ఈత కొడుతున్న గబ్బిలం.. వీడియో చూసి షాకవుతున్న నెటిజన్లు
తాజాగా గబ్బిలం ఈత కొడుతున్న వీడియో వైరల్‌గా మారింది. గబ్బిలాలు సాధారణంగా మానవ సమూహానికి దూరంగా నివసిస్తాయి. ఎక్కువగా అడవులు, పాడుబడ్డ భవనాల్లో మాత్రమే కనిపిస్తుంటాయి. గబ్బిలాలు ఎగరడానికి ఎక్కువ శక్తి అవసరం. అందుకోసం అవి ఎక్కువ తీపి, ప్రొటీన్ కలిగిన ఆహార పదార్థాలను తీసుకుంటాయి.
తమ ఆకలిని తీర్చుకోవడానికి పండ్లు, పూల రసాలు, కీటకాలను తింటాయి. ముఖ్యంగా గబ్బిలాలు కొరికిన పండ్లను మనుషులు తీసుకోవడం, అందులోని లాలాజలం ద్వారా వివిధ రకాల వైరస్‌లు మనుషులకు సంక్రమిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పైగా గబ్బిలాలన్నీ దాదాపు ఒకే సమూహంలో నివసించడం వల్ల ఒకదాని నుంచి మరొకరికి వేగంగా వైరస్‌లు వ్యాపిస్తాయి. ఈ కారణం వల్లనే మనుషులు ఎక్కువగా వివిధ రకాల వైరస్ ల బారిన పడుతున్నారట. గతంలో కేరళలో నిపా వైరస్ అల్లకల్లోలం సృష్టించినప్పుడు పండ్లు తినకండని సూచించడం గబ్బిలాలు ఎలా వైరస్‌లు వ్యాప్తి చేస్తాయో ప్రత్యక్ష నిదర్శనం. రాత్రుళ్లు ఆహార వేటలో ఉండే గబ్బిలాలు తెల్లారేసరికి తిరిగి చెట్ల వద్దకు చేరుకుంటాయి. హిందూ సంప్రదాయం ప్రకారం ఎన్నో విశ్వాసాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా కొన్ని రకాల పనులను అశుభంగా పరిగణిస్తుంటాం. ఇలాంటి వాటిలో ఒకటి గబ్బిలాలు ఇంట్లోకి రావడం. గబ్బిలం ఒకవేళ ఇంట్లోకి వస్తే అశుభంగా భావిస్తుంటారు. నిజానికి గబ్బిలాలు పెద్దగా జనావసాల్లో కనిపించవు. దేవాలయాల దగ్గర లేదా పెద్ద పెద్ద చెట్ల వద్ద ఆవాసాలు ఏర్పరుచుకొని జీవిస్తుంటాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అరే.. ఎవర్రా నువ్వు.. చలివేంద్రం లో ఇదేం పనిరా.. సైలెంట్ గా వచ్చి..
రోడ్డు మధ్యలో ప్రత్యక్షమైన కుర్చీ.. ఆ తర్వాత ??
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

