AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sudigali Sudheer: నిశ్చితార్థం జరిగాక.. సుధీర్ పెళ్లి ఆగిపోయిందా..!

Sudigali Sudheer: నిశ్చితార్థం జరిగాక.. సుధీర్ పెళ్లి ఆగిపోయిందా..!

Phani CH
|

Updated on: Oct 18, 2026 | 1:49 PM

Share

బుల్లితెర నటుడు సుడిగాలి సుధీర్‌ నిశ్చితార్థానికి సంబంధించినవంటూ కొన్ని పాత ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వేడుకలో ధనరాజ్‌, రాకింగ్‌ రాకేష్‌ సహా పలువురు జబర్దస్త్‌ కళాకారులు కనిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో సుధీర్‌కు నిశ్చితార్థం జరిగి, ఆ తర్వాత పెళ్లి ఆగిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఫొటోలపై సుధీర్‌ నుంచి అధికారిక స్పందన రాలేదు. మరోవైపు ఆయన నటిస్తున్న ‘గోట్‌’ సినిమా విడుదలపై కూడా ఆసక్తి నెలకొంది.

బుల్లితెర ప్రపంచంలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్లలో సుడిగాలి సుధీర్ ఒకరు. కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఇఫ్పుడు హీరోగా, అటు వ్యాఖ్యతగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చకున్నాడు. మరోవైపు సోషల్ మీడియాలో, టీవీ రంగంలో ఎక్కడ చూసిన సుధీర్ పెళ్లి గురించి ఏదోక చర్చ నడుస్తూనే ఉంటుంది. అయితే ఇదివరకు చాలా సందర్భాల్లో తన పెళ్లి, ప్రేమ గురించి సుధీర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాజాగా సోషల్ మీడియాలో సుధీర్ నిశ్చితార్థంకు సంబంధించిన కొన్ని పాత ఫోటోస్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆ వేడుకకు ధనరాజ్, రాకింగ్ రాకేష్ సహా ఇతర జబర్దస్త్ ఆర్టిస్టులు సైతం హాజరయ్యారు. అయితే ఆ ఫోటోస్ చూస్తుంటే చాలా కాలం క్రితం పిక్స్ అని తెలుస్తోంది. గతంలో సుధీర్ కు ఒక అమ్మాయితో నిశ్చితార్థం జరిగిందట. కానీ మధ్యలోనే వీరి పెళ్లి ఆగిపోయిందని సమాచారం. పెళ్లి పీటలు ఎక్కకుండానే వీరి బంధం ముక్కలయ్యింది. అయితే ఈ ఫోటోస్ గురించి ఇంకా సుధీర్ రియాక్ట్ కాలేదు. కానీ గత కొన్ని గంటలుగా ఈ ఫోటోస్ మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ వ్యవహారంపై సుధీర్ స్వయంగా స్పందించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఇదిలా ఉంటే.. సుడిగాలి సుధీర్ తమ్ముడికి ఆల్రెడీ పెళ్లైపోయింది. గతంలో తాను ప్రేమించిన అమ్మాయి వదిలేసి వెళ్లిపోవడంతో సుధీర్ చాలా కాలం డిప్రెషన్ లో ఉన్నాడని.. ఆ తర్వాత కోలుకుని జబర్దస్త్ ద్వారా హాస్యనటుడిగా పేరు సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు హీరోగాను అలరిస్తున్నాడు. ప్రస్తుతం సుధీర్ బుల్లితెరపై యాంకర్ గా అలరిస్తూనే మరోవైపు హీరోగాను మెప్పిస్తున్నాడు. అతడు నటిస్తోన్న మూవీ గోట్. ‘పాగల్’ సినిమా ఫేమ్ నరేష్ కుప్పిలి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తమిళంలో ‘బ్యాచిలర్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దివ్యభారతి ఈ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది. ఈ సినిమా షూటింగ్ 2023 లోనే ప్రారంభమైనప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. తొలుత ఈ చిత్రాన్ని 2026 మార్చి 26న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు, కానీ కొన్ని కారణాల వల్ల ఆ సమయంలో వాయిదా పడింది. తాజా అప్‌డేట్స్ ప్రకారం ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ 10 విన్నర్ ఎవరో తేల్చేసిన కౌశల్!

Weather Report: దసరా పండగ వేళ చల్లని కబురు.. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్

ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. దసరాకు 7 వేల ప్రత్యేక బస్సులు

భార్యను లాడ్జ్‌కి తీసుకెళ్లాడు.. రాత్రంత్రా హ్యాపీగా ఉన్నారు.. ఉదయాన్నే బాత్‌రూంలో

Jabardasth Actor Babu: వా.. బాబు..! జబర్దస్త్‌ కమెడియన్ TO సక్సెస్‌ఫుల్ డైరెక్టర్!

Follow Us