AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FEATURED

అధిక విలువ కొనుగోలు చేసే ముందు EMI చెల్లింపు సామర్థ్యాన్ని ఎలా లెక్కించాలి

EMI: ఇంటి రిపేర్లు, వివాహం లేదా చదువులకు సంబంధించిన ఫీజులు వంటి అధిక విలువ గల వాటికి ఎంతో జాగ్రత్తతో ఆర్థిక ప్రణాళిక అవసరం. మీరు వ్యక్తిగత రుణం ద్వారా దీనికి డబ్బు సమకూర్చుకోవాలని భావిస్తే, మీకు ఎంత రుణం కావాలి..

అధిక విలువ కొనుగోలు చేసే ముందు EMI చెల్లింపు సామర్థ్యాన్ని ఎలా లెక్కించాలి
EMI
Subhash Goud
|

Updated on: Oct 19, 2026 | 1:21 PM

Share

EMI: అధిక విలువ కొనుగోలు చేసే ముందు EMI చెల్లించగల సామర్థ్యాన్ని ఎలా లెక్కించాలి, నెలవారీ చెల్లింపులు ఎలా అంచనా వేయాలి, రుణ కాలపరిమితులు ఎలా పోల్చుకోవాలి, పొదుపుపై ఒత్తిడి లేకుండా ఖర్చులను ఎలా నిర్వహించుకోవాలో తెలుసుకోండి.

ఇంటి రిపేర్లు, వివాహం లేదా చదువులకు సంబంధించిన ఫీజులు వంటి అధిక విలువ గల వాటికి ఎంతో జాగ్రత్తతో ఆర్థిక ప్రణాళిక అవసరం. మీరు వ్యక్తిగత రుణం ద్వారా దీనికి డబ్బు సమకూర్చుకోవాలని భావిస్తే, మీకు ఎంత రుణం కావాలి అనేదే కాకుండా, ప్రతి నెలా మీరు సౌకర్యవంతంగా ఎంత తిరిగి చెల్లించగలరు అనేది కూడా చాలా ముఖ్యమైన ప్రశ్న.

మీ EMI చెల్లింపు సామర్థ్యాన్ని లెక్కించడం ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడంలో మీకు సాయపడుతుంది. మీ ఆదాయం, సాధారణ ఖర్చులు, ఇప్పటికే ఉన్న EMIలు, పొదుపు మొత్తాన్ని సమీక్షించడం ద్వారా ఊహించని ఖర్చుల కోసం కొంత మొత్తాన్ని కేటాయించుకుంటూ, మీ బడ్జెట్‌కు సరిపోయే రుణ మొత్తం, తిరిగి చెల్లించే కాలపరిమితిని మీరు ఎంచుకోవచ్చు.

ఉదాహరణలతో నాలుగు సులభమైన దశలలో EMI చెల్లించగల సామర్థ్యాన్ని ఎలా లెక్కించాలి, మీరు దరఖాస్తు చేసే ముందు తిరిగి చెల్లింపు ఎంపికలను పోల్చడానికి వ్యక్తిగత రుణ EMI క్యాలిక్యులేటర్ ఎలా సాయపడుతుందో ఇది వివరిస్తుంది.

కొనుగోలుకు ముందు మీరు EMI చెల్లించగల సామర్థ్యాన్ని ఎందుకు లెక్కించాలి?

EMI చెల్లింపు సామర్థ్యం అంటే మీ ఇతర ఆర్థిక అవసరాలు తీర్చుకుంటూ ప్రతి నెలా రుణాన్ని తిరిగి చెల్లించగల మీ సామర్థ్యం. రుణం తీసుకునే ముందు మీ చెల్లింపు సామర్థ్యాన్ని పరీక్షించుకోవడం, మీకు తగిన రుణ మొత్తాన్ని, తిరిగి చెల్లించే కాల వ్యవధిని ఎంచుకోవడంలో సాయపడుతుంది.

EMI చెల్లింపు సామర్ధ్యాన్ని లెక్కించడం ఎలా?

నాలుగు దశల్లో మీరు మీ EMI చెల్లింపు సామర్ధ్యాన్ని అంచనా వేయవచ్చు.

1. నెలవారీ ఖర్చు చేయగల మీ ఆదాయన్ని లెక్కించండి నెలవారీగా మీ చేతికి వచ్చే జీతం లేదా సాధారణ ఆదాయంతో ప్రారంభించండి. అవసరమైన ఖర్చులు, ఇప్పటికే ఉన్న రుణ EMIలు, బీమా ప్రీమియంలు, ఇతర పునరావృతమయ్యే ఖర్చులు తీసివేయండి.

