భర్త వేధిస్తున్నాడని కరెంట్‌షాక్‌తో చంపి పాతిపెట్టిన భార్య
హైదరాబాద్‌లోని KPHB కాలనీలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను కరెంట్ షాక్‌తో చంపేసి పూడ్చిపెట్టిందో మహిళ. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు సొంతూరికి వెళ్లిపోయింది. KPHB కాలనీలో నివాసం ఉంటున్న సాయిలు, కవిత దంపతులు. వీరిద్దరూ గత 15 ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్నాళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. అయితే భార్య, భర్తలిద్దికీ వేరువేరుగా వివాహేతర సంబంధాలు ఉన్నాయి.
దీంతో తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో కొన్నేళ్లుగా వేరువేరుగా ఉంటున్నారు. ఇటీవల కవిత తన సొంతూరు వెళ్లి.. భర్త సాయిలు పనికి వెళ్లి తిరిగి రాలేదని అక్కడి వారితో చెప్పింది.అనుమానం వచ్చిన ఆయన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.. భార్యే ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించారు. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ నెల 18న భర్త వేధింపులు భరించలేక సాయిలును భార్యే విద్యుత్‌షాక్ పెట్టి చంపేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అనంతరం మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు సమాచారం. దీనికి ఆమె తన చెల్లెలి భర్త సహకారం తీసుకున్నట్లు తెలిసింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చుక్క నీటి కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన మహిళ గుండెల్ని పిండేస్తున్న దృశ్యం
శివాలయంలో అద్భుతం.. తండోపతండాలుగా భక్తజనం
300 అడుగుల ఎత్తులో తలకిందులుగా ఉద్యోగి.. చివరకు..
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

