AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jailer 2: ‘జైలర్ 2’ చైల్డ్ ఆర్టిస్ట్‌కు సొంతంగా సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉందా? అసలు విషయం ఏమిటంటే?

జైలర్ 2లో రజనీకాంత్ మనవడిగా నటించిన ఛైల్డ్ ఆర్టిస్ట్ రిత్విక్ గురించి ఇటీవల కొన్ని వార్తలు బాగా వైరలయ్యాయి. ఏడేళ్ల వయసున్న ఈ పిల్లాడికి స్వయంగా ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ ఉందన్న న్యూస్ అందరినీ షాక్ కు గురి చేసింది.

Jailer 2: 'జైలర్ 2' చైల్డ్ ఆర్టిస్ట్‌కు సొంతంగా సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉందా? అసలు విషయం ఏమిటంటే?
Jailer 2 Movie
Basha Shek
|

Updated on: Oct 19, 2026 | 1:36 PM

Share

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘జైలర్ 2’. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో 2023లో వచ్చిన ‘జైలర్’ మూవీకి సీక్వెల్‌గా ‘జైలర్ 2’ వచ్చింది. దసరా కానుకగ అక్టోబర్ 15 న రిలీజైన రజనీ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లు వస్తున్నాయి. ముఖ్యంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ స్టైల్, మేనరిజం, ఎలివేషన్స్‌ను థియేటర్లలో విజిల్స పడుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే జైలర్ 2 సినిమాకు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిందిని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన జైలర్ 2 సినిమాలో చాలా మంది స్టార్స్ ఉన్నారు. రమ్యకృష్ణ, విద్యాబాలన్ మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, హృతిక్ రోషన్, విజయ్ సేతుపతి, మిథున్ చక్రవర్తి, సూరజ్ వెంజరమూడు, యోగిబాబు, మిర్నా మేనన్‌ తదితరులు జైలర్ లో యాక్ట్ చేశారు. కాగా ఇదే జైలర్ 2 సినిమాలో రజనీకాంత్ మనవడి పాత్రలో రిత్విక్ అనే ఛైల్డ్ ఆర్టిస్ట్ నటించాడు. తన క్యూట్ యాక్టింగ్ , ఎక్స్ ప్రెషన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతకు ముందు రిత్విక్ తెలుగులో ‘లక్కీ భాస్కర్’ సినిమాలో కూడా నటించాడు. అలాగే నయనతారతో ఓ2, కార్తీతో ‘సర్దార్’ సినిమాల్లోనూ ఛైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు రిత్విక్.

ఇదిలా ఉంటే రిత్విక్ గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. 7 ఏళ్ల రిత్విక్‌కు సొంతంగా ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ‌ ఉందని తెగ ప్రచారం జరుగుతోంది. దీంతో అంత చిన్న వయసులోనే సాఫ్ట్‌వేర్ కంపెనీకి యజమాని కావడం ఏంటని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే, ఈ వైరల్ న్యూస్ వెనుక ఉన్న అసలు నిజం ఇప్పుడు బయటకు వచ్చింది. రిత్విక్ సాఫ్ట్‌వేర్ కంపెనీని నిర్వహిస్తున్నాడన్న వార్తలో ఎలాంటి నిజం లేదు. ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీని నడుపుతున్నది రిత్విక్ తల్లిదండ్రులు. వారు తమ వ్యాపారానికి ప్రమోషన్ కల్పించడంలో భాగంగా రిత్విక్‌ను కంపెనీ బ్రాండ్ ఫేస్‌గా వాడుకుంటున్నారు. అంతే తప్ప 7 సంవత్సరాల వయసున్న రిత్విక్ స్వయంగా ఆ సాఫ్ట్‌వేర్ సంస్థను స్థాపించలేదు, నిర్వహించడం లేదు.

ఇవి కూడా చదవండి

రిత్విక్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

సాఫ్ట్‌వేర్ కంపెనీ సంగతి పక్కన పెడితే.. డిజిటల్ మీడియాలో మాత్రం రిత్విక్ ఒక తిరుగులేని స్టార్ అని చెప్పవచ్చు. కోయంబత్తూరుకు చెందిన ఈ బుడతడు తన తండ్రి పర్యవేక్షణలో నడుస్తున్న ‘రిథు రాక్స్’ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా మిలియన్ల కొద్దీ వ్యూస్, సబ్‌స్క్రైబర్లను సంపాదించుకున్నాడు. అందులో అతను అప్లోడ్ చేస్తోన్న వీడయోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు జైలర్ 2 సినిమాతో మరోసారి వార్తల్లో నిలిచాడీ బుడతడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us