తన బిడ్డ పెళ్లికి రావాలంటూ.. సీఎం రేవంత్‌కు మారన్ ఆహ్వానం
సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ తన కుమార్తె కావ్య మారన్ వివాహానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దంపతులను ఆహ్వానించినట్లు సీఎంఓ వెల్లడించింది. దీంతో కావ్య మారన్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ పెళ్లి వార్తలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. అయితే వివాహ తేదీ, వేదిక, ఇతర వివరాలపై ఇరు కుటుంబాల నుంచి పూర్తి అధికారిక ప్రకటన వెలువడినట్లు సమాచారం లేదు. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న తేదీలు, వేదిక వివరాలను ధృవీకరించాల్సి ఉంది.
కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్, సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్ వివాహం నిశ్చయమైన సంగతి తెలిసిందే. చెన్నైలో నవంబర్ 21న వీరిద్దరి వివాహం జరగనుంది. ఈ క్రమంలో తమిళ చిత్రపరిశ్రమతోపాటు భారతీయ చిత్రపరిశ్రమలోని ప్రముఖులను, రాజకీయ నాయకులకు ఆహ్వాన పత్రికలు అందిస్తున్నారు కళానిధి మారన్. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దంపతులను ఆహ్వానించారు. శుక్రవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి దంపతులను కళానిధి మారన్ తన సతీమణి కావేరి మారన్ కలిసి తమ కుమార్తె వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ విషయాన్ని తెలంగాణ సీఎంఓ అధికారిక ప్రకటించింది. అలాగే ఇందుకు సంబంధించిన ఫోటోస్ సైతం పోస్ట్ చేసింది. ఇదిలా ఉంటే.. కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ జంట పెళ్లి వార్త మళ్లీ చర్చనీయాంశంగా మారింది. అయితే, అనిరుధ్ , కావ్య మారన్ కుటుంబాలు పెళ్లికి సంబంధించిన పూర్తి వివరాలను విడిగా అధికారికంగా ప్రకటించాయనే సమాచారం ఏదీ లేదు. కావ్య, అనిరుధ్ ఇరువురు 2025 నుంచి ప్రేమలో ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే తమ కూతురి గురించి వినిపిస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని గతంలో ఇరు కుటుంబాలు వెల్లడించాయి. అయితే అనిరుధ్ బంధువు నటుడు వై.జి. మహేంద్రన్ గత జూన్ లో ఒక ఇంటర్వ్యూలో అనిరుధ్ వివాహ విషయాన్ని వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఆ జంట గ్రీస్‌లో వివాహం చేసుకోవచ్చని, ఆ పెళ్లి నవంబర్ 11న జరిగే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే, పెళ్లి తేదీ, వేదికకు సంబంధించిన వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. నివేదికల ప్రకారం, డాక్టర్ మారన్ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్‌తో పాటు ఇతర ప్రముఖులకు కూడా వివాహ ఆహ్వానాలు పంపనున్నట్లు తెలుస్తోంది. చెన్నైలో జరగనున్న ఈ విందుకు సినీ పరిశ్రమ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లికి వేలైంది.. ఇన్విటేషన్స్ పంచుతున్న మారన్
Sudigali Sudheer: నిశ్చితార్థం జరిగాక.. సుధీర్ పెళ్లి ఆగిపోయిందా..!
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!
ఈ గీతకార్మికుడి ఐడియా అదిరింది..
మంచును కరిగించేస్తున్న పెంగ్విన్ల మలం..
బెంగాల్లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
పులి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత..

