Gold Prices: సడెన్‌గా మారిన బంగారం ధరలు.. ఒక్కసారిగా రూ.6 వేలు డౌన్.. రేట్లు ఇప్పుడిలా..
బంగారం ధరలు మెల్లమెల్లగా శాంతిస్తున్నాయి. మొన్నటివరకు పెరగ్గా.. ఈ వారంలో తగ్గుతూ వస్తున్నాయి. న్యూ ఇయర్ వస్తుండటంతో బంగారం కొనుగోలు చేయలనుకునేవారికి ఇది శుభపరిణామం. ఇక సంక్రాంతి వస్తుండటంతో గోల్డ్ కొనుగోలు చేసేవారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం రేట్లు ఇలా..

గత కొద్దిరోజులుగా భారీగా పెరుగుతూ వస్తోన్న బంగారం ధరలు ఒక్కసారి కుప్పకూలాయి. సోమవారం నుంచి వరుసగా భారీగా పతనమవుతూ వస్తోన్నాయి. రోజురోజుకు గోల్డ్, వెండి రేట్లు డౌన్ అవుతూ వస్తోన్నాయి. గత వారంలో భారీగా పెరిగిన ధరలు.. ఈ వారంలో ఒక్కసారిగా ఢమాల్ అవ్వుతుండటంతో కొనుగోలుదారులకు ఊరట కలిగినట్లయింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్దం ముగియనుందనే వార్తలతో బంగారం రేట్లు తగ్గుముఖం పడుతూ వస్తోన్నాయి. ఈ వారంలో మరింతగా బంగారం ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రెండు రోజుల్లో రూ.6 వేల పతనం
సోమవారం, మంగళవారం వరుసగా రెండు రోజులు బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. రెండు రోజుల్లో బంగారం రేటు ఏకంగా రూ.6 వేలు పడిపోయింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల ఫ్యూర్ గోల్డ్ ప్రస్తుతం రూ.1,36,200 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.5700 ఈ రెండు రోజుల్లో తగ్గింది. దీంతో ప్రస్తుతం రూ.1,24,850 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.5450 తగ్గగా.. ప్రస్తుతం రూ. 1,37,460 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల ధరపై రూ.5 వేలు తగ్గింది. దీంతో ప్రస్తుతం దీని ధర రూ.1,26,000 వద్ద కొనసాగుతోంది. ఇక బెంగళూరులో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అటు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.1,36,350 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,25,000గా ఉంది.
