఉంది… కోడి కదల్లేని స్థితిలో ఉండడాన్ని గుర్తించాడు. అనుమానం వచ్చి.. వెలుతురు వేసి చూసేసరికి.. లోపల భారీ నాగుపాము తిష్ట వేసి కూర్చుంది. పక్కనే ప్రాణాల కోల్పోయి కోడిపెట్ట పడి ఉంది. పట్టులో ఉన్న గుడ్లు కనిపించలేదు. దీంతో గుండెలు పట్టుకున్నాడు ఆ యజమాని.
విశాఖ జిల్లా అగనంపూడి సమీపంలోని శనివాడలో ఈ ఘటన జరిగింది. పశువుల పాకలో నాటుకోడి గుడ్లను పెట్టి పొదిగింది కూర్చుంది. ఎలా గమనించిందో ఏమో గానీ ఓ నాగుపాము.. నెమ్మదిగా కోడి గూటిలోకి ప్రవేశించింది. పామును చూసి అరిచి ప్రతిఘటిస్తున్న ఆ కోడిని… ఆ నాగుపాము ముందుగా టార్గెట్ చేసింది. కోడిని కాటేసి చంపేసింది. కోడి ప్రాణాలు విడిచిన తర్వాత గూటిలో ఉన్న కోడిగుడ్లను ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక్కొక్కటిగా మింగేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 గుడ్లను తినేసింది ఆ పాము. కోడిగుడ్లను మింగడంతో ఆ పాము పొట్ట ఉబ్బిపోయింది. కడుపు నిండా గుడ్లు ఉండటంతో ఆ నాగుపాము బరువు పెరిగి.. అక్కడి నుంచి కదల్లేని నిస్సహాయ స్థితికి చేరుకుని గూటిలోనే ఉండిపోయింది.
అలా గుర్తించి.. గుండెలు పట్టుకుని..!
రోజు మాదిరిగానే పశువులపాకలోకి వెళ్లిన ఆ యజమాని.. కోళ్ల గూటి వైపు చూశాడు. దగ్గరకు వెళ్లేసరికి కోడి అలికిడి లేదు. కానీ.. అసాధారణమైన శబ్దాలు వస్తుండటంతో అతనికి అనుమానం వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్లి పరిశీలించిన ఆయనకు.. లోపలి దృశ్యం చూసి గుండె పట్టుకునేంత పనైంది. అప్పటికే తాను ఎంతో ఆసక్తిగా పెంచుకుంటున్న కోడి చనిపోయి పడి ఉండటం.. దాని పక్కనే పొట్టంతా ఉబ్బిపోయి భయంకరంగా కనిపిస్తున్న నాగుపామును చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. భయంతో పరుగులు తీసి… స్నేక్ క్యాచర్ కిరణ్ కు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ కిరణ్.. ఘటనా స్థలాన్ని పరిశీలించాడు. గుడ్లను మింగి కదల్లేని స్థితిలో ఉన్న ఆ నాగుపామును చూసి ఆశ్చర్యపోయాడు. స్నేక్ క్యాచర్ కిరణ్ చాకచక్యంగా ఆ పామును రెస్క్యూ చేశాడు.
పొట్టలోని గుడ్లను కక్కించి..!
గుడ్లను మింగి కదలని స్థితిలో ఉన్న పామును.. పట్టు నుంచి బయటకు తీశాడు స్నేక్ క్యాచర్. అలాగే బంధిస్తే ప్రాణాలు పోయే ఆస్కారం ఉందని భావించిన స్నేక్ క్యాచర్.. ఆ పాము పొట్టలో ఉన్న గుడ్లను కక్కించాడు. ఆ తర్వాత సంచిలో బంధించి.. అడవుల్లో విడిచి పెట్టాడు. గుడ్లను మింగిన ఆ పాము గంటలకొద్దీ అక్కడ నుంచి కదలని స్థితిలో ఉంటుందని.. అటువంటి సందర్భంలో బంధిస్తే ఊపిరాడక ప్రాణాలకు కోల్పోయే ప్రమాదం ఉందని అంటున్నాడు కిరణ్ కుమార్. అందువల్లే మింగిన గుడ్లను కక్కిస్తే మళ్లీ పాము సాధారణస్థితికి వచ్చి యాక్టివ్‌గా మారుతుందని.. అటువంటి పామును మాత్రమే అడవుల్లోకి విడిచి పెట్టాలని అంటున్నాడు స్నేక్ కేచర్ కిరణ్. పామును సురక్షితంగా తీసుకెళ్లి సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఆ పామును బందించే వీడియో మీరూ ఒకసారి లుక్కెయండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