ఉదాహరణకు ఇది మీ నెలవారీ బడ్జెట్‌ అనుకోండి:

ఆర్థిక వివరాలు మొత్తం
నెలవారీ చేతికి వచ్చే ఆదాయం రూ. 80,000
అవసరమైన ఖర్చులు రూ. 30,000
ప్రస్తుత EMIలు రూ. 15,000
పొదుపు, ఇతర బాధ్యతలు రూ. 10,000
మిగిలిన మొత్తం రూ. 25,000

మిగిలిన రూ. 25,000 కొత్త EMI కోసం ఆటోమేటిక్‌గా అందుబాటులో ఉండవు. మీరు ఎంత మొత్తాన్ని తిరిగి చెల్లించగలరో నిర్ణయించుకునే ముందు, అనుకోని ఖర్చులు, భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాల కోసం కొంత మొత్తాన్ని పక్కన ఉంచుకోండి.

2. నెలవారీ EMIని అంచనా వేయండి

మీ EMI అనేది రుణ మొత్తం, వడ్డీ రేటు, తిరిగి చెల్లించే కాలపరిమితిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా రుణ మొత్తం లేదా వడ్డీ రేటు ఎక్కువగా ఉంటే మీ EMI పెరుగుతుంది, అదే కాలపరిమితి ఎక్కువగా ఉంటే నెలవారీ వాయిదా తగ్గుతుంది. ఉదాహరణకు, సంవత్సరానికి 14% వడ్డీ రేటుతో రూ. 3 లక్షల వ్యక్తిగత రుణం తీసుకుంటే, తిరిగి చెల్లింపు వివరాలు సుమారుగా దిగువ పేర్కొన్న విధంగా ఉంటాయి:

తిరిగి చెల్లింపు వ్యవధి  నెలవారీ EMI  మొత్తం వడ్డీ
24 నెలలు రూ. 14,404 రూ. 45,693
36 నెలలు రూ. 10,253 రూ. 69,118

24 నెలల కాలపరిమితితో పోలిస్తే 36 నెలల కాలపరిమితిని ఎంచుకోవడం వల్ల నెలవారీ EMI సుమారు రూ. 4,151 తగ్గుతుంది. అయితే, దీనివల్ల చెల్లించాల్సిన మొత్తం వడ్డీ సుమారు రూ. 23,426 పెరుగుతుంది.

ఉపయోగకరమైన సలహా: EMI ఎంచుకునే ముందు వివిధ కాలపరిమితులు పోల్చి చూడండి. తక్కువ నెలవారీ వాయిదా మీ దగ్గర నగదు అందుబాటు ఉండేలా చూడవచ్చు, కానీ మొత్తం వ్యవధిలో చెల్లించాల్సిన పూర్తి వడ్డీని కూడా పరిగణనలోకి తీసుకోండి.

3. పర్సనల్‌ లోన్‌ EMI క్యాలిక్యూలేటర్‌ ఉపయోగించండి

మీరు దరఖాస్తు చేసే ముందు మీ నెలవారీ వాయిదా అంచనా వేయడానికి పర్సనల్‌ లోన్‌ EMI క్యాలిక్యూలేటర్‌ సాయపడుతుంది. అంచనా వేసిన EMI, మొత్తం వడ్డీ, తిరిగి చెల్లించాల్సిన మొత్తాన్ని చూడటానికి రుణ మొత్తం, వడ్డీ రేటు, తిరిగి చెల్లించే కాల వ్యవధి నమోదు చేయండి. వివిధ రుణ ఎంపికలు పోల్చడానికి మీరు ఈ అంకెలను అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది మీ నెలవారీ బడ్జెట్‌కు సరిపోయే తిరిగి చెల్లింపు ప్రణాళికను గుర్తించడాన్ని సులభతరం చేస్తుంది.

4. ఆర్థిక బఫర్‌ ఉంచుకోండి

మీ ఖర్చు చేయగల ఆదాయం మొత్తాన్ని రుణ చెల్లింపులకే కేటాయించవద్దు. వైద్య ఖర్చులు, ఇంటి మరమ్మతులు, బీమా ప్రీమియంలు, ఇతర అనుకోని ఖర్చుల కోసం తగినంత డబ్బు అందుబాటులో ఉంచుకోండి.

