AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నవంబర్ 1 నుంచి కొత్త రూల్.. ఇక మీకు 'అన్ నోన్' నంబర్ల నుంచి కాల్స్ ..!

నవంబర్ 1 నుంచి కొత్త రూల్.. ఇక మీకు ‘అన్ నోన్’ నంబర్ల నుంచి కాల్స్ ..!

Phani CH
|

Updated on: Oct 18, 2026 | 9:02 PM

Share

స్పామ్‌, సైబర్‌ మోసాల కాల్స్‌ను నియంత్రించే లక్ష్యంతో కాలర్‌ పేరు చూపించే CNAP సేవను అమలు చేయాలని టెలికాం శాఖ నిర్ణయించినట్లు సమాచారం. ఈ విధానం అమల్లోకి వస్తే, తెలియని నంబర్‌ నుంచి కాల్‌ వచ్చినప్పుడు నంబర్‌తో పాటు కాలర్‌ పేరు కూడా కనిపించవచ్చు. అయితే నవంబర్‌ 1 నుంచి దేశవ్యాప్తంగా తప్పనిసరి అమలు, CLIR సదుపాయం, సంస్థల పేర్ల ప్రదర్శన వంటి వివరాలను అధికారిక ప్రకటనతో ధృవీకరించాలి.

దేశంలో ప్రతీ ఒక్కరినీ తీవ్రంగా వేధిస్తున్న సమస్య స్పామ్, సైబర్ ఫ్రాడ్ కాల్స్. పరిచయం లేని నంబర్ల నుంచి రోజూ పదుల సంఖ్యలో వచ్చే ప్రకటనలు, మోసపూరిత కాల్స్‌తో వినియోగదారులు విసిగిపోతున్నారు. ఈ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు కేంద్ర టెలికమ్యూనికేషన్ల విభాగం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1వ తేదీ నుంచి దేశంలోని అన్ని టెలికాం సంస్థలు ‘కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్’ సేవలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ నిబంధన అమల్లోకి వచ్చాక 4G, 5G నెట్‌వర్క్ వినియోగదారులకు ఎవరైనా కాల్ చేస్తే, ఆ నంబర్‌తో పాటు సదరు వ్యక్తి పేరు కూడా స్క్రీన్‌పై స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ ఆ నంబర్ మీ కాంటాక్ట్ లిస్ట్‌లో లేకపోయినా, సదరు వ్యక్తి సిమ్ కార్డ్ తీసుకునేటప్పుడు ఇచ్చిన అధికారిక పేరు టెలికాం డేటాబేస్ ద్వారా డిస్‌ప్లే అవుతుంది. విదేశాల నుంచి వచ్చే కాల్స్ విషయంలో ‘ఇంటర్నేషనల్ కాల్’ అని ప్రత్యేకంగా సూచిస్తుంది. కంపెనీల కాల్స్ అయితే వారి జీఎస్టీ లేదా ట్రేడ్‌మార్క్ పేరు కనిపిస్తుంది. తమ పేరు ఇతరులకు కనిపించకూడదని భావించే వారి కోసం ‘కాలింగ్ లైన్ ఐడెంటిఫికేషన్ రిస్ట్రిక్షన్’ (CLIR) ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. దీనిని యాక్టివేట్ చేసుకుంటే పేరు గోప్యంగా ఉంటుంది. అలాగే భద్రత దృష్ట్యా కాల్ ముగిసిన తర్వాత కాలర్ పేరు ఫోన్‌లో స్టోర్ కాకుండా చర్యలు తీసుకోనున్నారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సిఫారసుల మేరకు అమల్లోకి వస్తున్న ఈ నిర్ణయం ద్వారా దేశంలో ఫ్రాడ్, స్పామ్ కాల్స్‌కు పెద్ద ఎత్తున అడ్డుకట్ట పడనుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

OPPO F35 5Gలో ఇన్ని ఫీచర్లా? అదిరిపోయే బ్యాటరీతో దుమ్మురేపుతోంది!

తెలివిగా ఫోను కొట్టేద్దామనుకున్నాడు.. అందుకే చుక్కలు చూపించారు!

Nagarjuna: దసరాకు ధమాకా.. ‘కింగ్ 100’ నుంచి దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌

అత్తామామలతో కలిసి.. CM విజయ్‌ను తన పెళ్లికి ఆహ్వానించిన అనిరుధ్

5నిమిషాలు కనిపించినందుకే.. హృతిక్‌కి భారీ రెమ్యునరేషన్!

Follow Us