AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raghavendra Rao: 83 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‏గా.. ఆరోగ్యంగా.. రోజూ ఉదయాన్నే తినేది ఇవే.. రాఘవేంద్రరావు..

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు కె.రాఘవేంద్రరావు. ఎన్నో అందమైన చిత్రాలను తెరకెక్కించి మెప్పించారు. దాదాపు 100కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన ఆరోగ్యం, ఫిట్నెస్ రహస్యాలను వెల్లడించారు. ప్రస్తుతం తన వయసు 83 సంవత్సరాలు. ఇప్పటికీ ఆయన రోజు ఉదయాన్నే చేసే పనులు వెల్లడించారు.

Raghavendra Rao: 83 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‏గా.. ఆరోగ్యంగా.. రోజూ ఉదయాన్నే తినేది ఇవే.. రాఘవేంద్రరావు..
Raghavendra Rao
Rajitha Chanti
|

Updated on: May 06, 2026 | 7:20 PM

Share

తెలుగు చిత్ర పరిశ్రమలో ‘దర్శకేంద్రుడు’గా పేరు సంపాదించుకున్నారు కె. రాఘవేంద్రరావు. దశాబ్దాలకు పైగా సినీరంగంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను రూపొందించారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ప్రస్తుతం ఆయన వయసు 83 సంవత్సరాలు. ఈ వయసులోనూ ఎంతో ఉత్సాహంగా, ఆరోగ్యంగా కనిపిస్తారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన తన ఫిట్నెస్, సుదీర్ఘ ఆరోగ్య రహస్యాలను పంచుకున్నారు. రాఘవేంద్రరావు ఫిట్నెస్ వెనుక ఉన్న ప్రధాన సూత్రం “జీవితాన్ని తేలికగా తీసుకోవడం”. “జీవితంలో ఏం జరిగినా దాన్ని ఆహ్వానించాలి. సినిమా ఫ్లాప్ అయినా, కష్టం వచ్చినా కుంగిపోకూడదు. లైఫ్ ని సీరియస్ గా తీసుకుంటే అది మరింత కష్టంగా మారుతుంది” అనే నమ్మకం తాను ఎప్పటికీ పాటిస్తానని అన్నారు. ఆయన తన రోజును ఎంతో క్రమశిక్షణతో ప్రారంభిస్తానని చెప్పుకొచ్చారు. ప్రతిరోజూ ఉదయం స్విమ్మింగ్, పిలాటెస్ లేదా స్ట్రెచింగ్ వ్యాయామాలు చేస్తానని.. సాయంత్రం వేళ యోగాకు ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. ముఖ్యంగా, స్నానం చేసిన తర్వాత ప్రతిరోజూ దాదాపు 40 నిమిషాల పాటు మెడిటేషన్ (ధ్యానం) చేయడం తన మానసిక ప్రశాంతతకు కారణమని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Nayanthara : తెలుగులో ఆ హీరో చాలా స్పెషల్.. కలిసి నటించడం చాలా ఇష్టం.. నయనతార..

ఆహారం విషయంలో కూడా కొన్ని మార్పులు చేసుకున్నానని గుర్తు చేసుకున్నారు. గతంలో ఇడ్లీ, దోశ వంటి టిఫిన్లు తీసుకున్నానని, కానీ ప్రస్తుతం ఉదయం పూట కేవలం నట్స్ , పండ్లను మాత్రమే తీసుకుంటున్నానని తెలిపారు. మధ్యాహ్నం భోజనం, రాత్రి పూట తేలికపాటి టిఫిన్ తో ముగిస్తానని.. న ఆహారం లేదా హిమాలయాల నీరు వంటివి ఏమీ తాగనని, సాధారణ జీవనశైలే తన అందానికి రహస్యమని ఆయన నవ్వుతూ చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Ravi Babu : 12 ఏళ్లుగా నా బ్రేక్ ఫాస్ట్ ఇదే.. అందుకే ఇలా ఉన్నాను.. డైట్ సీక్రెట్ చెప్పిన రవి బాబు..

అలాగే ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ గారిని తన దేవుడిగా భావిస్తానని, ఆయన కోసం పాటలు చిత్రీకరించేటప్పుడు ఎంతో శ్రద్ధ తీసుకునేవాడినని తెలిపారు. అలాగే శ్రీదేవి గురించి చెబుతూ.. ‘సిరిమల్లె పువ్వా’ పాట వెనుక ఉన్న జ్ఞాపకాలను పంచుకున్నారు. చివరగా, “ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, బాధ్యతగా మెలగాలి” అనే ఎన్టీఆర్ మాటలను తాను తూచా తప్పకుండా పాటిస్తానని ఆయన పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ సినిమా చేయడమే సావిత్రి తప్పు.. అక్కడే పతనం మొదలైంది.. సీనియర్ నటి జమున..

Follow Us