మహిళలు రాత్రిపూట పొరపాటున కూడా ఈ పనులు చేయకండి.. చేస్తే ఏమవుతుందో తెలిస్తే షాకే..
Vastu Tips Fo Women: వాస్తు శాస్త్రం ప్రకారం మహిళలు రాత్రిపూట కొన్ని పనులు చేయకూడదు. కొన్ని పనులు చేయడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. వాటిని పాటించడం ద్వారా ఇంట్లో శాంతి, సానుకూలత పెరుగుతాయని, మానసిక ప్రశాంతత చేకూరుతుందని పండితులు సూచిస్తున్నారు. అసలు రాత్రిపూట ఏం చేయకూడదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

మన దైనందిన జీవితంలో మనం చేసే కొన్ని పనులు మనకు తెలియకుండానే మన ఇంటిపై, మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రిపూట పెరుగు తినడం, గోళ్లు కత్తిరించుకోవడం వంటివి అందరికీ నిషేధించబడినప్పటికీ.. మహిళలు ప్రత్యేకంగా కొన్ని పనులకు దూరంగా ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి. రాత్రి పడుకునే ముందు మహిళలు చేసే ఈ పొరపాట్లు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయని పండితులు హెచ్చరిస్తున్నారు.
జుట్టు కట్టుకుని నిద్రపోవడం
సాధారణంగా మహిళలు జుట్టు చిక్కు పడకుండా ఉండాలని రాత్రిపూట గట్టిగా ముడి వేసుకుని లేదా కట్టుకుని నిద్రపోతుంటారు. అయితే వాస్తు ప్రకారం ముఖ్యంగా ఒంటరిగా నిద్రపోయేటప్పుడు జుట్టు కట్టుకోకూడదు. ఇలా చేయడం వల్ల దుష్ట శక్తులు లేదా ప్రతికూల శక్తులు త్వరగా ఆకర్షించబడతాయని ఒక నమ్మకం. అయితే జుట్టును పూర్తిగా విరబోసుకోవడం కంటే వదులుగా జడ వేసుకోవడం శ్రేయస్కరమని మరికొందరు పండితులు సూచిస్తుంటారు.
గాఢమైన పరిమళాలు
రాత్రిపూట మహిళలు పెర్ఫ్యూమ్ వేసుకుని నిద్రపోవడం లేదా గాఢమైన సుగంధ ద్రవ్యాలు పూసుకుని బయటకు వెళ్లడం అస్సలు చేయకూడదు. పరిమళాల వాసన ప్రతికూల శక్తులను లేదా అదృశ్య శక్తులను ప్రేరేపిస్తుందని శాస్త్రం చెబుతోంది. కాబట్టి రాత్రివేళల్లో ప్రకృతిసిద్ధమైన వాసనలకు ప్రాధాన్యత ఇవ్వాలి తప్ప, కృత్రిమ పరిమళాలకు దూరంగా ఉండాలి.
సూర్యాస్తమయం తర్వాత జుట్టు దువ్వడం
చాలా మంది మహిళలు పడుకునే ముందు జుట్టు చిక్కు తీయడం లేదా దువ్వుకోవడం చేస్తుంటారు. కానీ శాస్త్రాల ప్రకారం.. సూర్యాస్తమయం తర్వాత స్త్రీలు తల దువ్వుకోకూడదు. ఇది లక్ష్మీ దేవికి ఆగ్రహం కలిగిస్తుందని, ఇంట్లో దరిద్రం ప్రవేశిస్తుందని పెద్దలు చెబుతుంటారు. జుట్టు దువ్వడం వల్ల రాలిన వెంట్రుకలు రాత్రిపూట ఇంట్లో పడితే అది అశాంతికి దారితీస్తుంది.
రాత్రివేళ గొడవలు లేదా వాదనలు
ఇంట్లో శాంతి ఉండాలంటే మహిళలు సాయంత్రం, రాత్రి వేళల్లో తగాదాలకు దూరంగా ఉండాలి. రాత్రిపూట జరిగే వాదనలు మనసును కలుషితం చేయడమే కాకుండా, నిద్రపై చెడు ప్రభావం చూపుతాయి. దీనివల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరిగి, మానసిక అశాంతి నెలకొంటుంది. ప్రశాంతమైన మనసుతో నిద్రపోతేనే ఆ ఇంట్లో సానుకూలత పెరుగుతుంది. ఈ నియమాలు కేవలం ఆచారాలు మాత్రమే కాదు, వీటి వెనుక మానసిక ప్రశాంతత మరియు సానుకూల జీవనశైలి దాగి ఉన్నాయి. వీటిని పాటించడం ద్వారా ఇంట్లో సుఖశాంతులు ఉంటాయని భక్తుల నమ్మకం.




