రోడ్డు మధ్యలో ప్రత్యక్షమైన కుర్చీ.. ఆ తర్వాత ??
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరూ నెట్టింట ప్రత్యక్షమవుతున్నారు. చిన్న, పెద్ద, తేడా లేకుండా అందరూ వివిధ రకాల వీడియోలు, రీల్స్, స్టంట్స్ చేస్తూ నెట్టింట పాపులర్ అయ్యేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో సమయం, సందర్భం, ప్రదేశంతో పనిలేకుండా ఎక్కడపడితే అక్కడ..ఎలాపడితే అలా రీల్స్ చేస్తున్నారు.
అలా రీల్స్ చేసిన ఓ యువకుడిని పోలీసులు తీసుకెళ్లి కటకటాల్లో పడేశారు. ఎందుకనుకుంటున్నారా.. నడిరోడ్డుపై కుర్చీ వేసుకుని కూర్చుంటే జైల్లో పెట్టక ఏంచేస్తారు మరి? ఈ ఘటన బెంగళూరులో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. బెంగళూరులోని మగడి రోడ్డులో ఏప్రిల్ 12న ఓ యువకుడు రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకుని టీ తాగుతూ రీల్ చేశాడు. అనంతరం దానిని తన ఇన్‌స్టా ఖాతాలో పోస్టు చేశాడు. అది కాస్తా వైరల్ అయి పోలీసుల దృష్టికి చేరడంతో యువకుడికి శ్రీకృష్ణ జన్మస్థానమే గతి అయింది. రీల్ ద్వారా నిందితుడిని ట్రాక్ చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను పోలీసులు ఎక్స్‌లో షేర్ చేశారు. ప్రజల భద్రతకు విఘాతం కలిగించే ఇలాంటి స్టంట్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

