AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోస్టాఫీస్ స్కీమ్స్‌? స్టాక్ మార్కెట్‌? మీ డబ్బు వేగంగా పెరగాలంటే ఏది మంచిది?

డబ్బు పొదుపు చేయాలా? పోస్టాఫీస్ పథకాలా? స్టాక్ మార్కెటా? అనేది చాలామందికి సందేహం. భద్రతకు పోస్టాఫీస్ పథకాలు, అధిక రాబడులకు స్టాక్ మార్కెట్ సరైనవి. అయితే, పూర్తి పెట్టుబడిని ఒకేచోట పెట్టకుండా, రెండింటినీ కలిపి పెట్టుబడి పెట్టడం ద్వారా రిస్క్‌ను సమతుల్యం చేస్తూ మంచి రాబడులు పొందవచ్చు.

పోస్టాఫీస్ స్కీమ్స్‌? స్టాక్ మార్కెట్‌? మీ డబ్బు వేగంగా పెరగాలంటే ఏది మంచిది?
Indian Currency 4
SN Pasha
|

Updated on: Feb 19, 2026 | 12:16 AM

Share

డబ్బు పొదుపు చేయాలనుకునే చాలా మందికి ఉండే డౌట్‌ ఏంటంటే.. పోస్టాఫీస్ పథకాల్లో పెట్టుబడి పెట్టాలా? లేక స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలా? అనే అయోమయంలో ఉంటారు. డబ్బు భద్రత ముఖ్యమా? వేగంగా పెరగాలా? అనే అంశాలపై ఆధారపడి ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

పోస్టాఫీస్ పథకాలు: భద్రతకు ప్రాధాన్యం

పోస్టాఫీస్ పథకాలు ప్రభుత్వ హామీతో నడుస్తాయి. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, మంత్లీ ఇన్కమ్ స్కీమ్ వంటి పథకాలు ఉంటాయి. రిస్క్ ఉండదు. ఎందుకంటే ప్రభుత్వ హామీ ఉంటుంది. మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావం ఉండదు. వడ్డీ రేట్లు ముందే నిర్ణయించబడినందున పెట్టుబడిదారులకు స్థిరమైన ఆదాయం లభిస్తుంది. అయితే ఇక్కడ రాబడులు పరిమితంగా ఉంటాయి. సాధారణంగా పోస్టాఫీస్ పథకాల్లో వడ్డీ రేట్లు ద్రవ్యోల్బణాన్ని స్వల్పంగా మించుతాయే తప్ప, డబ్బు వేగంగా పెరిగే అవకాశం తక్కువ.

స్టాక్ మార్కెట్: అధిక రాబడి, అధిక రిస్క్

మరోవైపు స్టాక్ మార్కెట్ పెట్టుబడులు దీర్ఘకాలంలో అధిక రాబడులు ఇచ్చే అవకాశం కలిగి ఉంటాయి. మ్యూచువల్ ఫండ్లు, SIPలు, షేర్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా కాంపౌండింగ్ ప్రయోజనం పొందవచ్చు. అయితే మార్కెట్ అస్థిరత కారణంగా స్వల్పకాలంలో నష్టాలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. సరైన అవగాహన, ఓపిక, క్రమశిక్షణ లేకపోతే రిస్క్ ఎక్కువగా మారుతుంది.

ఏది బెస్ట్?

నిపుణుల అభిప్రాయం ప్రకారం డబ్బు భద్రత కావాలంటే పోస్టాఫీస్ పథకాలు, డబ్బు వేగంగా పెరగాలంటే స్టాక్ మార్కెట్ అనేది సరైన ఎంపిక. అయితే పూర్తి పెట్టుబడిని ఒకే చోట పెట్టకుండా, రిస్క్‌ను సమతుల్యం చేయడానికి రెండింటినీ కలిపి పెట్టుబడి పెట్టడం మంచిదని సూచిస్తున్నారు. పెట్టుబడి చేసే ముందు మీ ఆదాయం, లక్ష్యాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని అంచనా వేసుకోవాలి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం అత్యంత అవసరం అని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?