FASTag New Rule: మీరు ఫాస్ట్‌ట్యాగ్ ఉపయోగిస్తున్నారా? ఈ పొరపాటు చేసినట్లయితే డబుల్ ఛార్జీలు
FASTag New Rule: టోల్ బూత్‌ల వద్ద ఉండే కెమెరాలు అద్దంపై ట్యాగ్ లేని వాహనాలను రికార్డ్ చేస్తాయి. తద్వారా సిబ్బందితో వాగ్వాదానికి దిగినా ఉపయోగం ఉండదు. అందుకే వాహనదారులు తమ ఫాస్ట్‌ట్యాగ్‌ను సరైన పద్ధతిలో విండ్‌స్క్రీన్‌పై అతికించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు..

FASTag New Rule: ఫాస్టాగ్ వాడకానికి సంబంధించి ఎన్‌హెచ్‌ఏఐ ఒక హెచ్చరిక జారీ చేసింది. దీనిని పాటించకపోతే మీ ఫాస్టాగ్ బ్లాక్‌లిస్ట్ చేయబడే అవకాశం ఉంది. మోసపూరిత పద్ధతులను అరికట్టే లక్ష్యంతో ప్రభుత్వం కొంతకాలంగా ఫాస్టాగ్ నిబంధనలను నిరంతరం సవరిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా ఫాస్టాగ్‌ను ఉపయోగించకపోతే దానిని బ్లాక్‌లిస్ట్ చేయవచ్చని ఎన్‌హెచ్‌ఏఐ ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో ప్రకటించింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) వినియోగానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
- ఖచ్చితంగా అతికించాలి: వాహనదారులు తమ ఫాస్ట్‌ట్యాగ్‌ను వాహనం ముందు వైపు ఉండే అద్దం (Windscreen) పై లోపలి వైపు నుండి ఖచ్చితంగా అతికించాలి.
- అతికించకపోతే జరిమానా: ఒకవేళ మీ వద్ద యాక్టివ్‌గా ఉన్న ఫాస్ట్‌ట్యాగ్ ఉన్నప్పటికీ, దానిని అద్దంపై అతికించకుండా చేతితో చూపించినా లేదా లోపల ఎక్కడో పెట్టుకున్నా.. అటువంటి వాహనాలను ‘బ్లాక్ లిస్ట్’ చేసినట్లుగా పరిగణిస్తారు.
- రెట్టింపు ఛార్జీ: అద్దంపై ట్యాగ్ లేని వాహనదారులు టోల్ ప్లాజాల వద్ద ఉన్న రూల్స్ ప్రకారం రెట్టింపు (Double) టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఎందుకు ఈ నిర్ణయం?:
టోల్ ప్లాజాల వద్ద స్కాన్ చేసేటప్పుడు సమయం వృధా కాకుండా ఉండటానికి, అలాగే ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండటానికి NHAI ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
CCTV నిఘా: టోల్ బూత్‌ల వద్ద ఉండే కెమెరాలు అద్దంపై ట్యాగ్ లేని వాహనాలను రికార్డ్ చేస్తాయి. తద్వారా సిబ్బందితో వాగ్వాదానికి దిగినా ఉపయోగం ఉండదు. అందుకే వాహనదారులు తమ ఫాస్ట్‌ట్యాగ్‌ను సరైన పద్ధతిలో విండ్‌స్క్రీన్‌పై అతికించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
నగదు పరిమితులు
- ఏప్రిల్ 2026 నుండి దేశవ్యాప్తంగా NHAI నిర్వహించే రహదారులపై నగదు చెల్లింపులను పూర్తిగా నిషేధించారు. టోల్ చెల్లింపుల కోసం FASTag లేదా UPIని ఉపయోగించాల్సి ఉంటుంది.
- ఒకవేళ మీ ఫాస్టాగ్ చెల్లుబాటులో లేకపోతే, UPI ద్వారా చెల్లింపు చేసేటప్పుడు 25% అదనపు పన్ను విధించనున్నారు.
- గుర్తింపు కార్డు ద్వారా టోల్ మినహాయింపును అరికట్టారు.
- తరచుగా హైవేలపై ప్రయాణించే వారి కోసం వార్షిక పాస్‌లను ప్రవేశపెట్టారు. ప్రైవేట్ కార్లకు సంవత్సరానికి రూ.3,075 రుసుము ఉంటుంది. ఇది 200 ప్రయాణాలకు వర్తిస్తుంది.
ఇది కూడా చదవండి: Multibagger: అదృష్టం అంటే ఇదేనేమో.. రూ.లక్షకు రూ.14 లక్షలు.. ఇన్వెస్టర్లకు పండగే!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
