ప్రమాదంలో గాయపడిన కొండముచ్చు.. స్థానికులు ఏం చేశారంటే
ఇలాంటివి చూసినప్పుడే మనుషుల్లో కాస్తయినా మానవత్వం బతికే ఉందని అనిపిస్తుంది. ఎంతసేపు మన గురించి తప్ప పక్కవాడి బాధ పట్టని మనకు.. మూగజీవుల పట్ల దయ, కనికరం చూపించడం చాలా గొప్ప విషయమే. ఆపదలో ఉన్నవాళ్లకు చేతనైన సాయం చేసేవాళ్లు నిజంగా మనుషుల్లో దేవుడు అనే చెప్పాలి.
అలాంటిదే ఈ సంఘటన కూడా.. కానీ, ఇక్కడ ఆపదలో ఉన్నది మనిషి కాదు.. ఓ కొండముచ్చు. అయినా సరే.. పెద్ద మనసుతో దానికి నీళ్లు తాగించి. గాయానికి మందు రాసి.. మనుసున్న మనుషులు అనిపించుకున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు జాతీయ రహదారిపై ఓ కొండముచ్చు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో కొండముచ్చుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు ఆ కొండముచ్చు గాయాలకు చికిత్స చేశారు. మంచినీళ్ళు తాగించారు. తన పరిస్థితిని గమనించి సాయం చేసిన జనాల పట్ల ఆ కొండముచ్చు కృతజ్ఞతగా చూడడం అక్కడివారిని కదిలించింది. కొండముచ్చుకు అయిన గాయాలకు ప్రథమ చికిత్స చేసిన అనంతరం స్థానికులు ఆ మూగజీవిని ఆసుపత్రికి తరలించారు. సాటిమనిషికి సాయం చేసేవారే కరువవుతున్న ఈ రోజుల్లో ఓ మూగజీవికి సాయం అందించడం చాలా గొప్ప విషయం. సమయానికి కొండముచ్చుకి సపర్యలు చేసి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించిన స్థానికులు, వాహనదారులను పలువురు మెచ్చుకుంటున్నారు. నిజానికి మనిషికి మనిషే సాయం చేయని ఈ రోజుల్లో.. ఓ మూగజీవిని ఇలా ఆదుకోవడం నిజంగా పెద్ద విషయమే.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మరో గ్రహంపై జీవం ?? ఇవిగో ఆధారాలు
ఎక్కడ పడితే అక్కడ జ్యూస్ తాగుతున్నారా ??
ఆకలి మీదున్న పాము.. తేలును ఎలా మింగేసిందో చూడండి.. బాబోయ్
పదిహేను అడుగుల కింగ్ కోబ్రాల సయ్యాట.. ఎంత భయానకంగా ఉంటుందో తెలుసా ??
రాములోరి గుడి సమీపాన అదో మాదిరి ఆకారం.. వెళ్లి చూసి.. ఖంగుతిన్న భక్తులు
బయట రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు ఏపీ గురించి సలహాలు.. ఇవ్వొద్దు
తెలుగునాడుగా మార్చండి.. గరికపాటి సంచలన వ్యాఖ్యలు
ఇదేంటి సామీ.. ఏకంగా పాముతో సమావేశానికి వచ్చావ్
బంపర్ ఆఫర్ కొట్టిన మెకానిక్..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు !!
పరమభక్తుడు.. శఠగోపానికే శఠగోపం పెట్టాడుగా!
కాయ్ రాజా కాయ్.. ఎంత డబ్బు లెక్క పెడితే అంత సొమ్ము మీదే..
శ్మశానంలో మండుతున్న చితుల మధ్య "హోలీ' ఎక్కడంటే..

