Video: ఇదేం బౌలింగ్ భయ్యా.. అర్థమయ్యేలోపే క్లీన్ బౌల్ట్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
Viral Video: పంజాబ్ లో జరిగిన క్రికెట్ టోర్నమెంట్లో ఓ యువకుడు వినూత్న బౌలింగ్ శైలితో ఆకట్టుకుంటున్నాడు. ఏ చేతితో బౌలింగ్ చేస్తున్నాడో బ్యాటర్లకు అర్థం కావడం లేదు. ఈ తికమక బౌలింగ్ తో బంతిని అంచనా వేయలేక బ్యాటర్లు పెవిలియన్ చేరుతున్నారు. దీంతో ఈ యువ బౌలర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు.

Cricket Viral Video: భారత్‌లో ప్రస్తుతం ఐపీఎల్ 2025 ఉత్కంఠగా సాగుతోంది. అలాగే, పాకిస్తాన్‌లో పీఎస్‌ఎల్ కూడా జరుగుతోంది. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా క్రికెటర్లంతా తమ సత్తా చాటుతున్నారు. అలాగే, పలు చోట్ల దేశీయ మ్యాచ్‌లతోపాటు లోకల్ టోర్నమెంట్లు కూడా జరుగుతున్నాయి. అయితే, వీటికి సంబంధించిన వీడియోలు, ఫన్నీ క్లిప్పులు, పలు రికార్డులతో సోషల్ మీడియాలో మోత మోగుతోంది. ఈ క్రమంలో తాజాగా మరో క్రికెట్ వీడియో వచ్చి చేరింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఆ వివరాలేంటో ఓసారి చూద్దాం..
పంజాబ్ లో జరిగిన క్రికెట్ టోర్నమెంట్లో ఓ యువకుడు వినూత్న బౌలింగ్ శైలితో ఆకట్టుకుంటున్నాడు. ఏ చేతితో బౌలింగ్ చేస్తున్నాడో బ్యాటర్లకు అర్థం కావడం లేదు. ఈ తికమక బౌలింగ్ తో బంతిని అంచనా వేయలేక బ్యాటర్లు పెవిలియన్ చేరుతున్నారు. దీంతో ఈ యువ బౌలర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు.
యూనిక్ బౌలింగ్ యాక్షన్ వీడియో..
Veedni dimpandra next match ki @SunRisers I’m not even joking 🔥🔥🔥🥵🤣🤣pic.twitter.com/4e9Y3JJue3
— kaushik (@BeingUk7) April 18, 2025
ఇక వీడియో విషయానికి వస్తే.. ఎడమ చేతితో బాల్ అందుకున్న ఈ బౌలర్.. చేతులను వెనుకకు, ముందుకు తిప్పుతూ, ఓ చేతి నుంచి మరో చేతికి బాల్‌ను మార్చుతూ చివరికి కుడి చేతితో బౌలింగ్ చేశాడు. ఇదంతా గమనించిన బ్యాటర్‌కు ఏం అర్థం కాకపోవడం, క్లీన్ బౌల్డ్ అవ్వడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఈ యంగ్ బౌలర్ బౌలింగ్ యాక్షన్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..