Cinema : ట్రెండింగ్‌లో త్రిష పేరు.. ఓటీటీలో దూసుకుపోతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. ట్విస్టులు చూస్తే ఫ్యూజుల్ అవుట్..
సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ప్రస్తుతం ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సిరీస్ ను ఇప్పుడు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తు్న్నారు. ముఖ్యంగా ఆ సిరీస్ ట్విస్టులు, మతిపోగొట్టే సీన్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు. అలాగే సెకండ్ ఇన్నింగ్స్ లో వైవిధ్యమైన పాత్రలు, విభిన్నమైన కంటెంట్ సెలక్ట్ చేసుకుంటూ దూసుకుపోతుంది త్రిష.

ఒక యదార్థ నేర సంఘటన (Real Crime Story) ఆధారంగా తెరకెక్కించిన ఓ వెబ్ సిరీస్ ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతుంది. అదే బృంద. ఇందులో త్రిష ‘బృంద’ అనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్లు అంటే కేవలం యాక్షన్ మాత్రమే అనుకుంటాం, కానీ ఈ సిరీస్ మానవ సంబంధాలు, మూఢనమ్మకాలు, నేరస్థుల మానసిక స్థితిని అడియన్స్ ముందు చూపిస్తుంది. ఈ సిరీస్‌ను సూర్య వంగల అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులో త్రిషతో పాటు ఇంద్రజిత్ సుకుమారన్, ఆమని, రవీంద్ర విజయ్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ SonyLIV లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ ఆద్యంతం ఊహించని సస్పెన్స్, మలుపులతో ఆకట్టుకుంటుంది.
ఎక్కువ మంది చదివినవి : Meena : తెలుగు సినిమాల్లో నాకు గుర్తింపు రావడానికి ఆ హీరోనే కారణం.. లేదంటే నేను లేను.. మీనా కామెంట్స్..
కథ విషయానికి వస్తే.. నగరంలో వరుసగా జరుగుతున్న హత్యలు పోలీసులకు పెద్ద సవాలుగా మారుతాయి. ఈ కేసును ఛేదించే బాధ్యతను బృంద తీసుకుంటుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన అడ్డంకులు ఏమిటి? ఆ హత్యల వెనుక ఉన్న అసలు కారణం మతం లేదా వ్యక్తిగత కక్షనా? అనే కోణంలో కథనం సాగుతుంది. త్రిష తన నటనతో ఈ పాత్రకు ప్రాణం పోశారనే చెప్పాలి. గ్లామర్ పక్కన పెట్టి, చాలా సీరియస్ రోల్‌లో ఆమె ఒదిగిపోయారు. ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీలో ట్రెండ్ అవుతుంది.
ఎక్కువ మంది చదివినవి : Raghavendra Rao: 83 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‌గా.. ఆరోగ్యంగా.. రోజూ ఉదయాన్నే తినేది ఇవే.. రాఘవేంద్రరావు..
సమాజంలోని కొన్ని చీకటి కోణాలను, మనుషుల ప్రవర్తనను ఈ సిరీస్ కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. సినిమాటిక్ హంగుల కంటే కూడా రియాలిటీకి దగ్గరగా ఉండటం దీని ప్రత్యేకత. మీరు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లను ఇష్టపడేవారైతే, ‘బృంద’ మీకు ఒక గొప్ప అనుభూతిని మిగిలిస్తుంది. తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో కూడా ఇది స్ట్రీమ్ అవుతూ విశేష ఆదరణ పొందుతోంది.
ఎక్కువ మంది చదివినవి : Vijay Thalapathy : ఆ ఒక్క సినిమా విడుదల కాకపోయి ఉంటే విజయ్, సంగీత పెళ్లి అయ్యేదే కాదు.. తలపతి కెరీర్ మార్చిన ఏకైక మూవీ..
ఎక్కువ మంది చదివినవి : Jaya Prada : నటనకే నటన నేర్పిన మహా నటుడు అతడు.. అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. హీరోయిన్ జయప్రద..
