AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jayaprada : ఇప్పుడున్న హీరోలలో ఆ హీరో అంటే చాలా ఇష్టం.. అతడి మనసు బంగారం.. హీరోయిన్ జయప్రద..

సీనియర్ హీరోయిన్ జయప్రద గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్నాళ్లపాటు దక్షిణాది సినీ ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించి.. స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అప్పట్లో అందమైన కథానాయికగా ఓ వెలుగు వెలిగింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఇప్పుడున్న హీరోలలో తనకు ఇష్టమైన నటుడు ఎవరనే విషయాన్ని వెల్లడించింది.

Jayaprada : ఇప్పుడున్న హీరోలలో ఆ హీరో అంటే చాలా ఇష్టం.. అతడి మనసు బంగారం.. హీరోయిన్ జయప్రద..
Jaya Prada
Rajitha Chanti
|

Updated on: May 08, 2026 | 8:43 AM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ జయ ప్రద. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా తనదైన ముద్ర వేసిన ఆమె.. ఆతర్వాత సహయ నటిగా పలు చిత్రాల్లో నటించింది. కమల్ హాసన్, రజినీకాంత్ వంటి హీరోలతో నటించిన ఆమె.. గతంలో ఓ ఇంటర్వ్యూలో జయ ప్రద మాట్లాడుతూ.. వీరంతా కె. బాలచందర్ స్కూల్ నుండి వచ్చినవారే అని ఆమె గుర్తు చేసుకున్నారు. ఒకే సమయంలో పరిశ్రమలోకి రావడం, ముగ్గురూ ఉన్నత స్థానాలకు చేరుకోవడం విశేషమని పేర్కొన్నారు. అలాగే బాలకృష్ణతో తనకున్న అనుబంధం గురించి మాట్లాడుతూ, ఆయన అంటే తనకు చాలా ఇష్టమని జయప్రద అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Meena : తెలుగు సినిమాల్లో నాకు గుర్తింపు రావడానికి ఆ హీరోనే కారణం.. లేదంటే నేను లేను.. మీనా కామెంట్స్..

బాలయ్య మనసు చాలా మంచిదని, ఏ విషయాన్నైనా మొహమాటం లేకుండా ముక్కుసూటిగా మాట్లాడతారని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఆయన డైలాగ్ డెలివరీ అమోఘమని, అంత వేగంగా డైలాగులు చెప్పడానికి తనకు చాలా సమయం పడుతుందని అన్నారు. వారిద్దరూ కలిసి నటించిన ‘మహారధి’ సినిమా పెద్ద హిట్ అయిందని, మళ్ళీ అలాంటి పవర్ ఫుల్ పాత్రలు చేయాలని ఉందని తెలిపారు. తన జీవితంలో మర్చిపోలేని ఒక సంఘటనను వివరించారు. ఒకసారి ఆమె రాజమండ్రి నుండి వస్తున్నప్పుడు, భారీ వర్షాల వల్ల రైలు పట్టాలు కొట్టుకుపోయాయి. దాదాపు ప్రమాదం జరగాల్సిన రైలు తృటిలో తప్పించుకుంది. మూడు రోజుల పాటు తిండి, నీరు లేక రైలులోనే చిక్కుకుపోయారు. ఆ సమయంలో తన కుటుంబ సభ్యులు కూడా తనతో ఉన్నారని, బయట వరద నీరు ఎక్కువగా ఉండటం చూసి చాలా భయం వేసిందని ఆమె చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Raghavendra Rao: 83 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‏గా.. ఆరోగ్యంగా.. రోజూ ఉదయాన్నే తినేది ఇవే.. రాఘవేంద్రరావు..

చివరకు మూడవ రోజు ఒక రైల్వే అధికారి తనకు అన్నం, పప్పు తెచ్చి ఇచ్చారని, ఆ ఆకలి సమయంలో అది అమృతంలా అనిపించిందని గుర్తు చేసుకున్నారు. తన కెరీర్‌లో ‘అంతులేని కథ’ సినిమా చాలా ప్రత్యేకమైనదని ఆమె పేర్కొన్నారు. ప్రతి కుటుంబంలోని ఆడపిల్ల, తల్లిదండ్రులు కోరుకునే గొప్ప పాత్ర అది. మొదట ఆ పాత్రను చూసి తాను చేయగలనా అని భయపడ్డానని, కానీ బాలచందర్ గారు తన గెటప్ మార్చి, పెద్దరికం వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు. ఆ సినిమాలో తన కుటుంబం కోసం ఒక యువతి చేసే త్యాగం నేటికీ ఎందరికో స్ఫూర్తిదాయకమని, ఆ సినిమా పాటలు వింటే ఇప్పటికీ కళ్ళలో నీళ్లు తిరుగుతాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Vijay Thalapathy : ఆ ఒక్క సినిమా విడుదల కాకపోయి ఉంటే విజయ్, సంగీత పెళ్లి అయ్యేదే కాదు.. తలపతి కెరీర్ మార్చిన ఏకైక మూవీ..

Jaya Prada

Jaya Prada

ఎక్కువ మంది చదివినవి : Jaya Prada : నటనకే నటన నేర్పిన మహా నటుడు అతడు.. అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. హీరోయిన్ జయప్రద..

Follow Us
ఇప్పుడున్న హీరోలలో ఆ హీరో అంటే చాలా ఇష్టం..
ఇప్పుడున్న హీరోలలో ఆ హీరో అంటే చాలా ఇష్టం..
పుచ్చకాయ తిని కుటుంబం మృతి కేసులో ట్విస్ట్‌! ఫోరెన్సిక్ రిపోర్ట్‌
పుచ్చకాయ తిని కుటుంబం మృతి కేసులో ట్విస్ట్‌! ఫోరెన్సిక్ రిపోర్ట్‌
ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. 2026 చివరి నాటికి బంగారం ఎంత ఉంటుంద
ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. 2026 చివరి నాటికి బంగారం ఎంత ఉంటుంద
40కిపైగా సినిమాలు.. స్టార్ హీరో అవ్వాల్సినోడు.. చివరికి కమెడియన్‌
40కిపైగా సినిమాలు.. స్టార్ హీరో అవ్వాల్సినోడు.. చివరికి కమెడియన్‌
బంపర్‌ ఆఫర్‌.. ఈ 4 కార్లపై రూ.2.15 లక్షల వరకు డిస్కౌంట్
బంపర్‌ ఆఫర్‌.. ఈ 4 కార్లపై రూ.2.15 లక్షల వరకు డిస్కౌంట్
డెలాయిట్ ఉద్యోగం పేరుతో టెక్కీకి రూ.2 లక్షల మోసం.. అసలు కథ ఇదే!
డెలాయిట్ ఉద్యోగం పేరుతో టెక్కీకి రూ.2 లక్షల మోసం.. అసలు కథ ఇదే!
అమెరికాలో మాయమైన మహానగరం.. లండన్ కంటే గొప్పది! చివరికి మిగిలింది?
అమెరికాలో మాయమైన మహానగరం.. లండన్ కంటే గొప్పది! చివరికి మిగిలింది?
ఓటీటీలో దూసుకుపోతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. ట్విస్టులు చూస్తే..
ఓటీటీలో దూసుకుపోతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. ట్విస్టులు చూస్తే..
వాహనదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఇక 24 గంటల్లోనే..
వాహనదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఇక 24 గంటల్లోనే..
ఉదయం Vs సాయంత్రం.. గ్రీన్ టీ ఎప్పుడు తాగితే మంచిది..?
ఉదయం Vs సాయంత్రం.. గ్రీన్ టీ ఎప్పుడు తాగితే మంచిది..?