Aadhaar Card: ఆధార్ కార్డు డిజైన్ మారుతుందా? కేంద్రం క్లారిటీ !!
ఆధార్ కార్డు రూపం మారబోతోందంటూ వస్తున్న పుకార్లను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. కార్డుపై కేవలం ఫోటో, క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటాయనే వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది. ఆధార్ కార్డు డిజైన్ మార్చే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో లేదని, పాత ఫార్మాట్‌లోనే కార్డులు కొనసాగుతాయని ప్రకటించింది. ప్రజలు సోషల్ మీడియాలోని తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, అధికారిక వెబ్‌సైట్ లేదా పీఐబీ ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కోరింది.
ఆధార్ కార్డు రూపం మారిపోతుందంటూ గత కొన్ని రోజులుగా సాగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కార్డుపై కేవలం ఫోటో, క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటాయని, మిగిలిన వివరాలు తొలగిస్తారంటూ వస్తున్న వార్తలను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆదివారం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం వస్తున్న ఊహాగానాలు ప్రజల్లో అనవసర ఆందోళన కలిగిస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది. ఆధార్ కార్డు డిజైన్ మార్చే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని, పాత ఫార్మాట్‌లోనే ఆధార్ కార్డులు కొనసాగుతాయని అధికారిక ప్రకటనలో స్పష్టతనిచ్చింది. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని ప్రజలు గుడ్డిగా నమ్మవద్దని మంత్రిత్వ శాఖ కోరింది. ఆధార్‌కు సంబంధించి ఏదైనా మార్పులు ఉంటే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ తన అధికారిక వెబ్‌సైట్ లేదా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా వెల్లడిస్తుందని ప్రభుత్వం తెలిపింది. సరైన ధ్రువీకరణ లేని వార్తలను ప్రసారం చేయవద్దని మీడియా సంస్థలకు కూడా హితవు పలికింది. ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ వ్యవస్థగా ఉన్న ఆధార్, దేశవ్యాప్తంగా సుమారు 134 కోట్ల మందికి గుర్తింపు కార్డుగా ఉంది. ఇప్పటివరకు 17,000 కోట్లకు పైగా లావాదేవీలు ఆధార్ ద్వారా జరిగాయి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న వ్యవస్థపై వస్తున్న పుకార్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సింగిల్ బ్యాంకు ఖాతాలోనే రూ. 213 కోట్లు.. అప్పులు జీరో..
పనిమనిషి నుంచి ఎమ్మెల్యేగా.. 12 వేలకు పైగా ఓట్ల తేడాతో విక్టరీ
చైన్ స్నాచర్‌ను ఛేజ్ చేసి పట్టుకున్న ఆటోడ్రైవర్.. సజ్జనార్ రియాక్షన్
పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన రైలు..! రెప్పపాటులో ఇద్దరు వ్యక్తులు..
పనిమనిషి నుంచి ఎమ్మెల్యేగా.. 12 వేలకు పైగా ఓట్ల తేడాతో విక్టరీ
చైన్ స్నాచర్‌ను ఛేజ్ చేసి పట్టుకున్న ఆటోడ్రైవర్..
పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన రైలు..! రెప్పపాటులో..
అరగుండు, చెప్పుల దండతో.. యువకుడి ఊరేగింపు.. కారణం ఇదే!
మెట్ గాలాలో ఇషా అంబానీ రాయల్ లుక్.. వజ్రాల బ్లౌజ్‌తో మెరిసిపోతూ..
ఆహా.. మండుటెండలో వానరాల జలకాలాటలు.. చూడాల్సిందే
తామర ఆకులనే ఫేస్ మాస్క్‌లుగా..! వేసవిలో వైరల్ ట్రెండ్

