AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త ఫోన్ ఇవ్వాల్సిందే.. జరిమానా కట్టాల్సిందే.. యాపిల్ సంస్థకే ఝలక్ ఇచ్చిన హైదరాబాదీ..

లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన సరికొత్త ఐఫోన్ కొద్ది రోజులకే మొరాయిస్తే ఆ కస్టమర్ బాధ ఎలా ఉంటుంది? సమస్యను పరిష్కరించడంలో విఫలమై చేతులెత్తేసిన టెక్ దిగ్గజం యాపిల్‌కు హైదరాబాద్ వినియోగదారుల ఫోరం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. కొత్త ఫోన్2ను రీప్లేస్ చేయడమే కాకుండా రూ.35 వేల జరిమానా చెల్లించాలంటూ సంచలన తీర్పునిచ్చింది. అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కొత్త ఫోన్ ఇవ్వాల్సిందే.. జరిమానా కట్టాల్సిందే.. యాపిల్ సంస్థకే ఝలక్ ఇచ్చిన హైదరాబాదీ..
Apple Fined By Hyderabad Consumer Forum
Krishna S
|

Updated on: Oct 19, 2026 | 12:56 PM

Share

లక్షల రూపాయలు పోసి కొనుగోలు చేసిన బ్రాండెడ్ మొబైల్ కొద్ది రోజులకే మొరాయిస్తే ఆ కొనుగోలుదారుడి బాధ వర్ణనాతీతం. సాంకేతిక లోపాలతో వేధించిన కొత్త ఫోన్ సమస్యను పరిష్కరించడంలో విఫలమైన అంతర్జాతీయ టెక్ దిగ్గజం యాపిల్‌కు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ గట్టి షాక్ ఇచ్చింది. బాధితుడికి వెంటనే కొత్త హ్యాండ్‌సెట్‌ను రీప్లేస్ చేయడంతో పాటు రూ.35,000 నష్టపరిహారం, కోర్టు ఖర్చులు చెల్లించాలని సంచలన తీర్పునిచ్చింది. నగరానికి చెందిన సి.వి. అనిల్ కుమార్ అనే వ్యక్తి ఆన్‌లైన్ ద్వారా రూ.74,325 వెచ్చించి ఐఫోన్ 17ను కొనుగోలు చేశారు. అయితే చేతికి వచ్చిన కొద్ది రోజులకే ఆ ఫోన్‌లో తీవ్ర సాంకేతిక సమస్యలు మొదలయ్యాయి. కెమెరా ఫోకస్ కాకపోవడం, స్క్రీన్ తరచూ ఫ్రీజ్ అవ్వడం, వీడియో ప్లేబ్యాక్ ఆగిపోతూ రావడం, నెట్‌వర్క్ కనెక్టివిటీ లోపాలు తలెత్తాయి.

బాధితుడు వెంటనే యాపిల్ కస్టమర్ కేర్‌ను సంప్రదించి, స్క్రీన్-షేరింగ్ ద్వారా సమస్యలను ప్రత్యక్షంగా చూపించారు. వారు సాఫ్ట్‌వేర్ సమస్య అని చెబుతూ ఫోన్‌ను పూర్తిగా రీసెట్ చేయించారు. అయినప్పటికీ సమస్య తగ్గలేదు. అనంతరం బంజారాహిల్స్‌లోని అధీకృత సర్వీస్ సెంటర్ ఆప్ట్రానిక్స్‌కు వెళ్లగా, వారు ఆపరేటింగ్ సిస్టమ్‌ను మళ్లీ రీఇన్‌స్టాల్ చేసి హ్యాండ్‌సెట్ బాగానే ఉందని చెప్పారు. కానీ అదే రోజు సాయంత్రానికే మళ్లీ అవే సమస్యలు పునరావృతమయ్యాయి. ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకపోవడం, తీవ్ర మానసిక క్షోభ, సమయం వృథా కావడంతో బాధితుడు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు.

