రాజమౌళి దర్శకత్వంలో నటించిన అగ్ర హీరోలంతా తమ తదుపరి చిత్రాలను సొంత బ్యానర్లు లేదా భాగస్వామ్య నిర్మాణ సంస్థల ద్వారా నిర్మిస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్, ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఈ పద్ధతిని అనుసరించారు. ఈ ట్రెండ్ కొనసాగితే, రాజమౌళితో సినిమా తర్వాత మహేష్ బాబు కూడా నిర్మాతగా మారతారా అనే చర్చ జరుగుతోంది.