అరే.. ఎవర్రా నువ్వు.. చలివేంద్రం లో ఇదేం పనిరా.. సైలెంట్ గా వచ్చి..
బంగారం, డబ్బు, విలువైన వస్తువులు, వాహనాలు, పక్క ప్లాన్ వేసి దొంగిలించే వాళ్ళని కామన్ గా చూస్తుంటాం.. కానీ మనోడి రూటే సెపరేటు.. కాదేదీ చోరీకి అనర్హం అన్నట్టుగా మట్టి కుండను కూడా వదిలేదనుకున్నాడు.. వేసవిలో చాలామంది రోడ్డు పైన వెళ్లే పాదచారులు, వాహనదారుల దాహార్తి తీర్చడం కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేస్తుంటారు.
అలా ఏర్పాటు చేసిన ఓ చలివేంద్రం దగ్గరకు ఓ ఆటో డ్రైవర్ వచ్చాడు. లోపలికి వెళ్లి కుండపైన మూత తీసి చూశాడు. అందులో నీళ్లు లేకపోవడంతో నిరాశతో బయటకు వచ్చేశాడు. ఆ తర్వాతే ఉంది అసలు ట్విస్ట్ అంతా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నీళ్లకోసం చలివేంద్రంలోకి వెళ్లిన ఆటో డ్రైవర్ కుండలో నీళ్లు లేకపోవడంతో అక్కడే కాసేపు అటూ ఇటూ తిరుగుతూ రెక్కీ నిర్వహించాడు. అనంతరం తనను ఎవరూ గమనించడంలేదని, సమీపంలో ఎవరూ లేరని భావించిన ఆటో డ్రైవర్ నేరుగా వెళ్లి చలివేంద్రంలో ఉన్న కుండను తీసుకొని ఆటోలో వేసుకొని వెళ్లిపోయాడు. నీళ్లు తేవడానికి అనుకునేరు.. కుండ బావుందని ఎత్తుకెళ్లిపోయాడు. ఇదంతా అక్కడి సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఈ విచిత్ర సంఘటన వరంగల్ లోని నాయుడు పెట్రోల్ బంక్ సమీపంలో జరిగింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చడం కోసం స్థానికులు ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.. అయితే అక్కడ మానిటరింగ్ కోసం సీసీ కెమెరాలు కూడా అమర్చారు. ఆ కుండలో నీళ్లను నింపడం కోసం వచ్చిన చలివేంద్రం నిర్వాహకులు కుండ కనిపించకపోవడంతో షాక్ అయ్యారు..సీసీ కెమెరాల్లో సీన్ చూసి ఖంగు తిన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోడ్డు మధ్యలో ప్రత్యక్షమైన కుర్చీ.. ఆ తర్వాత ??
అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే
ఆలయంలో నాగుపాము ప్రత్యక్షం: అమ్మవారి మహిమంటూ భక్తుల పూజలు
అవతార్ లో మనిషి భూమి మీద పుట్టాడురా.. ఏం జరిగిందో తెలిస్తే షాక్.
ప్రీ వెడ్డింగ్ షూట్ లో.. పిచ్చి పీక్స్‌కు..
వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు
ఆ ఊర్లోకి ఐస్‌క్రీం బండి వెళ్లాలంటే హడల్

