AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon Health Tips: వానాకాలంలో కీళ్లు, ఒంటి నొప్పులను తరిమికొట్టే సూపర్ ఫుడ్.. రోజూ ఒక్కపూట తింటే

Monsoon health care tips Telugu: వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది జలుబు, దగ్గు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇందుకు ప్రధాన కారణంగా ఈ సీజన్‌లో శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడం. కాబట్టి వర్షాకాలంలో మనం ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వాటిలో నవారా బియ్యం కూడా ఒకటి.. వర్షాకాలంలో ఇవి మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతాయో తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Jul 30, 2026 | 8:07 PM

Share
వర్షాకాలంలో మనం శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి మనని ఆరోగ్యంగా ఉంచడంలో నవారా బియ్యం ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే ఇవి అత్యంత శక్తివంతమైన ఆరోగ్య గుణాలను కలిగి ఉంటుంది. వీటిలో విటమిన్ బి, విటమిన్ సి వంటి ఖనిజాలతో పాటు యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర కణాలను రక్షిస్తాయి.

1 / 5
వర్షాకాలంలో వచ్చే జ్వరం, జలుబు, ఇతర ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే నీరసం, అలసట తొలగించి శరీర బలాన్ని తిరిగి పొందడానికి వర్షాకాలంలో ఈ నవారా గంజి తాగాలని మన పెద్దలు కూడా చెప్తుంటారు.అంతేకాదు వర్షాకాలంలో పెరిగే వాత కోపం వల్ల వచ్చే కీళ్ల నొప్పులు, మెడ నొప్పి, నడుము నొప్పి తగ్గించడంలో న్జవర బియ్యం ఎంతో ఉపయోగపడుతుంది.

2 / 5
సాధారణంగా వర్షాకాలంలో జీర్ణశక్తి చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో నవారా బియ్యం మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఉందుకంటే మిగతా వాటితో పోల్చుకుంటే ఇది చాలా తేలికగా అరుగుతుంది. కాబట్టి గ్యాస్ట్రిక్ సమస్యలు, అల్సర్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది మంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు ఈ బియ్యంలో ఉండే పోషకాలు నాడీ వ్యవస్థను ప్రేరేపించి కండరాలకు బలాన్ని కూడా చేకూరుస్తాయి.

3 / 5
వీటిని ఎలా వండాలో అని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ముందుగా నవారా బియ్యాన్ని నీటిలో శుభ్రంగా 2-3 సార్లు కడగండి. ఇప్పుడు బియ్యం, పెసర్లు, మెంతులు, ఆశాలి విత్తనాలను విడివిడిగా లేదా కలిపి కనీసం 30 నిమిషాల నుండి 1 గంట పాటు నీటిలో నాననివ్వండి. ఇప్పుడు ఒక ప్రెజర్ కుక్కర్ లేదా మందపాటి పాత్ర తీసుకొని, అందులో నానబెట్టిన బియ్యం, పెసర్లు, మెంతులు, ఆశాలి,  జీలకర్ర వేయండి. ఇందులో 4 నుండి 5 కప్పుల నీళ్లు పోసి, రుచికి సరిపడా ఉప్పు వేయండి. కుక్కర్ మూత పెట్టి 4 నుండి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. సాధారణ పాత్రలో అయితే మూతపెట్టి బియ్యం మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి

4 / 5
ప్రెజర్ పూర్తిగా పోయాక మూత తీసి, గంజిని ఒకసారి బాగా కలపండి. చివరిగా పొయ్యి సిమ్ లో ఉంచి, కొబ్బరి పాలు పోసి బాగా కలపండి.కొబ్బరి పాలు పోసాక ఎక్కువ సేపు మరిగించకూడదు. తేలికగా వేడెక్కిన వెంటనే పొయ్యి ఆపేయండి. ఒక వేళ మీకు తీపిగా తినాలనిపిస్తే.. ఉప్పు, కొబ్బరిపాలకు బదులుగా.. ఉడికించిన గంజిలో రుచికి సరిపడా బెల్లం తురుము, ఆవు పాలు కలిపి పాయసంలా కూడా తయారుచేసుకోవచ్చు. తర్వాత ఈ వేడివేడి గంజిని సాయంత్రం వేళల్లో తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.

5 / 5
Follow Us