AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుచ్చకాయ తిని కుటుంబం మృతి కేసులో ట్విస్ట్‌..! ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో షాకింగ్ నిజాలు?

ముంబైలో ఇటీవల చోటుచేసుకున్న డోకాడియా కుటుంబం అనుమానాస్పద మృతి కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు పుచ్చకాయ తిని మరణించడం వెనుక కేవలం ఫుడ్ పాయిజనింగ్ మాత్రమే లేదని, దాని వెనుక ఒక ప్రమాదకర రసాయనం ఉందని ఫోరెన్సిక్ నివేదిక నిర్ధారించింది. ఈ మేరకు వీరిది ప్రమాదమా లేక పథకం ప్రకారం జరిగిన హత్యలా అన్న కోణంలో ప్రత్యేక బృందాలు విచారణ జరుపుతున్నాయి.

పుచ్చకాయ తిని కుటుంబం మృతి కేసులో ట్విస్ట్‌..! ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో షాకింగ్ నిజాలు?
Watermelon Tragedy In MumbaiImage Credit source: Tv9 marathi
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: May 08, 2026 | 8:53 AM

Share

ముంబైలో సంచలనం సృష్టించిన డోకాడియా కుటుంబం అనుమానాస్పద మృతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. తొలుత ఫుడ్ పాయిజనింగ్‌గా భావించిన ఈ ఘటన ఇప్పుడు విషప్రయోగం అనుమానాల దిశగా మలుపు తిరిగింది. ఫోరెన్సిక్ నివేదికలో కుటుంబ సభ్యుల మరణాలకు కారణం ఫుడ్‌పాయిజన్‌ కాదని, ఎలుకలను చంపేందుకు ఉపయోగించే ప్రమాదకర రసాయనం జింక్ ఫాస్ఫైడ్ అని నిర్ధారణ కావడంతో పోలీసులు కేసును అత్యంత ప్రాధాన్యంతో దర్యాప్తు చేస్తున్నారు. ఏప్రిల్ 26 రాత్రి డోకాడియా కుటుంబ సభ్యులు ఇంట్లో పుచ్చకాయ తిన్న అనంతరం అస్వస్థతకు గురయ్యారు. కొద్ది గంటల్లోనే పరిస్థితి విషమించడంతో వారిని ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. ఈ ఘటనలో అబ్దుల్లా డోకాడియా, ఆయన భార్య నస్రీన్, కుమార్తెలు ఆయిషా, జైనబ్ మృతి చెందారు.

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ప్రారంభంలో ఇది ఫుడ్ పాయిజనింగ్ కేసు కావచ్చని పోలీసులు భావించారు. అయితే పోస్ట్‌మార్టం అనంతరం ఫోరెన్సిక్ పరీక్షల కోసం సేకరించిన నమూనాల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పుచ్చకాయ నమూనాలతో పాటు మృతుల శరీరాల్లో కూడా జింక్ ఫాస్ఫైడ్ ఆనవాళ్లు బయటపడినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా ఈ రసాయనాన్ని ఎలుకలను చంపేందుకు ఉపయోగిస్తారు. ఇది అత్యంత విషపూరిత పదార్థంగా గుర్తించబడింది. ఈ నేపథ్యంలో పుచ్చకాయలోకి ఈ రసాయనం ఎలా చేరిందనే అంశంపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. పుచ్చకాయ కొనుగోలు చేసిన ప్రదేశం, దాన్ని ఇంటికి తీసుకువచ్చిన పరిస్థితులు, కుటుంబ సభ్యులతో ఇటీవల ఎవరెవరు కలిశారు వంటి అన్ని కోణాలను పరిశీలిస్తున్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఉద్దేశపూర్వకంగా ఎవరైనా విషం కలిపారా అనే అంశాలపై ప్రత్యేక బృందాలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.

అలాగే కుటుంబ సభ్యుల వ్యక్తిగత, వ్యాపార సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు, ఇటీవల ఏర్పడిన వివాదాలపై కూడా పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. కుటుంబానికి సన్నిహితులు, పొరుగువారు, బంధువుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు. అవసరమైతే సీసీటీవీ ఫుటేజ్‌లు, కాల్ డేటా రికార్డులను కూడా పరిశీలించే అవకాశముందని సమాచారం. ఈ ఘటన ముంబైలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక కుటుంబం మొత్తంగా ప్రాణాలు కోల్పోవడం, దర్యాప్తులో విషప్రయోగం కోణం బయటపడటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఫోరెన్సిక్ నివేదిక వెలుగులోకి రావడంతో కేసు మరింత మిస్టరీగా మారిందని, పూర్తి నిజాలు బయటపడేందుకు ఇంకా సమయం పట్టే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
నేటితో ముగిసిన వేసవి సెలవులు.. రేపట్నుంచి తరగతులు ప్రారంభం
నేటితో ముగిసిన వేసవి సెలవులు.. రేపట్నుంచి తరగతులు ప్రారంభం
భక్తులకు అలర్ట్! కేదార్‌నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత,..
భక్తులకు అలర్ట్! కేదార్‌నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత,..
ఎంత మంచివారైనా వీరికి సహాయం చేయొద్దు.. చాణక్యుడి కీలక హెచ్చరిక!
ఎంత మంచివారైనా వీరికి సహాయం చేయొద్దు.. చాణక్యుడి కీలక హెచ్చరిక!
ఏసీ నుంచి నీరు లీక్‌ అవుతోందా? చిన్నపాటి ట్రిక్స్‌తో సమస్యకు చెక్
ఏసీ నుంచి నీరు లీక్‌ అవుతోందా? చిన్నపాటి ట్రిక్స్‌తో సమస్యకు చెక్
తెలియక ఈ మొక్కలను బహుమతిగా ఇస్తున్నారా? వాస్తు ప్రకారం అదృష్టం..
తెలియక ఈ మొక్కలను బహుమతిగా ఇస్తున్నారా? వాస్తు ప్రకారం అదృష్టం..
ఫ్రెంచ్ ఫ్రైస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?
ఫ్రెంచ్ ఫ్రైస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?
కుర్రాళ్లు తెగ పాడుకున్న పాట.. అనితా ఓ అనితా సింగర్ గుర్తున్నాడా.
కుర్రాళ్లు తెగ పాడుకున్న పాట.. అనితా ఓ అనితా సింగర్ గుర్తున్నాడా.
వేసవిలో నల్లబడిన చర్మానికి చెక్.. ఈ స్ట్రాబెర్రీ-తేనె ఫేస్ ప్యాక్
వేసవిలో నల్లబడిన చర్మానికి చెక్.. ఈ స్ట్రాబెర్రీ-తేనె ఫేస్ ప్యాక్
IPL 2026 Prize Money: ఐపీఎల్ 2026 విజేతపై కాసుల వర్షం..!
IPL 2026 Prize Money: ఐపీఎల్ 2026 విజేతపై కాసుల వర్షం..!
వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేయాలా.. ఫోన్‌లోని ఈ సీక్రెట్ ట్రిక్స్..
వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేయాలా.. ఫోన్‌లోని ఈ సీక్రెట్ ట్రిక్స్..