సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో పట్టపగలు దారుణం చోటుచేసుకుంది. బస్ స్టాండ్ వద్ద మణిదీప్ తన భార్య శిరీషను కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. గత కొంతకాలంగా వీరి మధ్య కుటుంబ కలహాలు ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.