ఆచరణాత్మకమైన చెల్లింపు సామర్థ్య అంచనా, EMI, తిరిగి చెల్లించిన తర్వాత అందుబాటులో ఉండే పొదుపు రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటుంది. ఇది మీ నెలవారీ బడ్జెట్‌పై ఒత్తిడిని నివారించడంలో మీకు సాయపడుతుంది.

అధిక విలువతో కూడిన ఖర్చుల నిర్వహణలో పర్సనల్‌ లోన్‌ ఎలా సాయపడుతుంది?

హామీ అవసరం లేకుండా ప్రణాళికాబద్ధమైన లేదా అనుకోని ఖర్చుల కోసం కావాల్సిన డబ్బును పర్సనల్‌ లోన్‌ అందించగలదు. బజాజ్ ఫైనాన్స్ రూ. 40,000 నుంచి రూ.55 లక్షల వరకు వ్యక్తిగత రుణాలు, 12 నెలల నుండి 108 నెలల వరకు తిరిగి చెల్లించే కాల వ్యవధితో అందిస్తుంది. మీరు ఈ దిగువ ఖర్చుల కోసం వ్యక్తిగత రుణాన్ని పరిగణించవచ్చు:

మీరు ఈ దిగువ ఖర్చుల కోసం వ్యక్తిగత రుణాన్ని పరిగణించవచ్చు:

  • ఇంటి మరమ్మతులు: రిపేర్లు, పెయింటింగ్‌, ఫర్నిషింగ్‌ లేదా ఇంటికి సంబంధించిన ఇతర పనుల కోసం.
  • చదువు: చదువులకు సంబంధించిన అవసరమైన ఖర్చుల కోసం.
  • వివాహాలు: వేదిక, కేటరింగ్, ఇతర ఈవెంట్‌ ఖర్చుల కోసం.
  • ప్రయాణం: మీ తిరిగి చెల్లింపు సామర్ధ్యానికి అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకున్న ప్రయాణ ఖర్చుల కోసం.
  • వైద్యపరంగా అత్యవసర పరిస్థితులు: అందుబాటులో ఉన్న డబ్బు సరిపోనప్పుడు అత్యవసర వైద్య ఖర్చుల కోసం
  • పండగ సందర్భంగా భారీ ఖర్చులు: ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫర్నిచర్ లేదా ఇంటి అప్‌గ్రేడ్‌ వంటి ప్రణాళికాబద్ధమైన పండగ కొనుగోళ్ల కోసం మీ బడ్జెట్‌కు తగిన EMIల కోసం.

రుణం తీసుకునే ముందు రుణ వ్యయాన్ని మీ దగ్గర అందుబాటులో ఉన్న పొదుపు, ఇతర అనువైన నిధుల ఎంపికలతో పోల్చి చూసుకోండి. మీకు అవసరమైన, సహేతుకంగా తిరిగి చెల్లించగల మొత్తాన్ని మాత్రమే రుణంగా తీసుకోండి.

పర్సనల్‌ లోన్ ఎందుకు సౌకర్యవంతమైన ఆర్థిక ఎంపిక?

మీ పొదుపు మొత్తం నుంచి ఒకేసారి చెల్లించే బదులుగా, క్రమబద్ధమైన నెలవారీ చెల్లింపుల ద్వారా ఒక ముఖ్యమైన ఖర్చు నిర్వహణలో పర్సనల్‌ లోన్‌ మీకు సహాయపడుతుంది. వర్తించే అర్హత, నిబంధనలకు లోబడి బజాజ్‌ ఫైనాన్స్‌ పరన్సల్‌ లోన్ అనేక ఫీచర్లు అందిస్తుంది:

  • ఎటువంటి పూచీకత్తు అవసరం లేదు: మీరు ఆస్తి లేదా ఇతర వస్తువులు తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు.
  • సౌకర్యవంతమైన తిరిగి చెల్లింపు వ్యవధి: అందుబాటులో ఉన్న 12 నెలల నుంచి 108 వరకు వ్యవధి ఎంచుకోండి.
  • ఆన్‌లైన్‌ అప్లికేషన్‌: ఆన్‌లైన్‌లో అప్లై చేసి మీకు అందుబాటులో ఉన్న ఆఫర్ పరిశీలించండి.
  • త్వరిత అప్రూవల్‌: అర్హతగల దరఖాస్తులకు అవసరమైన పరిశీలన తర్వాత త్వరిత ఆమోదం పొందగలవు.
  • అతి తక్కువ పత్రాలు: మీ ప్రొఫైల్‌, కోరిన సమాచారాన్ని బట్టి పత్రాల అవసరం ఉంటుంది.
  • 24 గంటల్లో పంపిణీ *: ఆమోదం, పరిశీలనకు లోబడి అర్హులైన దరఖాస్తుదారులు 24గంటల్లో* ఆమోదించిన మొత్తాన్ని అందుకోవచ్చు.

