పశ్చిమ బెంగాల్లో ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనలు ఉద్రిక్తత రేపుతున్నాయి. సువెందు అధికారి పర్సనల్ అసిస్టెంట్ (PA) చంద్రనాథ్‌పై దుండగులు పాయింట్ బ్లాంక్‌లో కాల్పులు జరపడంతో ఆయన దారుణంగా మృతి చెందారు. మధ్యమగ్రామ్లో జరిగిన ఈ ఘటనలో డ్రైవర్ కూడా గాయపడగా, గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అల్లర్లలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.