Beer Side Effects: వీళ్లకు బీరు విషంతో సమానం.. కొంచెం తాగిన ఇక అంతే సంగతులు..
అంతటా న్యూ ఇయర్ జోష్ నెలకొంది.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు డిసెంబర్ 31న బుధవారం ఎంజాయ్ చేసుకునేందుకు చాలా మంది ఇప్పటినుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. మొత్తానికి.. ఏడాది చివరి రోజున.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు చాలా మంది స్నేహితులతో మద్యం తాగుతూ ఎంజాయ్ చేస్తుంటారు..

అంతటా న్యూ ఇయర్ జోష్ నెలకొంది.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు డిసెంబర్ 31న బుధవారం ఎంజాయ్ చేసుకునేందుకు చాలా మంది ఇప్పటినుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. మొత్తానికి.. ఏడాది చివరి రోజున.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు చాలా మంది స్నేహితులతో మద్యం తాగుతూ ఎంజాయ్ చేస్తుంటారు.. అయితే.. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం.. ఇది తెలిసినా.. చాలా మంది బీరు, ఆల్కాహాల్ తాగుతుంటారు.. అయితే.. కొంతమందికి మద్యం వ్యసనం.. ఎక్కువగా తాగితే.. మితి మీరితే ఆరోగ్యానికి ముప్పు కొనితెచుకున్నట్లే.. అయితే.. ఈ సమయంలో ఆరోగ్య నిపుణులు మితంగా తాగాలంటూ సూచనలు చేస్తున్నారు. కొన్ని సమస్యలున్న వారు బీరు తాగకూడదని పేర్కరొంటున్నారు.
బీరును ఎక్కువగా తాగడం వల్ల శరీరానికి తీవ్రమైన హాని కలుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఎలాంటి వారు బీరు ఎక్కువగా తాగకూడదో తెలుసుకుందాం..
సెలియక్ (ఉదరకుహర వ్యాధి) డిసీజ్ బాధితులు బీరును ఎక్కువగా తాగకూడదు.. ఇది దీర్ఘకాలిక జీర్ణ సమస్యలను సూచిస్తుందని, చిన్న పేగులను దెబ్బతీస్తుందని పేర్కొంటున్నారు. గ్లూటెన్ ఉన్న ఆహారాలు తినడం వల్ల సమస్య పెరుగుతుంది. ఇది శరీరానికి అవసరమైన పోషకాలను పొందకుండా చేస్తుంది. బీర్ అనేది గ్లూటెన్ రిచ్ డ్రింక్. అందుకే సెలియక్ డిసీజ్ బాధితులు తాగకూడదు.. ఇది పేగుల్లో వాపు, కడుపులో మంటకు దారితీయొచ్చు..
ఇంకా బరువు తగ్గాలనుకునే వారు, అధిక బరువు ఉన్నవారు బీర్ తాగకుండా ఉండటమే బెటర్.. ఎందుకంటే బీరులో ఎక్కువగా కేలరీలు ఉంటాయి.. అలాగే పోషక విలువలు తక్కువగా ఉంటాయి. దీనివల్ల బరువు పెరగవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు..
షుగర్, ప్రీడయాబెటిస్ బాధితులు బీరుకు దూరంగా ఉండాలి.. బీర్ తాగితే షుగర్ కంట్రోల్ లో ఉండదని.. రక్తంలో చక్కెర శాతం వేగంగా పెరుగుతుందని పేర్కొంటున్నారు. దీంతో పలు సమస్యల ముప్పు మరింత పెరుగుతుందని.. ఇది హైపోగ్లైసీమియాకు కూడా కారణమవుతుందని పేర్కొంటున్నారు.
గుండెల్లో మంట గుండెల్లో మంట, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్న వారు బీరుకు దూరంగా ఉండాలి.. ఇది తాగితే.. ఈ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది..
IBS – ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ సమస్య.. అంటే.. కడుపు, పేగులను ప్రభావితం చేసే వ్యాధితో బాధపడుతున్న వారు బీరుకు దూరంగా ఉండాలి.. అతిసారం, పొత్తికడుపు నొప్పి, తిమ్మిర్లు, కడుపు ఉబ్బరం, అపానవాయువు వంటి సమస్యలు ఉన్న వారు బీర్ తాగడం మానేయాలని సూచిస్తున్నారు.
మద్యం తాగడం హానికరం.. కావున బీర్, ఆల్కాహాల్ లాంటి వాటికి సాధ్యమైనంత మేరకు దూరంగా ఉండటమే బెటర్..
ఇది కూడా చదవండి: మందుబాబులకు అలర్ట్.. మద్యం తాగుతూ ఈ పదార్థాలను తిన్నారంటే డైరెక్టుగా ఆసుపత్రికే..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
