AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయం పెళ్లి.. సాయంత్రం డైవర్స్‌..

ఉదయం పెళ్లి.. సాయంత్రం డైవర్స్‌..

Phani CH
|

Updated on: Oct 18, 2026 | 9:07 PM

Share

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో పెళ్లయిన 24 గంటల్లోపే ఓ కొత్త జంట విడిపోయిన ఘటన కలకలం రేపింది. నాలుగేళ్లుగా ప్రేమించుకున్న వీరికి అక్టోబర్‌ 12న పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. అదే రోజు రిసెప్షన్‌లో మద్యం మత్తులో ఉన్న వరుడు వధువు తండ్రితో గొడవపడి, అడ్డువచ్చిన వధువుపైనా చేయి చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో తండ్రీకూతుళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వధువు కుటుంబంతో కలిసి ఇంటికి వెళ్లిపోయింది.

నూతన జీవితంలోకి అడుగుపెట్టాల్సిన కొత్త జంట, పెళ్లయిన 24 గంటల్లోపే విడిపోయిన విషాదకర ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. నూరేళ్లు కలసి బతకాల్సిన దంపతులు.. పెళ్లి వేడుకలోనే తీసుకున్న ఒక తొందరపాటు నిర్ణయంతో ఎవరి దారి వారు చూసుకున్నారు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కుళచ్చల్‌కు చెందిన 31 ఏళ్ల యువకుడు సైన్యంలో పనిచేస్తున్నాడు. కన్యాకుమారి-కేరళ సరిహద్దు ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల యువతి తిరువనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తోంది. గత నాలుగేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. పెద్దల అంగీకారంతో వీరి వివాహం అక్టోబరు 12న ఘనంగా జరిగింది. అయితే అదే రోజు సాయంత్రం ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న వరుడు ఒక్కసారిగా తన విచక్షణ కోల్పోయాడు. వధువు తండ్రితో గొడవకు దిగాడు. అంతటితో ఆగకుండా మామపై, అడ్డువచ్చిన నూతన వధువుపై కూడా చేయి చేసుకున్నాడు. పెళ్లి వేదికపై జరిగిన ఈ ఊహించని పరిణామంతో అందరూ షాక్‌కు గురయ్యారు. పెళ్లయిన కొన్ని గంటల్లోనే భర్త ప్రవర్తన చూసి వధువు తీవ్ర మనస్తాపానికి గురైంది. జరిగిన అవమానాన్ని తట్టుకోలేకపోయిన తండ్రీకూతుళ్లు వెంటనే కుళచ్చల్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. క్షణికావేశంలో మద్యం మత్తులో తీసుకున్న నిర్ణయం ఆ సైనికుడి జీవితాన్ని ఒక్కరోజే చీకట్లోకి నెట్టేసింది. ఈ ఘటనతో భర్తతో పూర్తిగా తెగదెంపులు చేసుకున్న యువతి, తన కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఇంటికి వెళ్లిపోయింది. ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట పెళ్లి వేడుక ఇలా అర్ధంతరంగా ముగియడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మార్నింగ్ వాక్‌లో దొరికిన బ్యాగ్.. తెరిచి చూస్తే కళ్లు జిగేల్‌!

నవంబర్ 1 నుంచి కొత్త రూల్.. ఇక మీకు ‘అన్ నోన్’ నంబర్ల నుంచి కాల్స్ ..!

OPPO F35 5Gలో ఇన్ని ఫీచర్లా? అదిరిపోయే బ్యాటరీతో దుమ్మురేపుతోంది!

తెలివిగా ఫోను కొట్టేద్దామనుకున్నాడు.. అందుకే చుక్కలు చూపించారు!

Nagarjuna: దసరాకు ధమాకా.. ‘కింగ్ 100’ నుంచి దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌

Follow Us