AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“నా పిల్లలను మంచిగా చూసుకోండి”.. కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడి చివరి లేఖ!

అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లాలో విషాదాన్ని నింపింది. తన పిల్లలను మంచిగా చూసుకోవాలంటూ లేఖ రాసి సాగర్ కాలువలో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడెం గ్రామంలో చోటుచేసుకుంది.

“నా పిల్లలను మంచిగా చూసుకోండి”.. కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడి చివరి లేఖ!
Government Teacher Death
N Narayana Rao
| Edited By: |

Updated on: Oct 19, 2026 | 1:20 PM

Share

ఖమ్మం: అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లాలో విషాదాన్ని నింపింది. తన పిల్లలను మంచిగా చూసుకోవాలంటూ లేఖ రాసి సాగర్ కాలువలో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడెం గ్రామంలో చోటుచేసుకుంది.

అనారోగ్యం.. ఆర్థిక ఇబ్బందులతో సతమతం

వివరాల్లోకి వెళ్తే.. కొత్త కారాయిగూడెం గ్రామానికి చెందిన దొడ్డపునేని వెంకటేశ్వరరావు (50) కోండ్రుపాడు గ్రామంలో హిందీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స కోసం ఆసుపత్రులకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చింది. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి గురైన వెంకటేశ్వరరావు సూసైడ్ నోట్ రాసి సాగర్ కాలువలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన పిల్లలను మంచిగా చూసుకోవాలని, తాను తీవ్ర ఒత్తిడిని తట్టుకోలేక దూరమవుతున్నానని లేఖలో పేర్కొన్నారు.

10గంటల పాటు గాలింపు.. చివరకు మృతదేహం లభ్యం!

సాగర్ కాలువలో వెంకటేశ్వరరావు గల్లంతైన విషయం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు పది గంటల పాటు శ్రమించి, ఘటనాస్థలానికి కిలోమీటరు దూరంలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. మృతుడికి భార్య లక్ష్మి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుటుంబానికి అండగా నిలిచిన వ్యక్తి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టారు. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు ఒంటరిగా బాధపడకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడటం ముఖ్యం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడి సూసైడ్ నోట్!
కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడి సూసైడ్ నోట్!
వెస్టిండీస్ సిరీస్‌తో బయటపడ్డ టీమిండియా బలహీనతలు..
వెస్టిండీస్ సిరీస్‌తో బయటపడ్డ టీమిండియా బలహీనతలు..
మూడు గ్రహాల వక్రగతితో వీరికి అపరిమిత అదృష్టం!
మూడు గ్రహాల వక్రగతితో వీరికి అపరిమిత అదృష్టం!
న్యూజిలాండ్‌లో అడుగుపెట్టిన వైభవ్.. ఎయిర్‌పోర్టులో ఊహించని సీన్..
న్యూజిలాండ్‌లో అడుగుపెట్టిన వైభవ్.. ఎయిర్‌పోర్టులో ఊహించని సీన్..
కొత్త ఫోన్ ఇవ్వాల్సిందే.. జరిమానా కట్టాల్సిందే..
కొత్త ఫోన్ ఇవ్వాల్సిందే.. జరిమానా కట్టాల్సిందే..
ఇలా చేస్తేనే ప్లేయింగ్ 11లో వైభవ్ సూర్యవంశీకి చోటు : ఆకాశ్ చోప్రా
ఇలా చేస్తేనే ప్లేయింగ్ 11లో వైభవ్ సూర్యవంశీకి చోటు : ఆకాశ్ చోప్రా
వేలంలో లక్షల రూపాయలు పలికిన అమ్మవారి పూలమాల..!
వేలంలో లక్షల రూపాయలు పలికిన అమ్మవారి పూలమాల..!
మొండెం లేని ఆ తలలు ఎవరివి?OTTలో ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
మొండెం లేని ఆ తలలు ఎవరివి?OTTలో ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
ఎల్ నినో ఎఫెక్ట్‌..హైదరాబాద్‌కు తాగునీటి కష్టాలు!రాబోయే రోజుల్లో
ఎల్ నినో ఎఫెక్ట్‌..హైదరాబాద్‌కు తాగునీటి కష్టాలు!రాబోయే రోజుల్లో
క్రెడిట్ కార్డు క్లోజ్ చేయాలనుకుంటున్నారా? ఏమవుతుందో తెలుసా?
క్రెడిట్ కార్డు క్లోజ్ చేయాలనుకుంటున్నారా? ఏమవుతుందో తెలుసా?