వర్తించే ఆఫర్, నిబంధనలను బట్టి వడ్డీ రేట్లు సంవత్సరానికి 10% నుంచి 30.5% వరకు ఉంటాయి.

పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసే ముందు మీరు ఏమి పరిశీలించాలి?

పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసే ముందు మీ అర్హత సరిచూసుకోండి, అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోండి, మీకు అనుకూలమైన EMIని లెక్కించండి. ఇది మీ దరఖాస్తు ప్రక్రియను క్రమబద్ధీకరించడం, అవసరమైన ధ్రువీకరణను పూర్తి చేయడంలో మీకు సహాయపడుతుంది.

బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ కోసం ప్రాథమిక అర్హత ప్రమాణాలు ఇవి:

జాతీయత  భారతీయులు
వయస్సు 21 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాలు
కస్టమర్‌ ప్రొఫైల్‌ స్వయం ఉపాధి లేదా వేతనం పొందేవారు
యజమాని (జీతం పొందే దరఖాస్తుదారుల కోసం) ప్రభుత్వ, ప్రైవేట్ లేదా ఎంఎన్‌సీ
సిబిస్‌ స్కోర్ 650 లేదా అంత కంటే ఎక్కువ
  • రుణ కాలపరిమితి ముగిసే సమయానికి మీ వయస్సు 80 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ ఉండాలి.
  • ఇతర అర్హత నిబంధనలు కూడా వర్తిస్తాయి. ఈ ప్రమాణాలు పూర్తి చేసినంత మాత్రాన రుణం మంజూరుకు హామీ లభించదు.

పర్సనల్‌ లోన్‌ అవసరమయ్యే పత్రాలు సిద్ధం చేసుకోండి

మీ కస్టమర్ ప్రొఫైల్, ధ్రువీకరణ అవసరాలకు తగినట్టుగా దిగువ పత్రాలు అందుబాటులో ఉంచుకోండి.

  • కేవైసీ పత్రాలు: ఆధార్/ పాస్‌పోర్ట్/ ఓటరు గుర్తింపు కార్డు/ డ్రైవింగ్ లైసెన్స్/ జాతీయ జనాభా రిజిస్టర్ లేఖ/ ఎన్‌ఆర్‌ఈజీఏ జాబ్ కార్డ్
  • పాన్ కార్డ్
  • ఉద్యోగి గుర్తింపు కార్డు
  • గత 3 నెలల జీతం స్లిప్‌లు
  • గత 3 నెలల బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్‌లు
  • పైప్డ్ గ్యాస్ బిల్లు
  • పెన్షన్ ఆర్డర్
  • యజమాని జారీ చేసిన వసతి కేటాయింపు లేఖ
  • ఆస్తి / మున్సిపల్ పన్ను రసీదు
  • యుటిలిటీ బిల్లు
  • ఫోన్ బిల్లు
  • రియల్-టైమ్ ఇమేజ్/ఫొటోగ్రాఫ్

గుర్తుంచుకోండి: పైన పేర్కొన్న అన్ని పత్రాలు మీరు సమర్పించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అడిగే పత్రాలు మీ ప్రొఫైల్, ధ్రువీకరణ అవసరాలపై ఆధారపడి ఉంటాయి.

మీ పత్రాలు సిద్ధమయ్యాక మీ నెలవారీ వాయిదా అంచనా వేయడానికి పర్సనల్ లోన్ EMI (ఈఎంఐ) క్యాలిక్యులేటర్‌ ఉపయోగించండి. ఎంత రుణం తీసుకోవాలో నిర్ణయించుకునే ముందు, EMI (ఈఎంఐ)ని మీ ఆదాయం, ప్రస్తుత బాధ్యతలు, సాధారణ ఖర్చులతో పోల్చి చూసుకోండి.

ఆమోదం అనేది అర్హత, పత్రాల ధ్రువీకరణ, వర్తించే నియమ నిబంధనలకు లోబడి ఉంటుంది.

