పెళ్లికి వేలైంది.. ఇన్విటేషన్స్ పంచుతున్న మారన్
సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వివాహం చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్, నవంబర్ 21న రిసెప్షన్ అంటూ పలు కథనాలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరి వయసు, వ్యక్తిగత ఆస్తుల విలువపై కూడా చర్చ సాగుతోంది. అయితే వివాహం, తేదీలు, ఆహ్వానాల గురించి అధికారిక ప్రకటన లేకపోవడంతో ఈ వార్తలను ధృవీకరించాల్సి ఉంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ, సన్ నెట్వర్క్ వారసురాలు కావ్య మారన్, సౌత్ ఇండియన్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వార్త ప్రస్తుతం దేశవ్యాప్తంగా తెగ వైరల్ గా మారింది. ఇప్పటికే కావ్య మారన్ తండ్రి కళానిధి మారన్ ఆహ్వానాలు మొదలుపెట్టారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా తాజాగా అందజేశారు.అంతేకాదు సినీ రాజకీయ ప్రముఖులను ఆహ్వానించడానికి ఆయన ఫ్లాన్ కూడా చేసుకున్నారు. వచ్చే నెలలో వీరిద్దరి వివాహం జరగనుంది. ఈ క్రమంలోనే గ్రీస్‌లో జరగనున్న వీరి వివాహ వేడుకలతో పాటు, వీరిద్దరి, వ్యత్యాసం, వ్యక్తిగత ఆస్తుల వివరాలపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. కావ్య మారన్ , అనిరుధ్ రవిచందర్ ఇద్దరూ తమ తమ రంగాలలో అగ్రస్థానంలో కొనసాగుతూ అత్యధికంగా సంపాదిస్తున్నారు. ఇద్దరికీ ఎవరి రంగాల్లో వారికి మంచి గుర్తింపు ఉంది. వీరిద్దరి వయసు మధ్య వ్యత్యాసం కేవలం రెండేళ్లు మాత్రమే. ప్రస్తుతం అనిరుధ్ రవిచందర్‌కు 36 సంవత్సరాలు కాగా, కావ్య మారన్‌కు 34 సంవత్సరాలు. ఈ జంట గ్రీస్‌లో అత్యంత వైభవంగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారని, అనంతరం నవంబర్ 21న గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించనున్నారని సమాచారం. సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ కుమార్తె అయిన కావ్య మారన్ వ్యక్తిగత ఆస్తి విలువ దాదాపు రూ. 400 కోట్ల నుండి రూ. 500 కోట్లు ఉంటుందని అంచనా. ఇక సన్ టీవీ నెట్వర్క్, ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ , సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోని సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్‌ల వ్యాపార బాధ్యతలను ఆమె దగ్గరుండి చూసుకుంటున్నారు. సన్ గ్రూప్ మొత్తం ఆస్తి విలువ ఏకంగా రూ. 26,000 కోట్లకు పైగా ఉందని రిపోర్ట్. ప్రస్తుతం దక్షిణాది చిత్రసీమలోనే మోస్ట్ వాంటెడ్ అండ్ హయ్యెస్ట్ పెయిడ్ మ్యూజిక్ కంపోజర్‌గా అనిరుధ్దూసుకుపోతున్నారు. ఆయన ఒక్కో సినిమాకు రూ. 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. నివేదికల ప్రకారం, అనిరుధ్ వ్యక్తిగత నికర ఆస్తి విలువ దాదాపు రూ. 60 కోట్ల నుండి రూ. 80 కోట్లుగా ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sudigali Sudheer: నిశ్చితార్థం జరిగాక.. సుధీర్ పెళ్లి ఆగిపోయిందా..!
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!
ఈ గీతకార్మికుడి ఐడియా అదిరింది..
మంచును కరిగించేస్తున్న పెంగ్విన్ల మలం..
బెంగాల్లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
పులి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత..

