చుక్క నీటి కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన మహిళ గుండెల్ని పిండేస్తున్న దృశ్యం
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా బోరిచివారి గ్రామంలో చుక్క నీటి కోసం మహిళలు ప్రాణాలను పణంగా పెడుతున్నారు. బిందె నీటి కోసం మహిళలు సమీపంలో ఉన్న బావి వద్దకు చేరుకొని నీటిని తోడుకోవాల్సిన పరిస్థితి. అయితే బావిలో నీరు అడుగంటడంతో ఓ మహిళ బావి లోపలికి దిగి బిందెను నింపితే కాని పూట గడవని గడ్డు పరిస్థితి.
బావి లోపలికి దిగే సాహసం చేసినా కొద్దిగా అదుపుతప్పినా సదరు మహిళకు ప్రమాదం తప్పదు. ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. వైరల్ వీడియోలో ఓ మహిళ తెగిపోతున్న ఒక తాడును పట్టుకుని, ఎండిపోయిన, పాడుబడిన బావిలోకి నెమ్మదిగా దిగింది. ఆమె తన పాదాలను బావి లోపలి గోడ వెంట అసమానంగా ఏర్పాటైన రాళ్లపై జాగ్రత్తగా పెట్టుకుంటూ అతి కష్టం మీద కిందకు దిగింది. ఆ బావి చుట్టూరా నీళ్ల కోసం వచ్చిన మహిళలు, గ్రామస్తులు ఆందోళనగా చూస్తున్నారు. వారిలో కొంత మంది మగవారు కూడా ఉన్నారు. అందరూ భయానక నిశ్శబ్దంతో చూస్తున్నారు. ప్రతి ఒక్కరి గుండె భయంతో కొట్టుకుంటోంది. ప్రతి ఒక్కరి కళ్ళు బావిలోకి దిగుతున్న మహిళ పాదాల వైపు చూస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శివాలయంలో అద్భుతం.. తండోపతండాలుగా భక్తజనం
300 అడుగుల ఎత్తులో తలకిందులుగా ఉద్యోగి.. చివరకు..
బాబోయ్.. కొత్త రకం డయాబెటీస్.. ఎవరికి వస్తుందో తెలుసా?
ఈత కొడుతున్న గబ్బిలం.. వీడియో చూసి షాకవుతున్న నెటిజన్లు
అరే.. ఎవర్రా నువ్వు.. చలివేంద్రం లో ఇదేం పనిరా.. సైలెంట్ గా వచ్చి..
వీళ్లు అసలు మనుషులేనా ??
తమిళ స్వాముల దౌర్జన్యం.. లక్ష ఇవ్వకపోతే శపిస్తాం
ఎవడ్రా వీడు.. మటన్ ఉడకలేదు.. పోలీస్ కేసు పెట్టాడు..
బరువు పెరిగితే.. జీతంలో కోత ?? ఇదేం రూల్ రా నాయనా..
అత్తాపూర్లో రెచ్చిపోయిన దొంగలు.. గంటల వ్యవధిలోనే..
సార్.. మీ కాళ్లు మొక్కుతా.. నన్ను పాస్ చేయండి
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం

