AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Air Coolers: హాట్ సమ్మర్‌లో కూల్ కూల్.. చల్లని గాలిని అందించే బెస్ట్ ఎయిర్ కూలర్లు ఇవే..!

వేసవి కాలం వచ్చేయడంతో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు ఉదయం 8 గంటల నుంచి నిప్పులు చెరుగుతున్నాడు. వేడిని భరించలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చల్లని గాలి కోసం ఏసీలు, ఎయిర్ కూలర్లపై ఆధారపడుతున్నారు. అయితే ఏసీలను కొనుగోలు చేయడం సామాన్యులకు సాధ్యం కాదు. దీంతో కూలర్లనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం లేటెస్టు టెక్నాలజీతో అనేక కూలర్లు అందుబాటులోకి వచ్చాయి. చల్లదనాన్ని అందించడంలో ఏసీలతో పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ లో అత్యంత తక్కువ ధరకు ప్రముఖ బ్రాండ్ల కూలర్లు అందుబాటులో ఉన్నాయి. వాటి ధరలు, ఇతర ప్రత్యేతకలు తెలుసుకుందాం.

Nikhil
|

Updated on: Apr 26, 2025 | 12:19 PM

Share
ప్రముఖ బ్రాండ్ బజాజ్ నుంచి విడుదలైన పీఎక్స్97 ఎయిర్ కూలర్ చిన్న గదులకు చక్కగా సరిపోతుంది. డ్యూరామెరైన్ పంపుతో నీటి విడుదల చక్కగా ఉంటుంది. హెక్సాకాంబ్ టెక్నాలజీతో నీటి కారణంగా తడిచిన ప్యాడ్ ల నుంచి దుర్వాసనను నియంత్రించొచ్చు. టర్బో ఫ్యాన్ సాంకేతికతో గదిలోని ప్రతి మూలకు గాలి వీస్తుంది. దీనిలోని మూడు స్పీడ్ ఎంపికల ద్వారా వినియోగదారులు తమకు సౌకర్యంగా ఉండేలా గాలిని నియంత్రణ చేసుకోవచ్చు. 35 లీటర్ల ట్యాంక్ సామర్థ్యం కలిగిన ఈ ఎయిర్ కూలర్ అమెజాన్ లో రూ.5,749కి అందుబాటులో ఉంది.

1 / 5
చిన్న, మధ్య తరహా గదులకు క్రాంప్టన్ ఓజోన్ ఎయిర్ కూలర్ మంచి ఎంపిక. దీనిలో 75 లీటర్ల ట్యాంకు ఏర్పాటు చేశారు. దీంతో నీటిని రోజూ నింపుకొనే అవసరం ఉండదు. ట్యాంకులో నీరు అయిపోతే వెంటనే అలారం మోగుతుంది. ఆటోఫిల్ ఫీచర్, ఐస్ చాంబర్, రిమోట్ నియంత్రణ అదనపు ప్రత్యేకతలు. వేడి వాతావరణంలోనూ చల్లని గాలిని ఆస్వాదించవచ్చు. వేసవిలో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉంటాయి. క్రాంప్టన్ కూలర్ లోని ఇన్వర్టర్ తో విద్యుత్ కోతల సమయంలో శీతలీకరణకు ఇబ్బంది ఉండదు. అమెజాన్ లో రూ.9,999కు ఈ కూలర్ అందుబాటులో ఉంది.

