ఈ మధ్యకాలంలో కొంతమంది హీరోయిన్స్ ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోతున్నారు. చేసిన ఒకే ఒక్క సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటున్నారు.
ఇతర బాషల నుంచి వచ్చిన ముద్దుగుమ్మలు చాలా మంది తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. వారిలో శ్రీనిధి శెట్టి ఒకరు.
శ్రీనిధి శెట్టి మోడల్ గా కెరీర్ మొదలుపెట్టి ఆతర్వాత మిస్ సుప్రనేషనల్ 2016 విజేత. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా కన్నడ, తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తుంది.
2015లో మిస్ కర్ణాటక , మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిళ్లను, 2016లో మిస్ సుప్రనేషనల్ ఇండియా టైటిల్‌ను గెలుచుకుంది.
మిస్ సుప్రనేషనల్ 2016లో భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించి, ఈ టైటిల్‌ను గెలుచుకున్న రెండో భారతీయురాలైంది.
ఇక ముద్దుగుమ్మ 2018లో కన్నడ చిత్రం KGF: ఛాప్టర్ 1లో రీనా దేశాయ్ పాత్రతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది.
తెలుగులో హిట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తెలుసుకదా అనే సినిమా చేసింది.. ఇప్పుడు ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది ఈ చిన్నది.