AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OPPO F35 5Gలో ఇన్ని ఫీచర్లా? అదిరిపోయే బ్యాటరీతో దుమ్మురేపుతోంది!

OPPO F35 5Gలో ఇన్ని ఫీచర్లా? అదిరిపోయే బ్యాటరీతో దుమ్మురేపుతోంది!

Phani CH
|

Updated on: Oct 18, 2026 | 8:48 PM

Share

ఒప్పో ఎఫ్‌ సిరీస్‌ పదేళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఎఫ్‌35 5జీ, ఎఫ్‌35 ప్రో 5జీ మోడళ్లను విడుదల చేసినట్లు ప్రచార కథనం పేర్కొంటోంది. 50 ఎంపీ అల్ట్రా వైడ్‌ ఫ్రంట్‌ కెమెరా, 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్‌ ఛార్జింగ్‌, AMOLED డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. ప్రో మోడల్‌లో 4K వీడియో రికార్డింగ్‌ సదుపాయం కూడా ఉందని సమాచారం. ధరలు, లభ్యత వివరాలను కొనుగోలుకు ముందు అధికారికంగా నిర్ధారించుకోవాలి.

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఒక సరికొత్త సంచలనం! టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఒక హాట్ టాపిక్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీతో మన ముందుకు వచ్చే ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో.. ఇప్పుడు మరో భారీ బ్లాక్‌బస్టర్ లాంచ్‌తో మన ముందుకొచ్చింది. అసలు మ్యాటర్ ఏంటంటే.. భారత్‌లో ఒప్పో ఎఫ్ సిరీస్ అడుగుపెట్టి విజయవంతంగా పదేళ్లు పూర్తయ్యాయి! ఈ పదేళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని.. కంపెనీ మార్కెట్లోకి తెచ్చిన సరికొత్త అస్త్రమే ఒప్పో ఎఫ్35 సిరీస్! అసలు ఈ ఫోన్‌లో ఏముంది? ఎందుకు ఇది మార్కెట్‌లో ఇంత హాట్ టాపిక్ అవుతోంది? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం! భారత్‌లో ఒప్పో ఎఫ్ సిరీస్‌కు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. దశాబ్ద కాలంగా కోట్లాది మంది వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకున్న ఈ సిరీస్ నుంచి.. ఇప్పుడు రెండు అదిరిపోయే మోడల్స్ మార్కెట్లోకి వచ్చాయి. అవే ఒప్పో ఎఫ్35 ప్రో 5జీ, ఒప్పో ఎఫ్35 5జీ! ఈ ఫోన్ల స్పెషల్ ఏంటంటే.. ముఖ్యంగా ఫొటోగ్రఫీ ప్రియులను, సెల్ఫీ లవర్స్‌ను, సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ కంటెంట్ క్రియేట్ చేసే యువతను టార్గెట్ చేస్తూ దీన్ని డిజైన్ చేశారు. ఇక కెమెరా సెటప్ గురించి మాట్లాడుకోవాలి బాసూ! ఈ ఫోన్ ఫ్రంట్ కెమెరా చూస్తే మీరు ఫిదా అయిపోవాల్సిందే. ఇందులో ఏకంగా 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇది ఏకంగా 100 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఇస్తుంది. అంటే అర్థం ఏంటి? మీ ఫ్రెండ్స్ అందరితో కలిసి ఒకే ఫ్రేమ్‌లో గ్రూప్ సెల్ఫీ దిగితే.. పక్కన ఉన్నవాళ్లు కట్ అయిపోవడం, అడ్జస్ట్ అవ్వడం లాంటి ఇబ్బందులే ఉండవు! అందరూ పర్ఫెక్ట్‌గా ఆ ఫ్రేమ్‌లో ఇమిడిపోతారు. ఇక ప్రో మోడల్ విషయానికి వస్తే.. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంది. అంతేకాదు, ముందు, వెనుక కెమెరాలతో ఏకంగా 4K వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. వీడియో క్రియేటర్లకు ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పాలి. పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే.. ఒప్పో ఎఫ్35 ప్రో 5జీ మోడల్‌లో శక్తివంతమైన మీడియా టెక్‌ డైమెన్‌సిటీ7 3 6 0 MAX ప్రాసెసర్‌ ఉంది. అంటే గేమింగ్ కానివ్వండి, హెవీ టాస్క్‌లు కానివ్వండి.. ఎలాంటి లాగ్ లేకుండా రాకెట్ లా దూసుకుపోతుంది. ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే.. 1.5K రిజల్యూషన్‌తో కూడిన 144హార్ట్స్ AMOLED డిస్‌ప్లే ఇచ్చారు. స్క్రీన్ స్క్రోలింగ్ చేస్తుంటే వెన్నలా జారిపోతుంది అంత స్మూత్‌గా ఉంటుంది! ఇప్పుడు చెప్పబోయే ఫీచరే ఈ ఫోన్‌కి అసలైన హైలైట్! మార్కెట్లో ఏ ఫోన్ చూసినా 5000mAh బ్యాటరీ ఇస్తున్నారు.. కానీ ఒప్పో మాత్రం ఇక్కడ నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడింది. ఈ ఎఫ్35 సిరీస్‌లోని రెండు మోడళ్లలోనూ ఏకంగా 8,000mAh భారీ బ్యాటరీని అమర్చారు! రోజంతా గేమ్స్ ఆడినా, నాన్‌స్టాప్‌గా వీడియోలు చూసినా, సోషల్ మీడియాలో గంటల తరబడి గడిపినాసరే.. బ్యాటరీ ఖాళీ అవ్వదు. ఒకవేళ అయిపోయినా టెన్షన్ పడాల్సిన పనిలేదు.. ఎందుకంటే దీంట్లో 80వార్ట్‌ సూపర్‌ వోక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. క్షణాల్లో ఫోన్ ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అలాగే దుమ్ము, నీటి నుంచి రక్షించడానికి పక్కా వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఇచ్చారు. అంతేకాకుండా మిలిటరీ-గ్రేడ్ డ్రాప్ ప్రొటెక్షన్ కూడా ఉంది. సాఫ్ట్‌వేర్ పరంగా ఏఐ కాల్ గార్డ్, ఏఐ డాక్యుమెంట్ స్కానింగ్ వంటి లేటెస్ట్ ఫీచర్లు ఇవ్వడం విశేషం. మరి ఇన్ని అద్భుతమైన ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ల ధరలు ఎలా ఉన్నాయి? ఒప్పో ఎఫ్35 ప్రో 5జీ రేట్‌ విషయానికి వస్తే.. 6GB + 128GB వేరియంట్ ధర 45వేల 999 రూపాయలుగా ఉంది. 8GB + 128GB వేరియంట్ ధర 49 వేల 999 రూపాయలు, 8GB + 256GB వేరియంట్ ధర 54వేల 999 రూపాయలుగా నిర్ణయించారు. అలాగే, ఒప్పో ఎఫ్35 5జీ ధరలు చూస్తే.. 6GB + 128GB వేరియంట్ ధర 38వేల 999లుగా ఉంది. 8GB + 128GB వేరియంట్ ధర 42వేల 999 రూపాయలుగా నిర్ణయించారు. ఇవి ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లతో పాటు, ఒప్పో ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలు Flipkart, Amazonలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని వినియోగదారుల కోసం ఒప్పో ప్రత్యేకంగా 20 ఎక్స్‌క్లూజివ్ సర్వీస్ సెంటర్‌లను కూడా అందుబాటులో ఉంచింది. ఏ చిన్న సమస్య వచ్చినా ఇమ్మీడియట్‌గా సర్వీస్ చేసుకోవచ్చు!చూశారుగా ఫ్రెండ్స్! 10 ఏళ్ల సక్సెస్‌ఫుల్‌ జర్నీని సెలబ్రేట్ చేసుకుంటూ ఒప్పో తెచ్చిన ఈ ఎఫ్35 సిరీస్.. పవర్‌ఫుల్ బ్యాటరీ, అదిరిపోయే కెమెరా, ప్రీమియం లుక్స్‌తో మార్కెట్‌లో గట్టి పోటీ ఇస్తోంది. మరి ఈ ఫోన్లలో మీకు ఏ ఫీచర్ బాగా నచ్చింది? మీరు దీన్ని కొనుగోలు చేస్తారా? కింద కామెంట్ సెక్షన్‌లో మీ అభిప్రాయాన్ని చెప్పండి!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెలివిగా ఫోను కొట్టేద్దామనుకున్నాడు.. అందుకే చుక్కలు చూపించారు!

Nagarjuna: దసరాకు ధమాకా.. ‘కింగ్ 100’ నుంచి దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌

అత్తామామలతో కలిసి.. CM విజయ్‌ను తన పెళ్లికి ఆహ్వానించిన అనిరుధ్

5నిమిషాలు కనిపించినందుకే.. హృతిక్‌కి భారీ రెమ్యునరేషన్!

Ranabaali: ‘రణబాలి’కి ఫస్ట్‌డే.. దిమ్మతిరిగే కలెక్షన్స్‌

Follow Us