AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అద్భుతం..! పోలవరం వద్ద సరికొత్త అందాలు.. స్వచ్ఛమైన నీలి వర్ణంలో మెరిసిపోతున్న గోదారమ్మ!

ప్రకృతి అందాలకు గోదావరి నది మరోసారి అద్దం పడుతోంది. కొన్ని నెలలుగా వరద ఉద్ధృతితో ఎరుపు, గోధుమ రంగుల్లో కనిపించిన గోదావరి జలాలు ఇప్పుడు స్పష్టమైన నీలి రంగులోకి మారాయి. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడం, వరద ప్రవాహం సద్దుమణగడంతో పోలవరం స్పిల్‌వే పరిసరాల్లో నదీ జలాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. నది రూపంలో వచ్చిన ఈ మార్పు స్థానికులను, పర్యాటకులను ఆకట్టుకుంటోంది.

అద్భుతం..! పోలవరం వద్ద సరికొత్త అందాలు.. స్వచ్ఛమైన నీలి వర్ణంలో మెరిసిపోతున్న గోదారమ్మ!
Godavari River, Polavaram
B Ravi Kumar
| Edited By: |

Updated on: Oct 19, 2026 | 1:37 PM

Share

పోలవరం: ప్రకృతి అందాలకు గోదావరి నది మరోసారి అద్దం పడుతోంది. కొన్ని నెలలుగా వరద ఉద్ధృతితో ఎరుపు, గోధుమ రంగుల్లో కనిపించిన గోదావరి జలాలు ఇప్పుడు స్పష్టమైన నీలి రంగులోకి మారాయి. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడం, వరద ప్రవాహం సద్దుమణగడంతో పోలవరం స్పిల్‌వే పరిసరాల్లో నదీ జలాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. నది రూపంలో వచ్చిన ఈ మార్పు స్థానికులను, పర్యాటకులను ఆకట్టుకుంటోంది.

వరదలతో ఎరుపు, గోధుమ రంగుల్లో జలాలు

జూలై నుంచి అక్టోబరు మొదటి వారం వరకు ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో గోదావరికి వరద పోటెత్తింది. కొండలు, వాగులు, వంకల నుంచి వరద నీటితో పాటు భారీగా మట్టి, ఇసుక, ఇతర అవక్షేపాలు నదిలోకి చేరాయి. దీంతో పోలవరం స్పిల్‌వే వద్ద గోదావరి జలాలు ఎరుపు, రాగి, గోధుమ రంగుల ఛాయల్లో కనిపించాయి. నీటిలో మట్టి కణాలు ఎక్కువగా ఉండటం, ప్రవాహ వేగం అధికంగా ఉండటంతో నది ఉగ్రరూపం దాల్చినట్లు కనిపించింది.

నీలి రంగులో మెరిసిపోతున్న గోదారమ్మ

అక్టోబరు మధ్య నుంచి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో నదిలో వరద ఉద్ధృతి క్రమంగా తగ్గింది. నీటితో పాటు కొత్తగా కొట్టుకొచ్చే మట్టి పరిమాణం తగ్గడంతో, నీటిలో తేలియాడుతున్న సన్నని మట్టి కణాలు క్రమంగా అడుగున పేరుకుపోవడం ప్రారంభించాయి. దీనివల్ల నీటిలోని మసకదనం తగ్గి, జలాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు, శీలేరు నుంచి గోదావరిలో కలిసే నీటి లక్షణాలు కూడా ఈ రంగు మార్పుపై ప్రభావం చూపి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే, నీటి రంగు మార్పునకు ఖచ్చితమైన కారణాలను నిర్ధారించాలంటే శాస్త్రీయ పరిశీలన అవసరం.

ప్రకృతి మార్పులకు నిదర్శనం

ప్రస్తుతం పోలవరం పరిసరాల్లో గోదావరి ప్రశాంతంగా ప్రవహిస్తూ కొత్త అందాలను ఆవిష్కరిస్తోంది. వర్షాకాలంలో ఉధృతంగా కనిపించిన నది, ఇప్పుడు నీలి ఛాయలతో కనువిందు చేస్తోంది. రుతుపవనాల ప్రభావం తగ్గిన తర్వాత నదీ ప్రవాహాల్లో చోటుచేసుకునే సహజ మార్పులకు ఈ దృశ్యం నిదర్శనంగా నిలుస్తోంది. పోలవరం స్పిల్‌వే పరిసరాల్లో గోదావరి కొత్త రూపం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us