Cyberattacks: సైబర్ దాడుల ముప్పు.. 96% భారత కంపెనీలకు భారీ షాక్.. AIతో మరింత పెరుగుతున్న ప్రమాదం
Cyberattacks: సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయడంలో కేవలం టెక్నాలజీ లోపాలే ప్రధాన సమస్య కాదని నివేదిక వెల్లడించింది. సంస్థల్లో ఆమోద ప్రక్రియల్లో జాప్యం, విభాగాల మధ్య సమన్వయం లేకపోవడం, డేటా వేర్వేరు చోట్ల ఉండటం వంటి అంతర్గత సమస్యలు కూడా సైబర్ రక్షణను..

Cyberattacks: దేశంలో సైబర్ దాడుల ముప్పు ఏ స్థాయిలో ఉందో తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. గత 12 నెలల్లో 96 శాతం భారత సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలను ప్రభావితం చేసే సైబర్ ఘటనలను ఎదుర్కొన్నట్లు టెక్నాలజీ సంస్థ సిస్కో (Cisco) విడుదల చేసిన Relentless Defense Report తెలిపింది. వీటిలో మూడింట ఒక వంతుకుపైగా ఘటనల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత దాడుల ప్రభావం ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
అయితే భారతదేశంలోని వ్యాపార సంస్థలు తీవ్రమైన సైబర్ సెక్యూరిటీ సవాళ్లను ఎదుర్కొంటున్నాయని ‘సిస్కో’ తన నివేదికలో వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 96% భారతీయ వ్యాపార సంస్థలు సైబర్ దాడులకు గురయ్యాయని, దీనివల్ల వాటి దైనందిన కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలిగిందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.
భారతదేశంలోని వ్యాపార సంస్థల్లో కేవలం 8% సంస్థలు మాత్రమే అత్యుత్తమ సైబర్ సెక్యూరిటీ ప్రమాణాలను సాధించగలిగాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత సైబర్ బెదిరింపులను త్వరగా గుర్తించడంలో ఎంతగానో దోహదపడుతున్నప్పటికీ, కేవలం 40% సంస్థలు మాత్రమే AI ఏజెంట్లను ఉపయోగిస్తున్నాయి. అయితే భద్రత బలహీనపడటానికి కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. సంస్థలలో సరైన సమన్వయం లేకపోవడం, డేటా సంక్లిష్టత, అనుమతుల్లో జరిగే జాప్యం సైబర్ భద్రతను మరింత బలహీనపరుస్తున్నాయని వెల్లడైంది.
8 వేల మంది సెక్యూరిటీ నిపుణులపై సర్వే
సిస్కో రూపొందించిన ఈ నివేదిక కోసం ప్రపంచవ్యాప్తంగా 30 మార్కెట్లకు చెందిన 8,000 మంది సెక్యూరిటీ నిపుణులను సర్వే చేశారు. ఇందులో భారత్‌కు చెందిన 1,000 మంది నిపుణులు కూడా ఉన్నారు. సంస్థలు తమ డిజిటల్ వ్యవస్థలను ఎంత సమర్థంగా రక్షించుకుంటున్నాయి, సైబర్ ముప్పులను ఎంత వేగంగా గుర్తించి పరిష్కరిస్తున్నాయి.. అలాగే సైబర్ సెక్యూరిటీకి అడ్డంకులుగా మారుతున్న అంశాలు ఏంటనే విషయాలను అధ్యయనం చేశారు.
టెక్నాలజీ కంటే సంస్థల మధ్య సమన్వయమే పెద్ద సమస్య:
సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయడంలో కేవలం టెక్నాలజీ లోపాలే ప్రధాన సమస్య కాదని నివేదిక వెల్లడించింది. సంస్థల్లో ఆమోద ప్రక్రియల్లో జాప్యం, విభాగాల మధ్య సమన్వయం లేకపోవడం, డేటా వేర్వేరు చోట్ల ఉండటం వంటి అంతర్గత సమస్యలు కూడా సైబర్ రక్షణను బలహీనపరుస్తున్నాయని పేర్కొంది. భారత్‌లో కేవలం 40 శాతం మంది ప్రతినిధులు మాత్రమే సెక్యూరిటీ, నెట్‌వర్కింగ్, ఐటీ విభాగాలు ఒకే బృందంలా సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
