AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5నిమిషాలు కనిపించినందుకే.. హృతిక్‌కి భారీ రెమ్యునరేషన్!

5నిమిషాలు కనిపించినందుకే.. హృతిక్‌కి భారీ రెమ్యునరేషన్!

Phani CH
|

Updated on: Oct 18, 2026 | 1:59 PM

Share

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘జైలర్‌ 2’లో హృతిక్‌ రోషన్‌ అతిథి పాత్రలో కనిపించారంటూ వార్తలు వైరల్‌ అవుతున్నాయి. కేవలం ఐదు నిమిషాల స్క్రీన్‌ టైమ్‌ కోసం రెండు రోజుల షూటింగ్‌లో పాల్గొని రూ.20 కోట్లకు పైగా పారితోషికం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రెమ్యూనరేషన్‌పై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటులు భాగమైనట్లు కథనం పేర్కొంది.

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన లేటేస్ట్ యాక్షన్‌ మూవీ జైలర్-2. గతంలో రిలీజైన జైలర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. నెల్సన్ దిలీప్‌ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. దసరా కానుకగా ఈనెల 15న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. అయితే ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ అయిదు నిమిషాల అతిథి పాత్రలో మెరిశారు. ఈ సినిమాలో నటించడానికి ఎంత పారితోషికం తీసుకున్నారనే ఆసక్తి నెలకొంది. రెండు రోజుల షూటింగ్‌ కోసం భారీ పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. కేవలం అయిదు నిమిషాల నిడివి కోసం ఆయన ఏకంగా 20 కోట్లకు పైగా రెమ్యునరేషన్‌ తీసుకున్నారట. ఇదే నిజమైతే అతి తక్కువ స్ట్రీన్‌ టైమ్‌కు ఈ స్థాయిలో ఇంత పారితోషికం తీసుకున్న వ్యక్తుల్లో హృతిక్‌ రోషన్‌ నిలివనున్నాడు. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో నటించగా.. రమ్యకృష్ణ, యోగిబాబు కీలక పాత్రల్లో కనిపించారు. మిథున్‌ చక్రవర్తి, మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌ తదితరులు ఈ చిత్రంలో భాగమయ్యారు. ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ నిర్మించింది. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతాన్ని అందించారు. వివిధ సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులు ఈ సినిమాలో భాగం కావడంతో తమిళంతో పాటు ఇతర భాషల ప్రేక్షకుల్లోనూ ఆసక్తి పెరిగింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ranabaali: ‘రణబాలి’కి ఫస్ట్‌డే.. దిమ్మతిరిగే కలెక్షన్స్‌

తన బిడ్డ పెళ్లికి రావాలంటూ.. సీఎం రేవంత్‌కు మారన్ ఆహ్వానం

పెళ్లికి వేలైంది.. ఇన్విటేషన్స్ పంచుతున్న మారన్

Sudigali Sudheer: నిశ్చితార్థం జరిగాక.. సుధీర్ పెళ్లి ఆగిపోయిందా..!

Follow Us