Thyroid Health: థైరాయిడ్ రోగులకు విషంతో సమానం.. ఈ ఆహార పదార్థాలను వెంటనే పక్కన పెట్టండి!
ప్రస్తుత కాలంలో థైరాయిడ్ సమస్య అనేది చాలామందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య. తప్పుడు జీవనశైలి, విపరీతమైన ఒత్తిడి, పోషకాహార లోపం వల్ల ఈ గ్రంథి పనితీరు దెబ్బతింటోంది. థైరాయిడ్ హార్మోన్లు మన శరీర జీవక్రియలను నియంత్రిస్తాయి.. కాబట్టి మనం తినే ఆహారంలో చిన్న పొరపాటు జరిగినా అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. థైరాయిడ్ రోగులు పొరపాటున కూడా తినకూడని ఆహార పదార్థాలేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి.

థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు కేవలం మందులు వాడితే సరిపోదు.. ఆహార నియమాలు పాటించడం కూడా అంతే ముఖ్యం. కొందరు ఆరోగ్యకరమని భావించి తినే కూరగాయలు కూడా థైరాయిడ్ ఉన్నవారికి హాని కలిగించవచ్చు. బరువు పెరగకుండా ఉండాలన్నా, హార్మోన్ల సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలన్నా మీరు కొన్ని పదార్థాలకు దూరంగా ఉండటం తప్పనిసరి. ఆ జాబితా ఏంటో ఇప్పుడు చూద్దాం.
మెడ భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే T3, T4 హార్మోన్లు మన శరీర శక్తిని, బరువును నియంత్రిస్తాయి. ఈ గ్రంథి పనితీరులో తేడా వస్తే హైపోథైరాయిడిజం (తక్కువ హార్మోన్లు) లేదా హైపర్ థైరాయిడిజం (ఎక్కువ హార్మోన్లు) వంటి సమస్యలు వస్తాయి. ఈ రెండు పరిస్థితుల్లోనూ ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది.
థైరాయిడ్ ఉన్నవారు దూరంగా ఉండాల్సిన పదార్థాలు:
రెడ్ మీట్: థైరాయిడ్ రోగులు రెడ్ మీట్‌కు దూరంగా ఉండటం మంచిది. దీనిలోని కొలెస్ట్రాల్, శాచురేటెడ్ ఫ్యాట్స్ వల్ల బరువు వేగంగా పెరుగుతారు. ఇప్పటికే థైరాయిడ్ వల్ల బరువు పెరిగే సమస్య ఉన్నవారికి ఇది మరింత ఇబ్బంది కలిగిస్తుంది.
జంక్ ఫుడ్: నూనెలో వేయించిన పదార్థాలు, అతిగా కారం ఉన్న జంక్ ఫుడ్స్ హార్మోన్ల అసమతుల్యతను పెంచుతాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికి కారణమవుతాయి.
గ్లూటెన్ ఆహారాలు: గోధుమలు, మైదా, ఓట్స్‌లో ఉండే గ్లూటెన్ వల్ల థైరాయిడ్ రోగుల్లో రక్తపోటు, మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. వీటి వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించడం శ్రేయస్కరం.
కెఫిన్ – ఆల్కహాల్: అధికంగా టీ, కాఫీలు తాగడం లేదా మద్యం సేవించడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగిస్తుంది. అంతేకాకుండా మీరు వాడే మందుల ప్రభావాన్ని కూడా ఇవి తగ్గిస్తాయి.
కొన్ని కూరగాయలు – సోయా: క్యాబేజీ, కాలీఫ్లవర్, ముల్లంగి వంటి కూరగాయలు థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిలో ఆటంకం కలిగిస్తాయి. అలాగే సోయా ఉత్పత్తులు కూడా హార్మోన్ల ప్రక్రియపై ప్రభావం చూపుతాయి. డాక్టర్ సలహా లేకుండా వీటిని ఆహారంలో చేర్చుకోకపోవడం ఉత్తమం.
గమనిక : ఈ సమాచారం కేవలం ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. థైరాయిడ్ రకాన్ని బట్టి ప్రతి వ్యక్తికి ఆహార అవసరాలు మారుతూ ఉంటాయి. కాబట్టి మీ ఆహారంలో మార్పులు చేసే ముందు ఖచ్చితంగా మీ వైద్యుడిని లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించండి.
