చాట్‌జీపీటీ.. ఏ పుచ్చకాయ తియ్యగా ఉందో కాస్త చెప్పవా ??
తియ్యని పుచ్చకాయ కొనడంలో ఓ వ్యక్తి చాట్‌జీపీటీ సాయం తీసుకున్నాడు. అన్ని కాయలను పరిశీలించిన చాట్ జీపీటీ.. ఒక మంచి కాయను సెలెక్ట్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఓపెన్‌ఏఐ కి చెందిన ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ వినియోగించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సందేహాలు, సమాచారం కోసం దీన్ని ఎక్కువగా వాడుతున్నారు.
చిక్కు ప్రశ్నలకు సైతం సులువుగా సమాధానం ఇవ్వగలదు. తాజాగా ఓ యూజర్ పుచ్చకాయను కొనడంలో దీని సాయం తీసుకున్నాడు. మంచి కాయను ఎంపిక చేయడంతో అతడు ఆశ్చర్యానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవల ఓ వ్యక్తి పుచ్చకాయను కొనేందుకు వెళ్లాడు. అయితే.. అక్కడున్న వాటిలో ఒక కాయను ఎంపిక చేసుకునేందుకు తన ఫోన్ కెమెరాను ఓపెన్ చేసి పుచ్చకాయలన్నింటిని చూపిస్తూ ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ సాయం తీసుకున్నాడు. వీటిలో ఒక తియ్యటి కాయను ఎంపిక చేయాలని కోరాడు. ఒక్కొక్క కాయను చూపుతూ చాట్‌జీపీటీ సలహా తీసుకున్నాడు. కొన్నింటిని పరిశీలించిన చాట్ జీపీటీ.. ఒక కాయను ఎంపిక చేసింది. దాన్ని కట్ చేసి చూడగా ఎర్రటి రంగు, తియ్యటి రుచి ఉండడంతో ఆ యూజర్ సంతోషానికి అవధుల్లేవు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘ఇది నిజంగా పని చేస్తోంది’’.. ‘‘ఇకపై మానవుల చిన్న చిన్న అవసరాలు తీర్చేందుకు కూడా ఏఐ ఉపయోగపడుతుంది’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రమాదంలో గాయపడిన కొండముచ్చు.. స్థానికులు ఏం చేశారంటే
మరో గ్రహంపై జీవం ?? ఇవిగో ఆధారాలు
ఎక్కడ పడితే అక్కడ జ్యూస్ తాగుతున్నారా ??
ఆకలి మీదున్న పాము.. తేలును ఎలా మింగేసిందో చూడండి.. బాబోయ్
పదిహేను అడుగుల కింగ్ కోబ్రాల సయ్యాట.. ఎంత భయానకంగా ఉంటుందో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

