AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మార్నింగ్ వాక్‌లో దొరికిన బ్యాగ్.. తెరిచి చూస్తే కళ్లు జిగేల్‌!

మార్నింగ్ వాక్‌లో దొరికిన బ్యాగ్.. తెరిచి చూస్తే కళ్లు జిగేల్‌!

Phani CH
|

Updated on: Oct 18, 2026 | 9:04 PM

Share

రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో రాజేష్‌ కుమార్‌ నిజాయతీ అందరి ప్రశంసలు అందుకుంటోంది. మార్నింగ్‌ వాక్‌ సమయంలో సోఫియా కాలేజీ సమీపంలో కనిపించిన బ్యాగును ఆయన పోలీసులకు అప్పగించారు. అందులో పాస్‌పోర్ట్‌, ముఖ్యమైన పత్రాలతో పాటు సుమారు రూ.9.5 లక్షల విలువైన విదేశీ కరెన్సీ ఉన్నట్లు గుర్తించారు. దర్యాప్తు అనంతరం ఆ బ్యాగును ఎస్‌బీఐ మేనేజర్‌ సద్దాం ఆలంకు పోలీసులు తిరిగి అందజేశారు. రాజేష్‌ చేసిన పనిపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

డబ్బు కళ్ల ముందు కనిపిస్తే చాలు, ఎవరికైనా ఆశ కలగడం సహజం. అందునా కోట్లలో కాకపోయినా దాదాపు రూ. 10 లక్షల విలువైన విదేశీ కరెన్సీ పడి ఉంటే ఎవరైనా క్షణకాలం చలించిపోతారు. కానీ, ఓ సాధారణ వ్యక్తి మాత్రం తన నిజాయతీతో అందరికీ ఆదర్శంగా నిలిచాడు. మార్నింగ్ వాక్‌లో దొరికిన లక్షల రూపాయల విలువైన విదేశీ కరెన్సీ బ్యాగ్‌ను ఏమాత్రం ఆశపడకుండా పోలీసులకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు. రాజస్థాన్‌లోని అజ్మేర్‌కు చెందిన రాజేష్ కుమార్ రోజూలాగే మార్నింగ్ వాక్‌కు వెళ్లారు. ఆ సమయంలో సోఫియా కాలేజీ సమీపంలో రోడ్డుపై ఒక బ్యాగు పడి ఉండటాన్ని ఆయన గమనించారు. దానిని తెరిచి చూడకుండా వెంటనే సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆ బ్యాగును తెరిచి చూడగా అందులో పాస్‌పోర్ట్, ముఖ్యమైన డాక్యుమెంట్లు, భారీ మొత్తంలో విదేశీ కరెన్సీ బయటపడ్డాయి. భారత కరెన్సీలో వాటి విలువ సుమారు రూ.తొమ్మిదిన్నర లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఆ పత్రాల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు, ఆ బ్యాగ్ పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎస్‌బీఐ మేనేజర్ సద్దాం ఆలంకు చెందినదిగా గుర్తించారు. అజ్మేర్ దర్గాను దర్శించుకోవడానికి వచ్చిన ఆయన, టెంపోలో ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఈ బ్యాగును పోగొట్టుకున్నారు. తన బ్యాగ్ ఎక్కడ పోయిందోనని ఆందోళన చెందుతున్న ఆయనను పోలీసులు సంప్రదించి, సురక్షితంగా నగదును, పాస్‌పోర్ట్‌ను అందజేశారు. పోయిన విలువైన వస్తువులు తిరిగి దొరకడంతో సద్దాం ఆలం తీవ్ర భావోద్వేగానికి గురై, రాజేష్ కుమార్‌కు, పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. లక్షల రూపాయల ఆస్తి కళ్లముందు ఉన్నా ఏమాత్రం ఆశపడకుండా నిజాయతీని చాటుకున్న రాజేష్ కుమార్ తీరుపై ప్రస్తుతం సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నవంబర్ 1 నుంచి కొత్త రూల్.. ఇక మీకు ‘అన్ నోన్’ నంబర్ల నుంచి కాల్స్ ..!

OPPO F35 5Gలో ఇన్ని ఫీచర్లా? అదిరిపోయే బ్యాటరీతో దుమ్మురేపుతోంది!

తెలివిగా ఫోను కొట్టేద్దామనుకున్నాడు.. అందుకే చుక్కలు చూపించారు!

Nagarjuna: దసరాకు ధమాకా.. ‘కింగ్ 100’ నుంచి దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌

అత్తామామలతో కలిసి.. CM విజయ్‌ను తన పెళ్లికి ఆహ్వానించిన అనిరుధ్

Follow Us