AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎల్ నినో ఎఫెక్ట్: కరువు కోరల్లో ప్రధాన నగరాలు!

ఎల్ నినో ఎఫెక్ట్: కరువు కోరల్లో ప్రధాన నగరాలు!

Phani CH
|

Updated on: Oct 18, 2026 | 8:46 PM

Share

ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి దేశంలోని పలు ప్రాంతాల్లో నీటి కొరతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌, పుణె, ఛత్రపతి శంభాజీనగర్‌లో నీటి వినియోగంపై ఆంక్షలు, కోతలపై చర్చ సాగుతోంది. హైదరాబాద్‌లోనూ వర్షపాతం లోటు, పెరుగుతున్న వాటర్‌ ట్యాంకర్ల డిమాండ్‌ ఆందోళన కలిగిస్తున్నాయి. రాబోయే వర్షాకాలం వరకు నీటిని పొదుపుగా వాడుకోవాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రజలకు విజ్ఞప్తి చేసినట్లు కథనం పేర్కొంటోంది.

ఎల్‌నినో పడగ విప్పి బుసలు కొడుతోంది. వర్షాకాలంలో కురవాల్సిన వానలను ఎత్తుకెళ్లిపోయింది. ఈ నాలుగు నెలలూ లోటు వర్షపాతం తప్ప.. ఏ ప్రాంతంలోనూ రైతులుగాని.. ప్రజలుగాని సంతోషంగా లేరు. కశ్మీర్‌ టు కన్యాకుమారి.. వర్షపాతం లోటు.. నీటి కరువు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అందుకే మహారాష్ట్రలో అప్రకటిత నీటి ఎమర్జెన్సీ నడుస్తోంది. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక దేశమంతటా కరువు ఛాయలు అలముకున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, తెలంగాణలో నీటి సంక్షోభం పీక్స్‌కు చేరింది. మహారాష్ట్రలోని నాగపూర్, పుణె, ఛత్రపతి శంభాజీనగర్ వంటి నగరాల్లో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. నాగపూర్‌లో నీటిని వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, అక్రమ కనెక్షన్లపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్నారు. పుణెలో ఖడక్వాస్లా డ్యామ్‌లో నీరు పడిపోవడంతో అక్టోబర్ 16 నుంచి 10 శాతం నీటి కోత విధిస్తున్నారు. శంభాజీనగర్ జయక్వాడీ డ్యామ్ నుంచి రోజుకు 164.9 కోట్ల లీటర్ల నీరు ఆవిరవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్‌లో ఇప్పటికీ 27 శాతం లోటు వర్షపాతం ఉంది. భూగర్భ జలాలు రోజుకు 5 నుంచి 10 అడుగులు పడిపోతున్నాయి. నగరంలో రోజూ 150 MGDల నీటి లోటు కనిపిస్తోంది. రోజుకు 6 వేల వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరుగుతోంది. కృష్ణా , గోదావరి, మంజీరా , ఉస్మాన్ సాగర్, గండిపేట నుంచి నీటి సరఫరా జరుగుతున్నప్పటికీ తీవ్ర కొరత వేధిస్తోంది. రాబోయే వర్షాకాలం వరకు నీటిని ఎంతో పొదుపుగా వాడుకోవాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Nagarjuna: దసరాకు ధమాకా.. ‘కింగ్ 100’ నుంచి దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌

అత్తామామలతో కలిసి.. CM విజయ్‌ను తన పెళ్లికి ఆహ్వానించిన అనిరుధ్

5నిమిషాలు కనిపించినందుకే.. హృతిక్‌కి భారీ రెమ్యునరేషన్!

Ranabaali: ‘రణబాలి’కి ఫస్ట్‌డే.. దిమ్మతిరిగే కలెక్షన్స్‌

తన బిడ్డ పెళ్లికి రావాలంటూ.. సీఎం రేవంత్‌కు మారన్ ఆహ్వానం

Follow Us