OTT Movie: మొండెం లేని ఆ తలలు ఎవరివి? ఓటీటీలో మతిపోగొట్టే తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో టాప్ రేటింగ్
క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇప్పుడు హాట్ కేకుల్లా కనిపిస్తున్నాయి ప్రేక్షకులకి. ఏ భాషలో వచ్చినా వీటిని వదిలిపెట్టడం లేదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమానే. ఓటీటీలో దుమ్ము రేపుతోన్న ఈ క్రైమ్ థ్రిల్లర్ కు ఐఎమ్ డీబీలోనూ టాప్ రేటింగ్ దక్కడం విశేషం.

ప్రస్తుతం క్రైమ్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా ఓటీటీ ఆడియన్స్ అయితే వీటిని ఎగబడ చూస్తున్నారు. ఇక ఆడియెన్స్ ఇంట్రెస్ట్ అందులోనూ ప్రస్తుతం జెన్ జీ ట్రెండ్‌కు అనుగుణంగానే ఓటీటీ సంస్థలు కూడా ఎక్స్‌క్లూజివ్ సిరీస్, సినిమాలను స్ట్రీమ్ చేస్తున్నాయి. అలా ఇప్పుడు ఓ సరికొత్త క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో టాప్ లో ట్రెండ్ అవుతోంది. రౌడీ రాజకీయాలు, పగ, ప్రతీకారం, అసాధారణ రహస్యాలు, మంత్రాలు, క్షుద్రపూజల చుట్టూ సాగే ఈ స్టోరీ ఆద్యంతం ఎంతో గ్రిప్పింగ్ గా సాగుతోంది. అలాగే ట్విస్టులు కూడ ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తాయి. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. హైదరాబాద్ నగర పరిధిలోని ధూల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే రాత్రిలో మూడు హత్యలు జరుగుతాయి. అది కూడా ఎంతో రద్దీగా ఉండే దసరా నవరాత్రుల్లో ఈ దారుణ హత్యలు జరగడంతో అందరూ ఉలిక్కి పడతారు. చెత్తలో ఓ తల, మరో రెండు చోట్ల డెడ్ బాడీస్ తలలు లేకుండా పోలీసులకు దొరుకుతాయి. ఈ హత్యలన్నీ తలలు నరికివేసి ఉండటంతో నగర ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతారు. ఇదే క్రమంలో ధూల్ పేట పోలీస్ స్టేషన్ లో ఏసీపీ వెట్రి మారన్ కొత్తగా బాధ్యతలు తీసుకుంటారు. ఏసీపీ అర్జున్ సహాయంతో ఈ సీరియల్ కిల్లర్ ను పట్టుకోవడానికి ఒక టీమ్ ను ఏర్పాటు చేస్తారు. మరి ఈ కేసును ఇద్దరు ఏసీపీలు సాల్వ్ ఎలా చేశారు ?. అసలు కిల్లర్ ఎవరు? అతను తలలను నరికి ఎందుకు హత్యలు చేశాడు ? దసరా నవరాత్రులనే హంతకుడు ఎందుకు టార్గెట్ చేశాడు? చివరకు పోలీసులకు ఎలా చిక్కాడు? అన్న ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
ప్రస్తుతం ఓటీటీలో టాప్ లో ట్రెండ్ అవుతోన్న ఈ క్రైమ్ సిరీస్ పేరు.. ధూల్ పేట పోలీస్ స్టేషన్. గతేడాది డిసెంబరులో ప్రముఖ ఓటీటీ ‘ఆహా’ ఎక్స్‌క్లూజివ్‌గా ఈ క్రైమ్ సిరీస్ స్ట్రీమ్ అయ్యింది. 50 ఎపిసోడ్స్‌తో వచ్చిన ఈ సిరీస్ తక్కువ కాలంలోనే రికార్డు స్ట్రీమింగ్ మినిట్స్‌తో ట్రెండ్ అయ్యింది. దీంతో ఆ సిరీస్‌నే ఇప్పుడు మూవీగా ఓటీటీలో స్ట్రీమ్ చేస్తున్నారు. ఆహా ఓటటీలోనే ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అందుబాటులో ఉంది. ఈ దసరా సెలవుల్లో మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా కానీ వెబ్ సిరీస్ కానీ చూడాలనుకునేవారికి ధూల్ పేట పోలీస్ స్టేషన్ ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.
ధూల్ పేట పోలీస్ స్టేషన్ ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