యాపిల్, సర్వీస్ సెంటర్ వాదనలు

విచారణ సందర్భంగా యాపిల్ ఇంక్ స్పందిస్తూ.. అమెరికాలో రిజిస్టర్ అయిన తమ ప్రధాన సంస్థ వేరని, భారత్‌లో దీనికి యాపిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే బాధ్యత వహిస్తుందని సాంకేతిక కారణాలు చెప్పే ప్రయత్నం చేసింది. కస్టమర్ అడిగినప్పుడల్లా తమ సిబ్బంది సహకరించారని తెలిపింది. అటు ఆప్ట్రానిక్స్ సర్వీస్ సెంటర్ సైతం తాము యాపిల్ నిబంధనల ప్రకారమే డయాగ్నస్టిక్స్, సాఫ్ట్‌వేర్ రీస్టోర్ చేశామని, టెస్టింగ్ సమయంలో ఫోన్ సాధారణంగానే పనిచేసిందని చెప్పుకొచ్చింది.

కమిషన్ తీవ్ర ఆగ్రహం.. స్పష్టమైన తీర్పు

రెండు పక్షాల వాదనలు విన్న వినియోగదారుల ఫోరం బెంచ్ యాపిల్, ఆప్ట్రానిక్స్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వేలకు వేలు పోసి కొనుగోలు చేసిన సరికొత్త ఫోన్‌లో కొద్ది రోజులకే ఇలాంటి లోపాలు ఎందుకు వచ్చాయో, మాటిమాటికీ ట్రబుల్‌షూటింగ్ ఎందుకు చేయాల్సి వచ్చిందో సంస్థలు స్పష్టమైన సమాధానం చెప్పలేకపోయాయని కమిషన్ తప్పుబట్టింది. ‘‘కొత్త పరికరాన్ని కొనుగోలు చేసిన ఒక కస్టమర్ ఇలా పరిష్కారం కాని లోపాలతో నిరంతరం ఇబ్బందులు పడతాడని ఎవరూ ఊహించరు’’ అని బెంచ్ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో వినియోగదారుడికి లోపభూయిష్టమైన హ్యాండ్‌సెట్ స్థానంలో సరికొత్త ఫోన్‌ను రీప్లేస్ చేసి ఇవ్వాలని యాపిల్ సంస్థను ఆదేశించింది. దీంతో పాటు బాధితుడికి కలిగిన మానసిక వేదనకు గాను రూ.20,000 నష్టపరిహారం, కోర్టు ఖర్చుల కింద మరో రూ.15,000 చెల్లించాలని తుది తీర్పు వెలువరించింది.

Follow Us
కొత్త ఫోన్ ఇవ్వాల్సిందే.. జరిమానా కట్టాల్సిందే..
కొత్త ఫోన్ ఇవ్వాల్సిందే.. జరిమానా కట్టాల్సిందే..
ఇలా చేస్తేనే ప్లేయింగ్ 11లో వైభవ్ సూర్యవంశీకి చోటు : ఆకాశ్ చోప్రా
ఇలా చేస్తేనే ప్లేయింగ్ 11లో వైభవ్ సూర్యవంశీకి చోటు : ఆకాశ్ చోప్రా
వేలంలో లక్షల రూపాయలు పలికిన అమ్మవారి పూలమాల..!
వేలంలో లక్షల రూపాయలు పలికిన అమ్మవారి పూలమాల..!
మొండెం లేని ఆ తలలు ఎవరివి?OTTలో ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
మొండెం లేని ఆ తలలు ఎవరివి?OTTలో ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
ఎల్ నినో ఎఫెక్ట్‌..హైదరాబాద్‌కు తాగునీటి కష్టాలు!రాబోయే రోజుల్లో
ఎల్ నినో ఎఫెక్ట్‌..హైదరాబాద్‌కు తాగునీటి కష్టాలు!రాబోయే రోజుల్లో
క్రెడిట్ కార్డు క్లోజ్ చేయాలనుకుంటున్నారా? ఏమవుతుందో తెలుసా?
క్రెడిట్ కార్డు క్లోజ్ చేయాలనుకుంటున్నారా? ఏమవుతుందో తెలుసా?
వచ్చే నెల రోజులు వీరికి ఆర్థిక పురోగతి పక్కా..!
వచ్చే నెల రోజులు వీరికి ఆర్థిక పురోగతి పక్కా..!
అనిరుద్ గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే
అనిరుద్ గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే
ఒకవైపు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్.. మరోవైపు 38 రోజులుగా..
ఒకవైపు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్.. మరోవైపు 38 రోజులుగా..
ఈ నలుగురు భారత ఆటగాళ్లకు ఇదే చివరి న్యూజిలాండ్ టూర్..?
ఈ నలుగురు భారత ఆటగాళ్లకు ఇదే చివరి న్యూజిలాండ్ టూర్..?