Money Astrology: వచ్చే నెల రోజులు వీరికి డబ్బే డబ్బు..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
Budhaditya Yoga 2026: అక్టోబర్ 17న తులా రాశిలో రవి, బుధ గ్రహాల కలయికతో బుధాదిత్య యోగం ఏర్పడింది. రవి నీచస్థితిలో ఉండటంతో అధికారపరమైన ప్రయోజనాలు పరిమితంగా ఉన్నప్పటికీ, ఈ యోగం వల్ల ఆరు రాశుల వారికి ఆదాయ వృద్ధి, సమస్యల పరిష్కారం, వివాదాల నుంచి ఉపశమనం లభించే అవకాశాలున్నాయి. నవంబర్ 17 వరకు ఏయే రాశుల వారికి ఈ యోగం అనుకూలంగా ఉండనుందో తెలుసుకుందాం.

అక్టోబర్ 17న రవి తులా రాశిలో ప్రవేశించి, అక్కడ బుధుడితో యుతి చెందడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడింది. ఈ రెండు గ్రహాలకూ అనుకూలమైన రాశుల్లో ఇవి కలిసినప్పుడు ఏర్పడే బుధాదిత్య యోగం విశేషమైన ఫలితాలనిస్తుంది. అయితే, తులా రాశి రవికి శత్రు క్షేత్రం కావడం, పైగా రవికి నీచత్వ దోషం కలగడం వల్ల బుధుడి ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా ఈ బుధాదిత్య యోగం వల్ల అధికార యోగం పట్టకపోవచ్చు కానీ, ఆదాయ వృద్ధికి, సమస్యలు, వివాదాల పరిష్కారానికి మాత్రం అవకాశం ఉంది. మేషం, మిథునం, కర్కాటకం, కన్య, ధనుస్సు, మకర రాశులవారికి దీని వల్ల నవంబర్ 17 వరకు బాగా అనుకూల ఫలితాలు కలుగుతాయి.
మేష రాశి
ఈ రాశికి సప్తమ స్థానంలో బుధ, రవులు కలవడం వల్ల అనేక శుభ ఫలితాలతో పాటు మహా భాగ్య యోగం కూడా పడుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. ఎంతటి జటిల సమస్యనైనా సమయస్ఫూర్తితో పరిష్కరించుకోవడం జరుగుతుంది. కీలకమైన వ్యక్తిగత సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు కూడా సమసిపోతాయి. ఉన్నత కుటుంబంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగాబిజీగా సాగుతాయి.
మిథున రాశి
ఈ రాశికి పంచమ స్థానంలో బుధ, రవుల యుతి ఏర్పడుతున్నందువల్ల తప్పకుండా షేర్లు, స్పెక్యులేషన్లు విశేష లాభాలనిస్తాయి. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. సామాజికంగా కూడా హోదా, స్థితి, పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. గృహ, వాహన ప్రయ త్నాల్లో విజయం సాధిస్తారు. కొన్నివ్యక్తిగత సమస్యలు, ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి.
కర్కాటక రాశి
ఈ రాశికి ధన స్థానంలో రాశ్యధిపతి రవి ధన, లాభాధిపతి బుధుడితో యుతి చెందడం వల్ల అంచ నాలకు మించిన ఆర్థిక పురోగతి ఉంటుంది. అప్రయత్న ధన లాభానికి అవకాశం ఉంటుంది. ఆదా యపరంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయం సిద్ధిస్తుంది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు మటుమాయం అవుతాయి. మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలపరంగా ఉన్నత స్థానానికి చేరుకోవడం జరుగుతుంది.
కన్య రాశి
ఈ రాశికి ధన స్థానంలో రాశ్యధిపతి బుధుడితో రవి కలవడం వల్ల ఆర్థికంగా అనేక ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లలో పెట్టుబడులు పెట్టి లబ్ధి పొందుతారు. ఒక ప్రణాళిక ప్రకారం సంపాదించడం, ఖర్చు పెట్టడం ప్రారంభ మవుతుంది. సర్వత్రా ప్రాధాన్యం, ప్రాధాన్యం వృద్ది చెందుతాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. ప్రభుత్వమూలక ధన లాభం, గుర్తింపు లభిస్తాయి. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది.
ధనుస్సు రాశి
ఈ రాశికి లాభ స్థానంలో రవి, బుధులతో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒకటికి రెండుసార్లు ధన యోగాలు కలుగుతాయి. షేర్లు, వడ్డీ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీల్లో మదుపు చేయడం ఎక్కువవుతుంది. దశమాధిపతి రవితో లాభాధిపతి బుధుడు కలవడం వల్ల ఉద్యోగంలో అనుకూలతలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఊహించని ఆఫర్లు అందుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు, ఒత్తిళ్లన్నీ తగ్గిపోతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందు తుంది.
మకర రాశి
ఈ రాశికి దశమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల సమస్యలు, ఒత్తిళ్లు, వివాదాల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఈ రాశివారు తప్పకుండా ఆర్థికంగా మెరుగైన స్థితికి చేరుకుంటారు. మనసులోని కోరికలు, ఆశయాలు చాలావరకు నెరవేరుతాయి. వృత్తి, వ్యాపారాల్లో మంచి గుర్తింపు లభించడంతో పాటు రాబడి అంచనాల్ని మించుతుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తరించి, పలుకుబడి పెరుగుతుంది. కొన్నిఅనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.



