AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: మా జట్టును భారత్‌ పంపించలేం.. బీసీసీఐకి బెదిరేది లేదు: షాకిచ్చిన పీసీబీ చైర్మన్

Women's ODI World Cup 2025: ఈ ఏడాది చివర్లో జరిగే ఐసీసీ వన్డే ప్రపంచ కప్ కోసం తమ మహిళా జట్టు భారతదేశానికి వెళ్లదని, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ శనివారం ప్రకటించారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆమోదించిన హైబ్రిడ్ మోడల్‌ను ఆమోదించిన సంగతి తెలిసిందే. అంటే, తటస్థ వేదికల్లో మ్యాచ్‌లు ఆడేందుకు ఇరు దేశాల ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

IND vs PAK: మా జట్టును భారత్‌ పంపించలేం.. బీసీసీఐకి బెదిరేది లేదు: షాకిచ్చిన పీసీబీ చైర్మన్
Ind Vs Pak
Venkata Chari
|

Updated on: Apr 20, 2025 | 9:08 AM

Share

Women’s ODI World Cup 2025: ఈ ఏడాది చివర్లో జరిగే ఐసీసీ వన్డే ప్రపంచ కప్ కోసం తమ మహిళా జట్టు భారతదేశానికి వెళ్లదని, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ శనివారం ప్రకటించారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆమోదించిన హైబ్రిడ్ మోడల్‌ను ఆమోదించిన సంగతి తెలిసిందే. అంటే, తటస్థ వేదికల్లో మ్యాచ్‌లు ఆడేందుకు ఇరు దేశాల ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించిన సమయంలో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల కారణంగా భారత జట్టును సరిహద్దు దాటి పంపడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిరాకరించింది. ఈ క్రమంలో మ్యాచ్‌లు దుబాయ్‌లో జరిగిన సంగతి తెలిసిందే.

భారత్, పాకిస్తాన్ రెండూ ఐసీసీ ఈవెంట్‌లను నిర్వహిస్తే తటస్థ వేదికలలో తమ మ్యాచ్‌లను హైబ్రిడ్ మోడల్‌లో ఆడేందుకు ఒప్పందం కుదిరింది. “ఛాంపియన్స్ ట్రోఫీలో భారతదేశం పాకిస్తాన్‌లో ఆడలేదు. తటస్థ వేదికలో ఆడటానికి అనుమతించినట్లే, మా జట్టుకు కూడా అలానే ఛాన్స్ ఇవ్వాలి” అని నఖ్వీ అన్నారు. ఒక ఒప్పందం ఉన్నప్పుడు, దానిని పాటించాలి. ఈ టోర్నమెంట్‌కు ఆతిథ్యమిస్తోంది భారత్ కాబట్టి, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)తో మాట్లాడి తటస్థ వేదికను నిర్ణయిస్తాయని పీసీబీ చీఫ్ తెలిపారు.

హైబ్రిడ్ మోడల్‌లో పాకిస్తాన్ మ్యాచ్‌లు..

ఇటీవల, పాకిస్తాన్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించిన సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల కారణంగా భారత జట్టును పాకిస్తాన్ పంపడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిరాకరించింది. దీంతో భారత జట్టు మ్యాచ్‌లు దుబాయ్‌లో జరిగాయి. ఈ క్రమంలో భారత్, పాకిస్తాన్ రెండూ ఐసీసీ ఈవెంట్‌లను నిర్వహిస్తే తటస్థ వేదికలలో తమ మ్యాచ్‌లను ఆడేందుకు అంటే హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించిన సంగతి తెలిసిందే.

సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 26 వరకు..

సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 26 వరకు జరిగే ఈ టోర్నమెంట్‌కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. దీనిలో ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. పాకిస్తాన్ మహిళా జట్టు ప్రపంచ కప్‌నకు అర్హత సాధించిన తీరు పట్ల నఖ్వీ సంతృప్తి వ్యక్తం చేశారు. లాహోర్‌లో జరిగిన క్వాలిఫయర్‌లో పాకిస్తాన్ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. ఐర్లాండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్, థాయిలాండ్, బంగ్లాదేశ్‌లను ఓడించి ప్రధాన రౌండ్‌కు అర్హత సాధించింది. దీనికి ఆతిథ్య భారతదేశం, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక ఇప్పటికే అర్హత సాధించాయి.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..