2 / 5
హావెల్స్ 2 ఇన్ 1 కన్వర్టిబుల్ ఎయిర్ కూలర్ ఆధునిక డిజైన్ తో ఆకట్టుకుంటోంది. వినియోగంలో లేనప్పుడు దీన్ని ప్యాక్ చేసేసుకోవచ్చు. తక్కువ స్థలంలోనూ చక్కగా వినియోగించుకోవచ్చు. కేవలం 46 అంగుళాల ఎత్తు మాత్రమే ఉన్నప్పటికీ గాలి ప్రవాహం చాలా వేగంగా వస్తుంది. సుమారు 409 చదరపు అడుగుల వరకూ గదులను చల్లబరుస్తుంది. పీపీ, ఏబీఎస్ బాడీ కారణంగా డెంట్లు, గీతలు పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.  80 లీటర్ల నీటి ట్యాంకు, ఐదు రెక్కల ఫ్యాన్, తప్పు పట్టని అల్యూమినీయం బ్లేడ్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. అమెజాన్ లో రూ.16,499కి ఈ ఎయిర్ కూలర్ అందుబాటులో ఉంది.

3 / 5
అత్యంత వేడి వాతావరణంలోనూ చల్లని గాలిని అందించడం కెన్ స్టార్ మహాకూల్ ఎయిర్ కూలర్ ప్రత్యేకత. రాజస్థాన్, గుజరాత్ తదితర వేడి ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో బాగా వినియోగిస్తారు. గదిలోని అన్ని వైపులకు చల్లని గాలిని పంపిస్తుంది. 90 లీటర్ల పెద్ద నీటి ట్యాంకు, 18 అంగుళాల ఫ్యాన్ పరిమాణం, క్యాడో ఫ్యాన్ టెక్నాలజీ, మూడు వైపులా దట్టంగా ఉండే ప్యాడ్లు దీని ప్రత్యేకతలు. మీడియం సైజు నుంచి పెద్ద తరహా గదులకు చక్కగా సరిపోతుంది. అమెజాన్ లో రూ.13,990కి ఈ ఎయిర్ కూలర్ అందుబాటులో ఉంది.

4 / 5
తక్కువ విద్యుత్ ను వినియోగించుకుని ఎక్కువ చల్లదనాన్ని అందించే కూలర్లలో సింఫనీ ఐస్ క్యూబ్ పర్సనల్ కూలర్ ఒకటి. దీనిలోని ఐస్ క్యూబ్ చల్లని గాలిని గదిలో అన్ని మూలలకు ప్రసరింపజేస్తుంది. ఇది వ్యక్తిగత కూలర్ అయినప్పటికీ దూరంగా కూర్చున్న వ్యక్తులకు కూడా చల్లని గాలిని వీచేలా ఎయిర్ బ్లోవర్ ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికి నప్పేలా మంచి డిజైన్ తో రూపొందించారు. రిమోట్ నియంత్రణ, 27 లీటర్ల ట్యాంకు, 60 డీబీ తక్కువ శబ్దం, తక్కువ విద్యుత్ వినియోగం ఈ కూలర్ ప్రత్యేకతలు. కేవలం రూ.4,999కే అమెజాన్ లో అందుబాటులో ఉంది.

5 / 5
జుట్టు రాలుతోందా..? ఈ మ్యాజిక్ జ్యూస్ తాగితే వెంటనే ఆగిపోతుంది..

మెస్సీ ప్రయాణించిన విమానం ఖరీదు ఎంతో తెలిస్తే గుండె ఆగిపోతుంది?

బాలయ్య 'అఖండ 2' మూవీలో శివుడిగా నటించింది ఎవరో తెలుసా?

గెలిపించేస్తాడు..వైభవ్ సూర్యవంశీపై కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ధీమా

ఎంతకు తెగించ్చార్రా.. బిగ్‌బాస్‌లో దుమారం..

లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ డబ్బు ఎవరు కట్టాలి.. రూల్స్..

పోలింగ్ రోజే వెంటాడిని మృత్యువు.. స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి మృతి

సంతోషాన్ని లాగేసుకున్నా నేను 'రిచ్​'నే.. నటి ఎమోషనల్ పోస్ట్!

YouTubeలో 1,000 వ్యూస్‌కు ఎన్ని డబ్బులు వస్తాయి? ఎక్కువ రావాలంటే

భల్లాల దేవ బాడీ సీక్రెట్ ఇదే..
భల్లాల దేవ బాడీ సీక్రెట్ ఇదే..