అవగాహనతో కూడిన నిర్ణయం తీసుకోండి:

అధిక విలువ చేసే కొనుగోళ్లు చేపట్టడానికి ముందు EMI చెల్లింపు సామర్థ్యాన్ని లెక్కించుకున్నట్టు అయితే మీ ప్రస్తుత అవసరాలను భవిష్యత్ ఆర్థిక బాధ్యతలతో సమతుల్యం చేసుకోవడంలో మీకు సాయపడుతుంది. ఎంత రుణం తీసుకోవాలో నిర్ణయించుకునే ముందు మీ ఖర్చు చేయగల ఆదాయాన్ని సమీక్షించుకోండి, తిరిగి చెల్లించే కాలపరిమితులు పోల్చుకోండి, ఆర్థిక వెసులుబాటు కలిగి ఉండండి. మీ తిరిగి చెల్లింపులు అంచనా వేయడానికి బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ EMI క్యాలిక్యులేటర్‌ ఉపయోగించండి. మీకు అందుబాటులో ఉన్న రుణ మొత్తం, వడ్డీ రేటు, కాలపరిమితిని సమీక్షించుకోవడానికి, మీరు మీ అర్హతను తనిఖీ చేసుకొని బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

  • నియమనిబంధనలు వర్తిస్తాయి. 24 గంటలలోపు పంపిణీ అనేది ఆమోదం, పత్రాల ధ్రువీకరణ, వర్తించే నిబంధనలకు లోబడి ఉంటుంది.

Follow Us
Disclaimer: ఇది స్పాన్సర్ చేయబడిన కథనం. ఇక్కడ ఉన్న సమాచారం, క్లెయిమ్‌లు పూర్తిగా ప్రకటనల కంపెనీకి చెందినవి. ఈ కథనంలోని కంటెంట్ లేదా క్లెయిమ్‌లకు tv9telugu.com బాధ్యత వహించదు. దయచేసి దాన్ని ఉపయోగించే ముందు మీ సొంత సమాచారాన్ని ధృవీకరించండి.
అధిక విలువ కొనుగోలు చేసే ముందు EMI చెల్లింపు ఎలా లెక్కించాలి
అధిక విలువ కొనుగోలు చేసే ముందు EMI చెల్లింపు ఎలా లెక్కించాలి
కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడి సూసైడ్ నోట్!
కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడి సూసైడ్ నోట్!
వెస్టిండీస్ సిరీస్‌తో బయటపడ్డ టీమిండియా బలహీనతలు..
వెస్టిండీస్ సిరీస్‌తో బయటపడ్డ టీమిండియా బలహీనతలు..
మూడు గ్రహాల వక్రగతితో వీరికి అపరిమిత అదృష్టం!
మూడు గ్రహాల వక్రగతితో వీరికి అపరిమిత అదృష్టం!
న్యూజిలాండ్‌లో అడుగుపెట్టిన వైభవ్.. ఎయిర్‌పోర్టులో ఊహించని సీన్..
న్యూజిలాండ్‌లో అడుగుపెట్టిన వైభవ్.. ఎయిర్‌పోర్టులో ఊహించని సీన్..
కొత్త ఫోన్ ఇవ్వాల్సిందే.. జరిమానా కట్టాల్సిందే..
కొత్త ఫోన్ ఇవ్వాల్సిందే.. జరిమానా కట్టాల్సిందే..
ఇలా చేస్తేనే ప్లేయింగ్ 11లో వైభవ్ సూర్యవంశీకి చోటు : ఆకాశ్ చోప్రా
ఇలా చేస్తేనే ప్లేయింగ్ 11లో వైభవ్ సూర్యవంశీకి చోటు : ఆకాశ్ చోప్రా
వేలంలో లక్షల రూపాయలు పలికిన అమ్మవారి పూలమాల..!
వేలంలో లక్షల రూపాయలు పలికిన అమ్మవారి పూలమాల..!
మొండెం లేని ఆ తలలు ఎవరివి?OTTలో ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
మొండెం లేని ఆ తలలు ఎవరివి?OTTలో ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
ఎల్ నినో ఎఫెక్ట్‌..హైదరాబాద్‌కు తాగునీటి కష్టాలు!రాబోయే రోజుల్లో
ఎల్ నినో ఎఫెక్ట్‌..హైదరాబాద్‌కు తాగునీటి కష్టాలు!రాబోయే రోజుల్లో