AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లడ్డూ కాదు.. చీర కాదు.. లక్షల రూపాయలు పలికిన అమ్మవారి పూలదండ.. ఎక్కడంటే..?

సాధారణంగా వినాయక చవితి సందర్భంగా లడ్డూలకు, ఆలయాల్లో అమ్మవారి చీరలు, నగలకు వేలంపాటలు నిర్వహించడం చూస్తుంటాం. కానీ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో మాత్రం మహిషాసురమర్దిని అమ్మవారి మెడలో తొలి పూలదండ వేసే అవకాశం కోసం వేలంపాట నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

లడ్డూ కాదు.. చీర కాదు.. లక్షల రూపాయలు పలికిన అమ్మవారి పూలదండ.. ఎక్కడంటే..?
Mahishasuramardini Temple
Balaraju Goud
|

Updated on: Oct 19, 2026 | 12:56 PM

Share

అమలాపురం: సాధారణంగా వినాయక చవితి సందర్భంగా లడ్డూలకు, ఆలయాల్లో అమ్మవారి చీరలు, నగలకు వేలంపాటలు నిర్వహించడం చూస్తుంటాం. కానీ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో మాత్రం మహిషాసురమర్దిని అమ్మవారి మెడలో తొలి పూలదండ వేసే అవకాశం కోసం వేలంపాట నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈసారి ఈ పూలదండను హైదరాబాద్‌‌కు చెందిన వ్యాపారవేత్త ఏకంగా రూ.1.53 లక్షలకు దక్కించుకున్నారు.

వరుసగా మూడోసారి లక్ష్మణరావుకే అవకాశం!

అమలాపురంలోని రవణం వీధిలో కొలువైన శ్రీమహిషాసురమర్దిని అమ్మవారి ఆలయంలో 79వ విజయదశమి సందర్భంగా ఏటా నిర్వహించే సంప్రదాయ వేలంపాటను ఈసారి కూడా నిర్వహించారు. అమ్మవారి మెడలో వేసే తొలి పూలదండ కోసం జరిగిన వేలంలో హైదరాబాద్‌‌‌కు చెందిన ఆకుల లక్ష్మణరావు పాల్గొని అత్యధికంగా రూ.1,53,000కు పాడుకున్నారు. దీంతో వరుసగా మూడోసారి ఈ ప్రత్యేక అవకాశం ఆయనకే దక్కింది.

రూ.3,500 నుంచి రూ.1.53 లక్షలకు!

అమలాపురానికి చెందిన లక్ష్మణరావు ప్రస్తుతం హైదరాబాద్‌లో వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు. గతంలో ఆన్‌లైన్‌ ద్వారా వేలంలో పాల్గొన్న ఆయన ఈసారి స్వయంగా అమలాపురం చేరుకుని వేలంపాటలో పాల్గొనడం విశేషం. సుమారు 14 ఏళ్ల క్రితం కేవలం రూ.3,500తో ప్రారంభమైన ఈ పూలదండ వేలంపాట ప్రస్తుతం రూ.1.53 లక్షలకు చేరడం విశేషం. అమ్మవారిపై భక్తితో లక్ష్మణరావు ఆలయ విగ్రహానికి లక్షల రూపాయలతో టేకు చెక్కతో మందిరాన్ని కూడా చేయించినట్లు సమాచారం.

అమ్మవారి ఆశీస్సులతో తన వ్యాపారం అభివృద్ధి చెందడంతో పాటు, తన పిల్లలు విదేశాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారని లక్ష్మణరావు తెలిపారు. వేలంలో వరుసగా మూడోసారి విజయం సాధించిన ఆయనను ఆలయ కమిటీ సభ్యులు గజమాలతో సత్కరించారు. విజయదశమి రోజున ఈ పూలదండను మహిషాసురమర్దిని అమ్మవారి మెడలో అలంకరించనున్నారు. భక్తి, సంప్రదాయం, వేలంపాట కలగలిసిన ఈ ప్రత్యేక కార్యక్రమం అమలాపురంలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నదిని పరిశుభ్రంగా ఉంచేందుకు పెట్టిన డస్ట్‌బిన్‌ను ఎత్తుకెళ్లారు..
నదిని పరిశుభ్రంగా ఉంచేందుకు పెట్టిన డస్ట్‌బిన్‌ను ఎత్తుకెళ్లారు..
థియేటర్లలో పూనకాలు తెప్పించిన పాట.. ఇప్పుడు ఫుల్ వీడియో సాంగ్
థియేటర్లలో పూనకాలు తెప్పించిన పాట.. ఇప్పుడు ఫుల్ వీడియో సాంగ్
దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా టెస్టులో 100 ఏళ్ల అరుదైన రికార్డు..!
దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా టెస్టులో 100 ఏళ్ల అరుదైన రికార్డు..!
మహేష్ బాబు తర్వాత ఆ హీరో నటన అంటే నాకు బాగా ఇష్టం
మహేష్ బాబు తర్వాత ఆ హీరో నటన అంటే నాకు బాగా ఇష్టం
IPL Trade: సీఎస్‌కే కాదు.. హార్దిక్ పాండ్యా చేరేది ఆ జట్టులోనా..?
IPL Trade: సీఎస్‌కే కాదు.. హార్దిక్ పాండ్యా చేరేది ఆ జట్టులోనా..?
AI సహాయంతో 5 ఏళ్ల ముందే రొమ్ము క్యాన్సర్ ముప్పును పసిగట్టొచ్చు
AI సహాయంతో 5 ఏళ్ల ముందే రొమ్ము క్యాన్సర్ ముప్పును పసిగట్టొచ్చు
పోలవరం వద్ద గోదారమ్మకు సరికొత్త శోభ..!
పోలవరం వద్ద గోదారమ్మకు సరికొత్త శోభ..!
'జైలర్ 2' చైల్డ్ ఆర్టిస్ట్‌కు సొంతంగా సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉందా?
'జైలర్ 2' చైల్డ్ ఆర్టిస్ట్‌కు సొంతంగా సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉందా?
ఈదురుగాలులు, పిడుగులతో వానలు.. ఏపీ, తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ..
ఈదురుగాలులు, పిడుగులతో వానలు.. ఏపీ, తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ..
గురు చంద్రుల పరివర్తన.. ఈ రాశుల వారికి అపార ధన లాభం..!
గురు చంద్రుల పరివర్తన.. ఈ రాశుల వారికి అపార ధన లాభం..!