Video: విజయానికి 6 పరుగులు.. చేతిలో 5 వికెట్లు.. కట్‌చేస్తే.. W,W,W హ్యాట్రిక్‌తో నరాలు తెగే ఉత్కంఠ
T20I Match: టీ20లో ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పలం.. విజయం దిశగా సాగే జట్టు.. మరుక్షణంలో ఓటమిపాలవ్వడం సాధారణంగా కనిపిస్తూనే ఉంటుంది. ఇది టీ20 లీగ్ అయినా లేదా టీ20 అంతర్జాతీయ మ్యాచ్ అయినా ప్రేక్షకులకు ఎనలేని థ్రిల్ అందిస్తుంటుంది. ఇలాంటి ఓ మ్యాచ్ క్రికెట్ చరిత్రలో ఉంది.

టీ20 లీగ్ అయినా, టీ20 అంతర్జాతీయ మ్యాచ్ అయినా ఉత్కంఠ వేరే లెవల్‌కి చేరుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ పోరు చివరి ఓవర్‌కు చేరిందంటే చాలు.. స్టేడియంలోని ప్రేక్షకులే కాదు.. టీవీల ముందు కూర్చున్న ఫ్యాన్స్‌కు కూడా ఉత్కంఠ ఓ రేంజ్‌లో ఉంటుంది. తాజాగా ఇలాంటి మ్యాచ్ క్రికెట్ హిస్టరీలో ఒకటి ఉందని మీకు తెలుసా? చివరి ఓవర్లో విజయానికి దగ్గరగా ఉన్న జట్టు కేవలం 6 పరుగులు చేస్తే విజయం సాధించేందుకు సిద్ధంగా ఉంది. చేతిలో 5 వికెట్లు ఉన్నాయి. అలాంటి సమయంలో ఊహించిన మలుపు తిరిగింది. 2023లో బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ బౌలర్ అద్భుత బౌలింగ్ బంగ్లాదేశ్‌ను ఊపిరి పీల్చుకునేలా చేసింది.
155 పరుగుల లక్ష్యం..
బంగ్లాదేశ్ జట్టుకు షకీబ్ అల్ హసన్ నాయకత్వం వహించాడు. అతను టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. బంగ్లాదేశ్ ముందు అఫ్గానిస్తాన్ 155 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బంగ్లాదేశ్ నుంచి అద్భుతమైన బౌలింగ్ కనిపించింది. కెప్టెన్ షకీబ్ 2 వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ నబీ అర్ధ సెంచరీతో అఫ్గాన్ జట్టు 154 పరుగులు చేసింది.
విజయం అంచున ఊహించని ట్విస్ట్..
స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ జట్టుకు అదిరిపోయే ఆరంభం అందింది. ఫలితంగా బంగ్లా జట్టు 5 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కానీ, అసలైన థ్రిల్ చివరి ఓవర్‌కు చేరుకుంది. కరీం జనత్ అద్భుతంగా బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. బంగ్లాదేశ్ విజయానికి కేవలం 2 పరుగులు మాత్రమే అవసరం. ఈ బ్యాట్స్‌మన్ చివరి ఓవర్‌లో హ్యాట్రిక్ సాధించి విధ్వంసం సృష్టించాడు.
చివరి ఓవర్లో 6 పరుగులు అవసరం..
చివరి ఓవర్లో బంగ్లాదేశ్ జట్టుకు 6 పరుగులు అవసరం. బంతి ఆఫ్ఘన్ బౌలర్ కరీం జనత్ చేతికి చేరింది. మొదటి బంతికే బంగ్లా బ్యాటర్ ఫోర్ కొట్టాడు. జట్టు గెలవడానికి 5 బంతుల్లో 2 పరుగులు అవసరం. కానీ, కరీం జనత్ రెండో బంతికి మెహదీ హసన్ మీరాజ్‌ను, మూడో బంతికి తస్కిన్ అహ్మద్‌లను అవుట్ చేశాడు. ఆపై నాల్గవ బంతిని ఎదుర్కొన్న నసుమ్ అహ్మద్‌ను అవుట్ చేశాడు. ఇప్పుడు బంగ్లాదేశ్ రెండు వికెట్లు మిగిలి ఉన్నాయి. గెలవడానికి రెండు బంతుల్లో రెండు పరుగులు మాత్రమే అవసరం. అయితే బంగ్లా బ్యాటర్ షోరిఫుల్ ఇస్లాం ఆఫ్ఘాన్ హ్యాట్రిక్ సెలబ్రేషన్స్‌కు అడ్డుకట్టు వేశాడు. దీంతో బంగ్లాదేశ్ జట్టు ఒక బంతి మిగిలి ఉండగానే 2 వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచింది. మ్యాచ్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








