బాబోయ్.. కొత్త రకం డయాబెటీస్.. ఎవరికి వస్తుందో తెలుసా?
మధుమేహం సునామీలా విరుచుకుపడుతోందా? ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది బాధపడుతుండగా.. ఓ 25 కోట్ల మందికి అసలు తమకు జబ్బున్న సంగతే తెలియక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఆరోగ్య సేవలు అందుబాటులో లేకపోవటం, మధుమేహాన్ని గుర్తించే వ్యవస్థలు తగినంత లేకపోవటం, ముఖ్యంగా పేద, మధ్య తరగతికి చెందినవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది.
మన దేశ ప్రజలు తక్షణం అలర్ట్ అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. గత వారం ఇంటర్నేషనల్ డయాబిటిస్ ఫెడరేషన్ విడుదల చేసిన డయాబిటిస్ అట్లాస్ ఇదే చెబుతోంది. 21వ శతాబ్దపు అతిపెద్ద ఆరోగ్య సమస్యల్లో ఇదొకటని హెచ్చరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మధుమేహం ఉన్న ప్రతి ఏడుగురిలో ఒకరు మన దేశానికి చెందినవారే. సంఖ్యా పరంగా చైనా తొలి స్థానం ఆక్రమించగా.. మనదేశం రెండో స్థానంలో ఉంది. మనదేశంలో డయాబిటిస్ పెరుగుతున్న తీరుకు ఇది అద్దం పడుతోంది. పట్టణీకరణ, జీవనశైలి మారటం మాత్రమే కాదు.. ఇప్పుడు వాతావరణ, ఆహారం, నీరు కాలుష్యమూ మధుమేహానికి పెను శాపంగా మారాయి. క్రిమి సంహారక మందులు, రసాయనిక ఎరువుల అవశేషాలు.. సూక్ష్మ ప్లాస్టిక్ రేణువుల వంటివి తీవ్ర అనర్థం కలిగిస్తున్నాయి. కాబట్టి కాలుష్యాన్ని అరికట్టటం, దీని బారినపడకుండా చూసుకోవటం తక్షణావసరమని గుర్తించాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈత కొడుతున్న గబ్బిలం.. వీడియో చూసి షాకవుతున్న నెటిజన్లు
అరే.. ఎవర్రా నువ్వు.. చలివేంద్రం లో ఇదేం పనిరా.. సైలెంట్ గా వచ్చి..
రోడ్డు మధ్యలో ప్రత్యక్షమైన కుర్చీ.. ఆ తర్వాత ??
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

