- Telugu News Photo Gallery Sports photos KL Rahul's 200th IPL Six: Delhi Capitals Star Achieves Milestone
DC vs GT: కేఎల్ రాహుల్.. 200 నాటౌట్! ఇది కదా రికార్డ్ అంటే..
ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న కెఎల్ రాహుల్ తన 200వ సిక్స్‌ను పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్‌లో అతని అద్భుతమైన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతని సిక్స్ తో రాహుల్ ఈ రికార్డ్ అందుకున్నాడు.
SN Pasha |
Updated on: Apr 19, 2025 | 7:50 PM

ఐపీఎల్ 2025లో కొత్త జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న కేఎల్ రాహుల్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు అద్భుతంగా రాణిస్తున్నాడు. ప్రతి మ్యాచ్‌లోనూ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు ఇస్తున్న రాహుల్ గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఒక్క సిక్స్ కొట్టి రికార్డు సృష్టించాడు.

గుజరాత్ పేసర్ మహ్మద్ సిరాజ్ బంతిని అద్భుతంగా సిక్స్ కొట్టడం ద్వారా ఐపీఎల్‌లో తన 200వ సిక్స్‌ను పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన ఆరో భారత ఆటగాడిగా రాహుల్ నిలిచాడు. రాహుల్ కంటే ముందు రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, యువరాజ్ సింగ్ ఈ రికార్డు సాధించారు.

ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు వెస్టిండీస్ మాజీ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ పేరిట ఉంది. అతను కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ తరపున 142 మ్యాచ్‌లు ఆడి మొత్తం 357 సిక్సర్లు కొట్టాడు.

గేల్ తర్వాత రోహిత్ శర్మ (286), విరాట్ కోహ్లీ (282), ఎంఎస్ ధోని (260), ఎబి డివిలియర్స్ (251), డేవిడ్ వార్నర్ (236), కీరన్ పొలార్డ్ (223), సంజు సామ్సన్ (216), ఆండ్రీ రస్సెల్ (212), సురేష్ రైనా (213) పేర్లు జాబితాలో ఉన్నాయి.

ఐపీఎల్ 2025 ప్రస్తుత మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 79 పరుగులు చేసి ఉంటే, అతను ఐపీఎల్‌లో 5000 పరుగులు పూర్తి చేసి ఉండేవాడు. ఇదే జరిగి ఉంటే, అతను 5000 పరుగులు చేసిన అత్యంత వేగవంతమైన బ్యాట్స్‌మన్‌గా నిలిచేవాడు. కానీ రాహుల్ కేవలం 28 పరుగులకే ఇన్నింగ్స్ ముగించి ఈ రికార్డును కోల్పోయాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో, మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కెఎల్ రాహుల్ తన ఇన్నింగ్స్‌లో 14 బంతుల్లో 4 ఫోర్లు, 1 విధ్వంసకర సిక్స్‌తో 28 పరుగులు చేశాడు.



















